భూపరివేష్టిత దేశం
వికీపీడియా నుండి
ది వర్‌ల్డ్ ఫ్యాక్ట్ బుక్ ప్రకారం, ప్రపంచంలోని భూపరివేష్టిత దేశాలు. బహు భూపరివేష్టిత దేశాలను 'ఎర్ర రంగు'లో సూచించారు.
భూపరివేష్టిత దేశం (ఆంగ్లం : landlocked country) సాధారణంగా భూభాగాలచే చుట్టియున్న దేశానికి భూపరివేష్టిత దేశంగా వ్యవహరిస్తారు. దీనికి సముద్ర లేదా మహా సముద్రాల తీరమంటూ వుండదు.[1][2][3][4] ప్రపంచంలో 2008 సంవత్సరం నాటికి ఇలాంటి దేశాల సంఖ్య 44. ఆరు ఖండాలలోని ప్రతి ఖండంలోనూ ఒకటి కన్నా ఎక్కువ భూపరివేష్టిత దేశాలు గలవు. కేవలం ఉత్తర అమెరికా ఖండం మరియు ఓషియానియాలో భూపరివేష్టిత దేశమంటూ లేదు.
ఒక సముద్రము, జలసంధుల ద్వారా మాత్రమే మహాసముద్రాలతో లంకె గలిగి వుంటుంది, ఉదాహరణకు బాల్టిక్ సముద్రం, మధ్యధరా సముద్రం మరియు నల్ల సముద్రం.
అదేవిధంగా ఒక ద్వీప దేశం నీటి భాగాలతో చుట్టబడివుంటుంది.[5]
విషయ సూచిక |
[మార్చు] భూపరివేష్టిత దేశాల జాబితా
|
- † ఉప్పు నీటి కాస్పియన్ సముద్రం తీరం కలిగి వున్నది.
- ‡ ఉప్పు నీటి అరల్ సముద్రం తీరం కలిగి వున్నది.
- ¤ మొత్తం భూభాగాలచే చుట్టబడిన దేశాలు
[మార్చు] దాదాపు భూపరివేష్టితం
క్రింది దేశాలు దాదాపు భూపరివేష్టిత దేశాలు, వీటికి అతి తక్కువ సముద్రతీరం గలదు:
- ఇరాక్ (అల్-ఫా సింధుశాఖ ద్వారా పర్షియన్ అఖాతం ) 58 కి.మీ. (35 మైళ్ళు)
- స్లొవేనియా (కోపెర్ ద్వారా ఏడ్రియాటిక్ సముద్రం ) 47 కి.మీ. (29 మైళ్ళు)
- కాంగో (అట్లాంటిక్ మహాసముద్రం) 40 కి.మీ. (25 మైళ్ళు)
- బోస్నియా మరియు హెర్జెగొవీనా (న్యూమ్ ద్వారా en:Adriatic Sea) 26 కి.మీ. (16 మైళ్ళు)
- జోర్డాన్ ( అఖబా ద్వారా ఎర్రసముద్రం-అఖబా అఖాతం ) 26 కి.మీ. (16 మైళ్ళు)
[మార్చు] పాద పీఠికలు
- ↑ Definition of landlocked. Merriam-Webster Online Dictionary. తీసుకొన్న తేదీ: 2007-05-25.
- ↑ Landlocked. Webster's 1913 Dictionary. తీసుకొన్న తేదీ: 2007-05-25.
- ↑ Landlocked definition. MSN Encarta Dictionary. తీసుకొన్న తేదీ: 2007-05-25.
- ↑ AskOxford. Compact Oxford English Dictionary. తీసుకొన్న తేదీ: 2007-05-25.
- ↑ Definition of waterlocked. Dictionary.com. తీసుకొన్న తేదీ: 2007-08-12.
[మార్చు] ఇవీ చూడండి
- దేశాల జాబితాల జాబితా
- దేశాల జాబితా – దీవుల దేశాలు
- ఎన్క్లేవ్
- సముద్రతీరాన్ని బట్టి దేశాల జాబితా
- ఒకే దేశంతో ఒకే సరిహద్దు గల దేశాలు
- నాలుగు దేశాలు ఒకటినొకటి పరస్పర సరిహద్దులు గల దేశాల జాబితా
- భూపరివేష్టిత దేశాల నేవీ.