వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Kvr.lohith

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (జూలై 10, 2013) ఆఖరి తేదీ : (జూలై 17, 2013)
Kvr.lohith (చర్చదిద్దుబాట్లు) - వెంకటరమణ గారు తెవికీలో అతి తక్కువ కాలంలోనే పదివేల దిద్దుబాట్లు చేశారు. దిద్దుబాట్లు చేయటమే కాకుండా వికీ నియమాలు, పద్ధతులు తెలుసుకొని నిర్వహణ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. కొత్తసభ్యులను ఆహ్వానించడం, ఈ వారం బొమ్మను, ఈ వారం వ్యాసాలను ప్రతిపాదించడం, వాటిని నిర్వహించడం, తుడిచివేయవలసిన వాటిని గుర్తించి వాటికి ట్యాగులు తగిలించడం వంటివి రమణ గారు ఇప్పటికే నిర్వహిస్తున్న పనుల్లో కొన్ని ఉదాహరణలు మాత్రమే. మొలకలను విస్తరించడంలో కూడా క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఈ పనులన్నీ శాస్త్రసంబంధ విషయాలపై తెలుగులో ప్రామాణికంగా అనేక చక్కని వ్యాసాలు వ్రాస్తూనే నిర్వహించారు. నిజానికి ఇప్పటికే నిర్వహణా పనులు చేస్తున్న వెంకటరమణ గారికి ఈ నిర్వాహకహోదా కేవలం ఆ పనులు నిర్వహించడంలో సౌలభ్యం కొరకే. ఇక ముందు కూడా తెవికీని చక్కగా నిర్వహిస్తూ, ముందుకు నడిపించగలరని ఆశిస్తూ, ఈయన్ను నిర్వహకత్వానికి ప్రతిపాదిస్తున్నా. --వైజాసత్య (చర్చ) 07:51, 10 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]


వెంకటరమణ గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.

  • వైజాసత్యగారికి నమస్కారము. మీ అందరి సహకారంతో వికీలో ఎన్నో శాస్త్ర సంబందిత వ్యాసాలను, వికీకరణలను,అనువాదాలను, కొన్ని నిర్వహణా పనులను చేశాను.నన్ను నిర్వాహకులుగా ప్రతిపాదించినందుకు నా ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.-- కె.వెంకటరమణ చర్చ 08:29, 10 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు[మార్చు]

  1. వెంకట రమణ గారి నిర్వాహకత్వానికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. నిర్వాహకులుగా వారు మరింత మెరుగ్గా రాణిస్తారని ఆశిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:00, 10 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. పాలగిరి (చర్చ) 08:39, 10 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. నా మద్దతు ప్రకటిస్తున్నాను..విశ్వనాధ్ (చర్చ) 08:11, 11 జూలై 2013 (UTC)అం[ప్రత్యుత్తరం]
  4. రమణ గారు ఈమధ్య అత్యంత చురుకుగా పనిచేస్తున్న వ్యక్తి. వారికి ఈ నిర్వహణ బాధ్యతలు వికీ అభివృద్ధిలో వారు పోషించే కీలకమైన పాత్రను మరింత సులభతరం చేస్తాయని భావిస్తాను. వారికి నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 08:15, 11 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. వెంకటరమణ స్వల్పకాలంలోనే విశేషమైన కృషి చేశారు. నిర్వాహకహోదా వారి పనులకుసౌలభ్యమాత్రమే కాకుండా, వికీని మెరుగుచేయటానికి అవకాశం కల్పిస్తుంది. వారు సమ్మతించటం సంతోషకరమైన విషయం. నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. --అర్జున (చర్చ) 03:37, 12 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  6. వెంకటరమణ గారి నిర్వాహకత్వానికి నేను మద్దతు తెలుపుతున్నాను.--శ్రీరామమూర్తి (చర్చ) 07:15, 12 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  7. తెవికీలో ప్రవేశించి త్వరితగతిలో సమర్ధతవంతంగా కృషిచేసిన వెంకటరమణగారు నిర్వాహకత్వం స్వీకరించడానికి అంగీకరించడం సంతోషం. వారి నిర్వహణలో తెవికీ మరింత అభివృద్ధి చెందగలదని భావిస్తున్నాను. --t.sujatha (చర్చ) 12:41, 12 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  8. నేను రాసిన వ్యాసాలలో చాలా వాటికి సహాయం చేసిన, సలహాలు సూచలనలందించిన కేవీఆర్ గారు నిర్వహణా బాధ్యతలు చేపట్టటం సంతోష దాయకం. నాకు సహాయం చేసినట్టే ఇతర వాడుకర్లకి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. నా పూర్తి మద్దతుని తెలియ జేస్తున్నాను.శశి (చర్చ) 09:31, 13 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  9. నా మద్దతు కూడా పరిగణించండి. రవిచంద్ర (చర్చ) 09:55, 13 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  10. గత తొమ్మిది నెలలుగా భౌతిక, రసాయన, గణిత శాస్త్ర వ్యాసాలపై కృషిచేస్తూ, పదివేల దిద్దుబాట్లను పూర్తిచేసి, మొదటిపేజీ శీర్షికలను చేతపట్టి, మొలక వ్యాసాలను విస్తరించుతూ తెవికీ అభివృద్ధికి కృషిచేస్తున్న రమణ గారు నిర్వాహకహోదా స్వీకరించుటకు మద్దతు పలుకుతున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:39, 13 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  11. I support. అహ్మద్ నిసార్ (చర్చ) 19:48, 13 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  12. వెంకట రమణ గారు తెవికీలో అనతి కాలంలోనే అవిరళమైన కృషి చేసారూ. వారు నిర్వహణ బాధ్యతలు చేపడితే మన తెవికీకి ఇంకొక మేటైన రథసారథి దొరికినట్టే. నా సంపూర్ణ మద్దతు. --విష్ణు (చర్చ)00:38, 14 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  13. నా మద్దతు కూడా పరిగణించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 13:04, 17 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యతిరేకత[మార్చు]

తటస్థం[మార్చు]

ఫలితం[మార్చు]

దాదాపు క్రియాశీలక సభ్యులందరి మద్దతు కూడగట్టుకొని ఈ ప్రతిపాదన విజయవంతమైనది. కావున వెంకటరమణ గారికి నిర్వాహకత్వ హోదా ఇవ్వవలసిందిగా అధికారులను కోరుతున్నాను --వైజాసత్య (చర్చ) 04:59, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]