హెక్సేను
|
|
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
మూస:Chembox IUPACNameమూస:Chembox PubChemమూస:Chembox DrugBankమూస:Chembox KEGGమూస:Chembox ChEBIమూస:Chembox Elementsమూస:Chembox BoilingPtమూస:Chembox Viscosityమూస:Chembox NFPAమూస:Chembox FlashPtమూస:Chembox Autoignitionమూస:Chembox OtherFunctn
| n-హెక్సేను | |
|---|---|
| ఇతర పేర్లు | n-Hexane |
| Identifiers | |
| CAS number | [110-54-3] |
| RTECS number | MN9275000 |
| SMILES | CCCCCC |
| InChI | 1/C6H14/c1-3-5-6-4-2/h3-6H2,1-2H3 |
| రసాయన ధర్మాలు | |
| స్వరూపం | Colorless liquid |
| సాంద్రత | 0.6548 g/mL |
| ద్రవీభవణ స్థానం |
−95 °సె, 178 కె, -139 °ఫా |
| నీటిలో ద్రావణీయత | 13 mg/L at 20 °C[1] |
| ప్రమాదాలు | |
| EU classification | Flammable (F) Harmful (Xn) Repr. Cat. 3 Dangerous for the environment (N) |
| R-phrases | మూస:R11 మూస:R38 మూస:R48/20 మూస:R62 మూస:R65 మూస:R67 మూస:R51/53 |
| S-phrases | మూస:S2 మూస:S9 మూస:S16 మూస:S29 మూస:S33 మూస:S36/37 మూస:S61 మూస:S62 |
| సంబంధిత రసాయనాలు | |
| సంబందిత రసాయనాలు | Cyclohexane |
| మూస:Chembox verificationExcept where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa) | |
| Infobox references | |
హెక్సెను (Hexane) రంగులేని, కొద్దిగా వాసన్ వున్న హైడ్రొకార్బను ద్రావణి (solvent). అల్కెను గ్రూపునకు చెందినది. పెట్రిలియం నుండి తయారగును. హెక్సెను హైడ్రొకార్బను శృంఖలం 6 కార్బనులను,14 హైడ్రొజనులను కలిగి వుండును. మాములు హెక్సెనును n-హెక్సెను అందురు (n-:normal) అందురు. నార్మలు హెక్సెను హైడ్రొకార్బను శృంఖలం సరళంగా వుండి ఎటువంటి శాఖలను కలిగివుండదు. నార్మల్ హెక్సెను యొక్క ఐసోమరులు మాత్రం శాఖలు కల్గివుండును. నార్మలు హెక్సెను మరియు దాని ఐసోమరులులలో ద్విబంధాలు లేవు. హెక్సెనుకు 4 ఐసోమరులు వున్నాయి. హెక్సెను ఐసోమరులు శాఖలను కల్గివుండును.
హెక్సెను రసాయన ఫార్ములా:CH3(CH4)CH3
విషయ సూచిక |
ఐసోమరులు [మార్చు]
- 1. 2-మిథైల్‌పెంటెను :(CH3)2CH(CH2)2CH3
- 2. 3-మిథైల్‌పెంటెను : CH3CH2CH(CH3)CH2CH3
- 3. 2,3-డై మిథైల్‌బుటెను :CH3CH(CH3)CH(CH3)CH3
- 4. 2,2-డైమిథైల్ బుటెను :CH3C(CH3)2CH2CH3
| Common name | IUPAC name | Text formula | Skeletal formula |
|---|---|---|---|
| normal hexane n-hexane |
hexane | CH3(CH2)4CH3 | |
| isohexane | 2-methylpentane | (CH3)2CH(CH2)2CH3 | |
| 3-methylpentane | CH3CH2CH(CH3)CH2CH3 | ||
| 2,3-dimethylbutane | CH3CH(CH3)CH(CH3)CH3 | ||
| neohexane | 2,2-dimethylbutane | CH3C(CH3)2CH2CH3 |
భౌతిక లక్షణాలు [మార్చు]
| భౌతిక ధర్మాలు | |
|---|---|
| అణుపార్ములా | C6H14 |
