యండగండి

వికీపీడియా నుండి

యండగండి, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలానికి చెందిన గ్రామము.

అవధాన ప్రక్రియకు ఆద్యులైన తిరుపతి వేంకటకవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతిశాస్త్రి స్వగ్రామం ఈ గ్రామం. యండగండి వీధిబడిలో తొలిగురువైన బూర్ల సుబ్బారాయుడు వద్ద అక్షరభ్యాసం చేశారు తిరుపతిశాస్త్రి. తర్వాత కడియద్దకు చెందిన చర్ల బ్రహ్మయశాస్త్రి వద్ద శిష్యుడిగా చేరారు. సంస్కృతంలో చక్కని సాహిత్య సరళి అలవర్చుకున్నారు. సహ విద్యార్థులు అసూయపడే స్థాయికి తన మేధాశక్తిని పెంచుకోగలిగారు. ఈ సమయంలోనే 'యానాం'కు చెందిన చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రితో పరిచయమైంది. తెలుగు ఛందస్సు, కవితా రహస్యాలు, అవధాన ప్రక్రియలను వెంకటశాస్త్రి నుంచి నేర్చుకున్నారు. సంస్కృతాంధ్ర భాషల్లో వీరిద్దరూ అసమాన పాండిత్యాన్ని సంపాదించారు. జంట కవులుగా వీరివురు చేసిన అష్టావదాన, శతవధానాలు నవ్య కవితా పితామహులనే ఖ్యాతిని ఆర్జించింది. ఈ గ్రామములొ ప్రధానముగా వరి,చేపలు ,రొయ్యలు సాగుచేస్తారు.ఈ గ్రామములొ చాలా భాగము 2 కాలువల మద్య ఉంది.


"http://te.wikipedia.org/w/index.php?title=యండగండి&oldid=530985" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె