సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం
సిర్పూర్ సిర్పూర్ కాగజ్ నగర్ |
|
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కుమురం భీం - ఆసిఫాబాద్ |
ప్రభుత్వం | |
- Type | కాంగ్రెస్ |
- శాసనసభ సభ్యులు | పాల్వాయి హరీష్ |
కాలాంశం | IST +5:30 (UTC) |
- Summer (DST) | ఆసిఫబాద్ (UTC) |
Area code(s) | 504296 |
కొమరంభీం జిల్లా జిల్లాలోని ఈ నియోజకవర్గము ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 1962 నుండి 1999 వరకు వరుసగా ఒక్కో అభ్యర్థిని రెండేసి సార్లు గెలిపించింది. 1962 నుండి 1978 వరకు వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, 1983, 1985, 1999 లలో తెలుగుదేశం గెలుపొందింది. 2004 ఎన్నికలలో విజయం కాంగ్రెస్‌కు వరించింది. ఈ నియోజకవర్గం మరో ఆరు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. రాష్ట్రంలోనే మొదటి నంబరు శాసనసభ నియోజకవర్గ స్థానం ఈ నియోజకవర్గానికి లభించింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం తొలి నంబరు ఉండగా 2008 నాటి నియోజకవర్గముల పునర్విభజన తరువాత ప్రస్తుతం ఆ స్థానం దీనికి లభించింది.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]నియోజకవర్గపు భౌగోళిక సరిహద్దులు
[మార్చు]తూర్పు వైపున కల ఈ నియోజకవర్గం తూర్పువైపున, ఉత్తరాన మహారాష్ట్ర రాష్ట్రం సరిహద్దుగా ఉంది. దక్షిణాన ఇదే జిల్లాకు చెందిన బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం సరిహద్దుగా ఉండగా, పశ్చిమాన ఆసిఫాబాదు నియోజకవర్గం ఉంది.
రాజకీయ - ప్రస్థానం
[మార్చు]సిర్పూర్ శాసనసభ నియోజకవర్గంలోని ఎన్నికల వ్యూహాలు సిర్పూర్ పేపర్ మిల్స్ (ఎస్పిఎమ్) చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ నుండి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఎంఎల్ఎలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బతుకు దెరువుకోసం వలసవచ్చినవారే.దాదాపు 1.5 లక్షల ఓటర్లున్న కాఘజ్ నగర్ పట్టణం, 1930 లో స్థాపించబడిన సర్సిల్క్ (Sirsilk), SPM పరిశ్రమలు ప్రధాన జీవనాధారంగా రూపుదిద్దుకుంది.
సిర్పూర్ శాసనసభ సెగ్మెంట్కు మొదటి ఎన్నిక 1952 లో జరిగింది, అప్పుడు 50,000 ఓట్ల ద్వారా సోషలిస్ట్ అయిన ఎం. బుచయ్య గారు గెలుపొందారు. 1957 లో కాంగ్రెస్ పార్టీకి చెందిన జి. వెంకట్స్వామి, ప్రజా సోషలిస్టు పార్టీకి చెందిన కె. రాజమల్లు ఇక్కడినుండి ప్రాతినిధ్యం వహించారు.
1967, 1974 సంవత్సరాల్లో ఐఎన్టియుసికి చెందిన జి.సంజీవ రెడ్డి గారు వరుసగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తరువాత ట్రేడ్ యూనియన్ నాయకుడు కె.వి. కేశవులు గారు కూడా 1972, 1978 లలో కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించారు.
కాంగ్రెస్ ఏకీకృత ఆధిపత్యం 1983, 1985 మధ్య ఎన్నికల్లో తె.దే.పా యొక్క K.V. నారాయణరావు గారి విజయంతో పటాపంచలైంది.
స్థానిక ప్రాంతానికి చెందిన ప్రజాబందు పాల్వాయి పురుషోత్తమరావు గారి రాకతో 1989 సిర్పూర్ నియోజకవర్గంలో కొత్త ఒరవడి మొదలైంది, స్వతంత్ర అభ్యర్థి అయిన పురుషోత్తమ రావు గారు 1989, 1994 లో వరుసగా రెండు సార్లు విజయ డంకా మోగించారు. 1999 లో, సరిగ్గా ఎన్నికలకు 3 రోజుల ముందు నక్సలైట్ల కర్కశత్వానికి బలయ్యారు. అదే సమయంలో ఆయన భార్య పాల్వాయి రాజ్యలక్ష్మీ గారు 1999 -2004 వరకు TDP ఎమ్మెల్యేగా కొనసాగారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కోనేరు కోనప్ప తె.దే.పా నుండి బరిలో ఉన్న రాజ్యలక్ష్మి గారిపై విజయం సాధించారు. 2009 లో తెలంగాణ వాదంతో బరిలోకి దిగిన తె.రా.స పార్టీ అభ్యర్థి కావేటి సమ్మయ్య గారు 2014 వరకు ఎమ్మెల్వేగా కొనసాగారు.
2014 లోనూ 2018 ఎన్నికలోనూ కోనేరు కొనప్ప ఎమ్మెల్యేగా ఎన్నికై నారు.
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]2004 ఎన్నికలు
[మార్చు]2004 శాసనసభ ఎన్నికలలో సిర్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్ప సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాల్వాయి రాజ్యలక్ష్మిపై 4319 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. కోనప్పకు 55938 ఓట్లు రాగా, రాజ్యలక్ష్మి 51619 ఓట్లు సాధించింది. నియోజకవర్గంలో ఐదుగురు అభ్యర్థులు పోటీచేసిననూ ప్రధాన పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థుల మధ్యనే కొనసాగింది. పోలైన ఓట్లలో ఈ రెండూ అభ్యర్థులు కలిపి 92%కి పైగా ఓట్లు పొందినారు. రంగంలో ఉన్న మిగితా ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.
- 2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు పొందిన ఓట్ల వివరాలు
క్రమసంఖ్య | అభ్యర్థి పేరు | అభ్యర్థి పార్టీ | సాధించిన ఓట్లు |
---|---|---|---|
1 | కోనేరు కోనప్ప | కాంగ్రెస్ పార్టీ | 55938 |
2 | పాల్వాయి రాజ్యలక్ష్మి | తెలుగుదేశం పార్టీ | 51619 |
3 | బ్రహ్మయ్య యాదగిరి | ఇండిపెండెంట్ | 3683 |
4 | రవీందర్ నికోడే | ఇండిపెండెంట్ | 3403 |
5 | షేక్ ఇబ్రహీం | ఇండిపెండెంట్ | 1775 |
2009 ఎన్నికలు
[మార్చు]2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కావేటి సమ్మయ్య, భారతీయ జనతా పార్టీ నుండి ఘనపురం మురళీధర్, కాంగ్రెస్ పార్టీ తరఫున కోనేరు కోనప్ప[4] ప్రజారాజ్యం నుండి లెండుగురే మెంగాజీ పటేల్, బిఎస్పీ తరఫున రవీందర్ నికోడే, లోక్‌సత్తా పార్టీ తరఫున డుబ్బుల జనార్థన్ పోటీచేశారు. తెరాస అభ్యర్థి కావేటి సమ్మయ్య సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పపై ఏడు వేలకుపైగా మెజార్టితో విజయం సాధించాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, బిఎస్పీ అభ్యర్థులు మూడవ, నాలుగవ స్థానంలో నిలిచారు. తెరాస తరఫున విజయం సాధించిన కావేటి సమ్మయ్య తెలంగాణ ఊద్యమంలో భాగంగా 2010 ఫిబ్రవరిలో శాసనసభ స్థానానికి రాజీనామా చేశాడు.
2010 ఉప ఎన్నికలు
[మార్చు]తెరాస, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు 2010 ఫిబ్రవరిలో రాజీనామా చేయడంతో ఏర్పడిన 12 ఖాళీ స్థానాలలో ఇది ఒకటి. 2010 జూలై 27న ఉప ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ నియఒజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యలక్ష్మి, తెరాస తరఫున రాజీనామా చేసిన శాసనసభ్యుడు కావేటి సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంద్రకరణ్ రెడ్డితో పాటు రికార్డు స్థాయిలో 52 ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీచేయగా కావేటి సమ్మయ్య గెలుపొందాడు.[5]
2024 ఎన్నికలు
[మార్చు]2023 లో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గం లో అసెంబ్లీ ఎన్నికలు 30 నవంబర్ 2023 లో జరిగినాయి.ఫలితము 3 డిసెంబర్ 2023 న ఫలితాలు వెలువడినాయి[6].ఈ నియోజక వర్గంలో ప్రధనంగా నాల్లు పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి , బహుజన సమాజ్ పార్టీ ఈ ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరి సాగింది. చివరికు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు 63,702ఓట్ల మెజారిటీతో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కొనేరు కోనప్ప పై విజయం సాధించారు.సిర్పూర్ నియోజక వర్గంలో మొత్తం రౌండ్లో వారీగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ నిర్వహించారు. మొత్తం 14 మంది అభ్యర్థులు పోటిలో ఉండగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబుకు 63,702 ఓట్లు 34,09% , భారత రాష్ట్ర సమితి అభ్యర్థి కోనేరు కోనప్పకు 60,614ఓట్లు 32.43%,బహుజన జమాజ్ వాది పార్టీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు 44,008 ఓట్లు 24,89% ,నోటాకు 2,196 ఓట్లు 1.18% వచ్చాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబుకు 3,088 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించాడు. ఆసిఫాబాద్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా గెలుపు పత్రం అందుకున్నాడు ఉంది[7].
క్రమసంఖ్య | అభ్యర్థి పేరు | అభ్యర్థి పార్టీ | సాధించిన ఓట్లు | శాతం |
---|---|---|---|---|
1 | పాల్వాయి హరీష్ బాబు | భారతీయ జనతా పార్టీ | 63.702 | 34.09% |
2 | కొనేరు కోనప్ప | భారత రాష్ట్ర సమితి పార్టీ | 60,614 | 32.43% |
3 | రావి శ్రీనివాస్ | భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ | 8.427 | 4.51% |
4 | నోటా | నోటా | 2,196 | 1.18% |
5 | ప్రవీణ్ కుమార్ | భారతీయ సమాజ్ వాది పార్టీ | 44,646 | 24.89% |
6 | మనోహర్ ఏలుమలె | ఇండిపెండెంట్ | 1,813 | 0.97% |
7 | సాంబశివ గౌడ్ దేశగాని | ఇండిపెండెంట్ | 1,324 | 0.71% |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Eenadu (31 October 2023). "మినీ భారతం.. పారిశ్రామిక ప్రాంతం". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
- ↑ Sakshi (25 July 2023). "సిర్పూరు రాజకీయ చరిత్ర.. ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే..?". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 12-07-2010
- ↑ News, India TV. "Sirpur Election Results 2023, Sirpur Assembly Seat Leading Candidates with names". India TV News (in ఇంగ్లీష్). Retrieved 2024-06-11.
{{cite web}}
:|last=
has generic name (help) - ↑ "Sirpur Telangana Assembly Constituency Election 2023: Date of Result, Voting, Counting; Candidates". Financialexpress (in ఇంగ్లీష్). 2023-12-03. Retrieved 2024-06-11.