| అణుభారం | 86.18గ్రామ్/మోల్ |
| ద్రవీభవన స్ధానం | -950Cవద్ద |
| మరుగు స్ధానం | 68.70Cవద్ద |
| సాంద్రత | 0.6594కె.జి/లీ./200Cవద్ద |
| భాష్పపీడనం | 124టారు/200Cవద్ద |
| స్నిగ్ధత | 0.31cP/250Cవద్ద |
| స్వయందహనఊష్ణోగ్రత | 233.90Cవద్ద |
| నీటిలోద్రావణీయత | 13మి.గ్రాం/లీ/20<sup<0Cవద్ద |
భారతదేశం పెట్రొలియం చట్టం 1934 (XXX of 1934) మరియు 1976 చట్టం ప్రకారం హెక్సెను 'పెట్రొలియం తరగతిA (classA)' కు చెందిన పెట్రొలియం ఉత్పత్తి. అనుమతి లేకుండగా ఎక్కువ పరిమానంలో నిల్వవుంచు కోరాదు. ఛీఫ్ కంట్రొలరు ఆఫ్ ఎక్సుఫ్లొసివ్స్, నాగపూరు నుండి ఫారం 'XIII' ద్వారా అనుమతి పొందిన తరువాత మాత్రమే ఎక్కువ ప్రమాణంలో నిల్వ వుంచుకోవాలి. హెక్సెను భాష్పపీడనం (vapor pressure) ఎక్కువ.అందుచే మాములు ఉష్ణొగ్రతవద్ద కూడా అతి త్వరతంగా భాష్పికరణ చెందును.అరచేతిలో కొంచెం హెక్సెను తీసుకున్నచో శరీర వుష్ణొగ్రత ను గ్రహించి క్షణాలలో వాయువుగా మారును. భాష్పపీడనం అధికం కావడం వలన అతిత్వరగా చిన్ననిప్పురవ్వ తగిలినను గాలితో కల్సిమండును. అందుచే హెక్సెనును బారీస్దాయిలో నిల్వవుంఛునప్పుడు అగ్నిప్రమాదం జరుగకుండగా పటిష్టమైన అగ్నిప్రమాద నిరోధక జాగ్రత్తలు తీసు కొవాలి. అగ్నిమాపక శాఖ వారు సహయంతో మాక్‌డ్రిల్ నిర్వహించవలెను.నూనె గింజల నుండి, ఆయిల్ కేకునుండి నూనెను తీయు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షను ప్లాంట్‌లలో హెక్సెనును నూనెను తీయుటకు సాల్వెంట్‌గా వాడెదరు. అందుచే సాల్వెంట్ ప్లాంట్‌లలో అధిక మొత్తంలో హెక్సెనును నిలవుంచుదురు. అగ్నిప్రమాదం నుండి రక్షణకై సాల్వెంట్ ప్లాంట్‌లలో హెక్సెనును భూమిలోపల వుంచిన స్టోరెజి టాంకులలో నిల్వచెయుదురు. పెట్రొలుబంకులలోని పెట్రొల్,డిజిల్‌ను కూడా భూమిలో కప్పివుంచిన టాంకులలో నిల్వవుంచడము అందరుకు తెలిసినవిషయమే.హెక్సెను కొంతఎత్తునుండి ధారగా పడునప్పుడు స్థిరవిద్యుతును(static electricity)ను ఏర్పడును. ఆంతియే కాదు టాంకరుల ద్వారా హెక్సెనును రోడ్దు ద్వారా రవాణా చెయ్యునప్పుడు, కుదుపుల వలన టాంకరులో ముందుకు వెనుకకు హెక్సెను కదలటం వలన కూడా స్ధిరవిద్యుతు ఎర్పడును. ఆందుచే టాంకరును దిగుమతి చేయ్యవలసిన గమ్యస్దానంకు వచ్చిన తరువాత ఒక గంట సేపు అలాగే వదలి, ఆ తరువాత అన్‌లోడ్ చెయ్యుదురు. అంతియే కాదు అన్‌లోడింగ్ సమయంలో టాంకరులను, నిల్వటాంకులను, పైపులనులను రాగి తీగ ద్వారా ఎర్తు చెయ్యుదురు. హెక్సెను త్వరగా మండె లక్షణం వున్నప్పటికి, గాలిలో హెక్సెను నుండి వెలువడు వాయువులు 1.25-6.9% నిష్పత్తిలో వున్నపుడు, మాత్రమే మండును. గాలిలో హెక్సెను నుండి వెలువడు వాయువులు 1.25% కన్నతక్కువగా వున్నను, 6.9% కన్న ఎక్కువగా వున్నను మండదు. అందుచే పైన పెర్కొన్ననిష్పత్తిలో హెక్సెను వాయువులు, గాలి లేకుండగా జాగ్రత్త తీసుకోవాలి.
