అక్కి వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్కి వెంకటేశ్వర్లు
జననంనారికేలపల్లె, ముత్తుకూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
వృత్తిరంగస్థల కళాకారులు
ప్రసిద్ధితెలుగు రంగస్థల నటుడు.

అక్కి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రంగస్థల నటులు.

జననం

[మార్చు]

వెంకటేశ్వర్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలంలోని నారికేలపల్లెలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

ప్రాథమిక విద్య పూర్తి చేసిన వెంకటేశ్వర్లు విద్యాభ్యాసం ముందుకు సాగలేకపోయింది. వెంకటేశ్వర్ల యొక్క గాత్రం రమ్యంగా ఉండేది. ఆ గ్రామంలో ఉన్న ప్రముఖ రంగస్థల నటులు కొమరువోలు హనుమంతరావు వెంకటేశ్వర్ల గాత్రం విని నాటకరంగంలోకి ఆహ్వానించారు.

ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ నాటకరంగంలో కొనసాగారు. నవయువక నాట్యమండలి (చుండూరు) లోను, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి సమాజంలోను, ఇతర నాటక సమాజాల వారి నాటకాలలో నటించారు.

నటించిన నాటకాలు - పాత్రలు

[మార్చు]
  1. కురుక్షేత్రం - అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ
  2. రామరావణ యుద్ధం - ఆంజనేయుడు
  3. తులనీ జలంధర - శంకరుడు
  4. గయోపాఖ్యానం - ధర్మరాజు
  5. సీతారామకల్యాణం - విశ్వామిత్రుడు

సన్మానాలు

[మార్చు]

చుండూరు, తెనాలి, గుంటూరు, నెల్లూరు, చిలకలూరి పేట, అన్నవరం, చేబ్రోలు, నారికేలపల్లె, చిలుమూరు రామూ రూరల్ కాలేజిలో, హైదరాబాద్ త్యాగరాయగాన సభ (10.6.96) లో ఘన సన్మానాలు జరిగాయి.

మూలాలు

[మార్చు]
  • అక్కి వెంకటేశ్వర్లు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 325.