Jump to content

అపర్ణా పోపట్

వికీపీడియా నుండి
అపర్ణా పోపట్
అపర్ణా పోపట్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంఅపర్ణా లాల్‌జీ పోపట్
జననం (1978-01-18) 1978 జనవరి 18 (వయసు 46)
Bombay, మహారాష్ట్ర, India
ఎత్తు1.63 మీ. (5 అ. 4 అం.)
దేశం భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు1989-2006
వాటంRight
Women's singles
అత్యున్నత స్థానం16[1]
BWF profile

1978 జనవరి 18ముంబాయిలో జన్మించిన అపర్ణా పోపట్ (Aparna Popat) భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె ప్రపంచ బ్యాడ్మింతన్ లో ప్రస్తుతం 56 వ స్థానంలో ఉంది.

ప్రారంభ జీవితం

[మార్చు]

అపర్ణా 1978 జనవరి 18 న ముంబాయిలో గుజరాతీ కుటుంబంలో లాల్జీ పోపట్, హీనా పోపట్ దంపతులకు జన్మించింది. ముంబాయి లోని జె.బి.పెటిట్ పాఠశాలలోను, బెంగుళూరు లోని మౌంట్ కార్మెల్ కళాశాలలోను విద్యనభ్యసించింది. ముంబాయి విశ్వవిద్యాలయం నుంచి గణాంకశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది.

క్రీడా జీవితం

[మార్చు]

అపర్ణా 8 సంవత్సరాల వయస్సులోనే బ్యాట్ చేతపట్టింది. 13 ఏళ్ళ ప్రాయంలోనే రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి టోర్నమెంట్లలో విజయం సాధించింది. ముంబాయిలో ఉన్నప్పుడు పదేళ్ళపాటు అనిల్ ప్రధాన్ శిక్షణ ఇచ్చాడు. చిన్న వయసులోనే ఆమెలోని ఆతతీరును గమనించిన అనిల్ ప్రధాన్ ఈ బాలికను అప్పగిస్తే భారత బ్యాడ్మింటన్ పటంపై వెలగదీస్తానని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు ఇతని కోరికను మన్నించడం, ఇతను వారి నమ్మకాన్ని నిలబెట్టడంతో అపర్ణా నిజంగానే భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక వెలుగు వెలిగింది. అతడు ఈమెనే కాకుండా మరో ఇద్దరు చాంపియన్లను తయారుచేశాడు (జ్యోతి సంఘి, రాధికా బోస్). అతని శిష్యులలో జాతీయ చాంపియన్ అయిన వారిలో రాధికా బోస్ మొదటి వ్యక్తి. అతని శిక్షణలో అపర్ణా మమ్చి రాటుదేలింది. ఆ తర్వాత 1994లో బెంగుళూరు లోని ప్రకాష్ పడుకోనె యొక్క బ్యాడ్మింటన్ అకాడమీకి చేరింది.

విజయాలు

[మార్చు]

1998లో అపర్ణా మంజుషా పవన్‌గడ్కర్ ను ఓడించి మొదటిసారిగా జాతీయ సీనియర్ టైటిల్ సాధించింది. 1998 నుంచి ప్రతి ఏటా జాతీయ సీనియర్ టైటిల్‌ను చేజిక్కించుకుంటూ వస్తోంది. ఒక్కక్కసారి ఆమెకు అసలు పోటీ లేనట్లుగా గెల్వడం ఆమె ఆటతీరుకు మచ్చుతునక. సార్క్ చాంపియన్‌షిప్ లోనూ స్వర్ణం సాధించింది. 1996లో హాంగ్‌కాంగ్లో జరిగిన ప్రిన్స్ జూనియర్ ఇన్విటేషన్ టోర్నమెంటులో కాంస్యపతకం సాధించింది. అదే సంవత్సరం డెన్మార్క్లో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‍షిప్ లో రెండో స్థానం సంపాదించింది. 1998లో పారిస్లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ, అదే ఏడాది కౌలాలంపూర్లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలోనూ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిల్చింది. 2002లో మాంచెస్టర్ కామన్వెల్త్ క్రీడలలో కాంస్యం సాధించింది. సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించింది. 2004 ఒలింపిక్ క్రీడలలో కూడా పాల్గొని తొలి రౌండులో దక్షిణాఫ్రికాకు చెందిన మెకేల్ ఎడ్వర్డ్ ను చిత్తుచేసి తదుపరి రౌండ్‌లో నెదర్లాండ్కు చెందిన మియా ఆడినాపై ఓడిపోయింది.

మూలాలు

[మార్చు]
  1. "Previous stars - Aparna Popat". Tata Padukone Academy. Archived from the original on 21 మే 2007. Retrieved 14 August 2013.