ఉపయోగాలు [మార్చు]
- 1. కొన్నిరకాల నూనెగింజల నుండి (సోయా, సాల్‌సీడ్, షియాసీడ్, మామిడి పిక్క మరియు వంటివి), మరియు అయిల్ కేకుల నుండి, తవుడు నుండి సాల్వెంట్ ప్లాంట్‌ల ద్వారా నూనెను తీయుదురు. భారతదేశంలో 450 సాల్వెంట్ ప్లాంట్‌లున్నాయి. ఎడాదికి 400-500 లక్షల లీటరుల హెక్సెనును సాల్వెంట్‌గా సాల్వెంట్ ప్లాంట్‌లలో ఉపయోగిస్తున్నారు.
- 2. కొన్నిరకాల ఓషదుమొక్కల, పూల నుండి ఓషదులను, సువాసనద్రవ్యాలను సంగ్రహించుటకై హెక్సెను ఉపయోగిస్తారు.
- 3. పాదరక్షలను, చర్మవుత్పత్తులను, మరియు పై కప్పులను అతికించు జిగురల తయారులో ఉపయోగిస్తారు.
- 4. వస్త్రపరిశ్రమలలొ తయారి సమయంలొ వస్త్రాలకు అంటుకున్న గ్రీజు, నూనె మరకలను తొలగించుటకు వాడెదరు.
- 5. దుస్తుల, ఉన్నిబట్టల డ్రైక్లినింగ్‌లో కూడా ఉపయోగిస్తారు.
దుష్పలితాలు [మార్చు]
హెక్సెను తక్కువ స్దాయిలో విషలక్షణాలు కల్గివుంది. దీర్ఘకాలంగా హెక్సెను వాయువు ప్రభావానికి గురైనప్పుడు శ్వాసకోశ మరియు నాడీవ్యవస్ధకు సంభందించిన రుగ్మతలు వచ్చెఅవకాశం వుంది. కొద్దిసేపు తక్కువ మోతాదు లో (400-500 ppm) హెక్సెను వాయువులను పీల్చినప్పుడు తలనొప్పి, కళ్లు తిరగడం, మత్తుగా అవ్వడం జరుగుతుంది. ఎక్కువమోతాదులో కొద్దిసేపు హెక్సెను వాయువులను పీల్చిన సృహ తప్పడం జరుగును. అటువంటి వ్యక్తిని బాగా గాలి అందు ప్రదేశంలో వుంచి గాలి ఆందినచో సృహలోనికి వచ్చును. చర్మం మీద పడిన, చర్మంలో వుండు నూనె గ్రంధుల నుండి నూనెను తొలగించడం వలన శరీరం పొడి బారిపోవును. సాల్వెంట్ ప్లాంట్‌లలో తీసిన నూనెలో 5-10 ppm వరకు హెక్సెను వుండును అయితే ఈ నూనెలను రిపైన్ చేసినప్పుడు తొలగింపబడును.
ఉత్పతిదారులు [మార్చు]
భారతదేశంలో సాల్వెంట్‌ప్లాంట్‌లలో వాడు హెక్సెనును 1.హిందుస్థాన్ పెట్రొలియం కార్పొరెసను లిమిటెడ్(HP),భారత్‌పెట్రొలియమ్‌లిమిటెడ్(BP),ఇండియన్ పెట్రొలియం అయిల్స్ లిమిటెడ్(IOL)లు ఉత్పత్తి చెయ్యుచున్నవి. హెక్సేనును ఉత్ప్త్తిచెయ్యు రిఫైనరిలుమరియు విక్రయకేంద్రాలు ముంబై,కలకత్త,చెన్నై వద్దకలవు.ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో నున్న చెర్లోపల్లి,గుంటూరుదగ్గరి తాడేపల్లిలో హెక్సేనువిక్రయ డిపోలున్నాయి.