రూటేసి

వికీపీడియా నుండి
రూటేసి
Skimmia japonica
Skimmia japonica
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
వర్గము: సపిండేలిస్
కుటుంబము: రూటేసి
Juss., 1789
Type Genus
రూటా
లిన్నేయస్
ప్రజాతి
About 160, totaling over 1600 species.

రూటేసి (Rutaceae) కుటుంబంలో సుమారు 150 ప్రజాతులు, 1300 జాతులు ఉన్నాయి. ఈ మొక్కలు ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో పెరుగుతాయి.

విషయ సూచిక

[మార్చు] కుటుంబ లక్షణాలు

  • మొక్కలు, పొదలు లేదా వృక్షాలు.
  • సంయుక్త పత్రాలు, పుచ్ఛరహితము, గ్రంధి భరితము.
  • ద్విలింగ పుష్పాలు, అండకోశాధస్థితము, సౌష్టవయుతము, పంచభాగయుతము, సంపూర్ణము.
  • అండాశయము క్రింద వర్తులాకార చక్రము ఉంటుంది.
  • రక్షక, ఆకర్షణ పత్రాలు 4 లేదా 5
  • కేసరాలు 8-10, లేదా అనేకము, ఆబ్డిప్లోస్టెమోనస్.
  • ఫలదళాలు 2, సంయుక్తము, ఊర్థ్వ అండాశయము.
  • స్తంభ అండాన్యాసము.
  • ఫలము మృదుఫలము, హెస్పరిడియం లేదా గుళిక.

[మార్చు] ఆర్ధిక ప్రాముఖ్యత

  • సిట్రస్ జాతులైన నిమ్మ, బత్తాయి, నారింజ మొక్కలనుండి తినదగిన పండ్లు లభిస్తాయి.
  • వెలగ పండ్లలోని గుజ్జును తింటారు. ఇది అజీర్తిని హరిస్తుంది.
  • కరివేపాకు పత్రాలను వంటలలో సువాసన కొరకు ఉపయోగిస్తారు.
  • మారేడు పండు గుజ్జు అజీర్తిని హరిస్తుంది.
  • సదాపాకు మందులో ఉపయోగిస్తారు.
  • మాదీఫలం పండ్లరసం అజీర్తిని హరిస్తుంది.
  • క్లోరెక్సైలాన్ స్విటేనియా (Chloroxylon swietenia) నుండి సాటిన్ ఉడ్ (Satin wood) లభిస్తుంది. దీనిని ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు.
  • కొన్ని మొక్కలను తోటలలో పెంచుతారు.

[మార్చు] ముఖ్యమైన మొక్కలు

రకరకాల నిమ్మ జాతి పండ్లు.

[మార్చు] మూలాలు

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
"http://te.wikipedia.org/w/index.php?title=రూటేసి&oldid=714732" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు