అరుణిమ సిన్హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణిమ సిన్హా
Arunima sinha.jpg
అరుణిమ సిన్హా
జననంసోనూ
(1988-07-20) 1988 జూలై 20 (వయస్సు: 31  సంవత్సరాలు)
ఉత్తర ప్రదేశ్ , అంబేద్కర్ జిల్లా
జాతీయతభారతీయులు
ప్రసిద్ధులుఅత్యున్నత ఎపరెస్ట్ ని ఒంటి కాలితో అధిరోహించిన మహిళ

అరుణిమ సిన్హా ప్రపంచంలోని అత్యున్నత శిఖరం "ఎవరెస్టు"ను అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ. దుండగుల దురాగతంలో తన కుడికాలు పోగొట్టుకున్న జాతీయస్థాయి వాలీబాల్‌ మాజీ క్రీడాకారిణి అరుణిమా సిన్హా చరిత్ర సృష్టించారు. మౌంట్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి దివ్యాంగ వ్యక్తిగా కీర్తి పతాకాన్ని ఎగురవేశారు[1]. ఉత్తరప్రదేశ్కు చెందిన సిన్హా ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులోనే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు చేరుకున్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన ఎకో ఎవరెస్టు ఎక్స్‌పెడిషన్‌లో సభ్యుడు, నేపాల్‌ పర్యాటకం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించారు.

జీవితం[మార్చు]

ఉత్తర ప్రదేశ్ లోని అంబేద్కర్ జిల్లా లోని ఒకగ్రామంలో అరుణిమ జన్మించింది.ఆమె తండ్రి ఆర్మీ ఉద్యోగి, తల్లి హెల్త్ సూపర్ వైజర్. ఆమెకు ఓ అన్నయ్య, ఓ చెల్లాయి ఉన్నారు. చిన్నప్పటినుంచీ ఆమెకు ఫుట్‌బాల్ల్ ఆడటం చాలా ఇష్టం. తల్లిదండ్రులూ, స్కూల్లో పీ.టీ గురువు ప్రోత్సహించారు. వాలీబాల్, ఫుట్‌బాల్ ఆటల్లో ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది. విజయాలమీద విజయాలు, పతకాల మీద పతకాలు. జాతీయ జట్టులో స్థానం లభించింది. ఆటలతో పాటు బాగా చదువుకుంటే స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం వస్తుంది.అని తెలిసిన వాళ్ళు చెప్పారు.ఆటలలో కొనసాహిస్తూనే ఎం.ఎ. చేసింది. ఎల్.ఎల్.బి చేస్తున్న రోజుల్లో అర్మీ రిక్రూట్ మెంట్ ప్రకటన పత్రికలో చూసి దరఖాస్తు చేసింది.దరఖాస్తులో పుట్టిన తేదీ వివరాలు తప్పుగా పడ్డాయి. బరేలీ లోని ఆర్మీ రిక్రూట్ మెంట్ అధికారులు సవరిస్తారని ఇంట్లో వాళ్ళు సలహా యిచ్చారు. 2011, ఏప్రిల్ 11 న లక్నోలో రైలు ఎక్కింది. అది బరేలీ చేరుకునేలోగా అంతా తల క్రిందులయ్యింది. ప్రమాదం జరిగింది.

రైలు ప్రమాదం[మార్చు]

సిన్హా, జాతీయ స్థాయి వాలీబాల్, ఫుట్‌బాల్ క్రీడా కారిణి.[2] అరుణిమా సిన్హా జీవితంలో ఏప్రిల్‌ 12, 2011 చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే లక్నో నుంచి ఢిల్లీకి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో జనరల్‌ కంపార్టుమెంట్‌లో ఆమె ప్రయాణిస్తున్నారు. బరేలీ సమీపంలో ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దుండగలు రైలు నుంచి కిందకు తోసేశారు. 'పక్కనే ఉన్న ట్రాక్‌ మీద పడ్డాను. పైకి లేవలేకపోయాను. అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ఆ ట్రాక్‌ మీద రైలు రావడం నేను చూశాను. క్షణాల్లో అది నా కుడి కాలుపై నుండి దూసుకుపోయింది. గ్రామస్థులు చూసి, నన్ను ఆస్పత్రికి తీసుకొచ్చారు' అని అరుణిమ చెప్పారు. ఈ ప్రమాదంలో ఆమె కుడికాలు, తొడ ఎముక తీవ్రంగా దెబ్బతిన డంతో ఆస్పత్రిలో చేర్చారు. మోకాలు కింది భాగాన్ని వైద్యులు తొలగించారు[3].

ఆమెకు రూ. 25 వేల నష్టపరిహారాన్ని క్రీడా శాఖ మంత్రి అజరు మకేన్‌ ప్రకటించారు. 'ఆమెకు మద్దతుగా ఉంటాం. అవసరమైన సహాయన్ని అందిస్తాం' అని అన్నారు. యువజన, క్రీడల మంత్రిత్వ శాఖా మంత్రి "అజయ్ మేకన్" 2 లక్షల నష్ట పరిహారం యిచ్చుటకు, ఆమెకు ఉద్యోగం యిచ్చుటకు ప్రకటించారు. భారతీయ రైల్వే సంస్థ ఆమెకు ఉద్యోగం యిచ్చుటకు అంగీకరించింది.[4]

ఏప్రిల్ 18, 2011 న ఆమెను ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్[5]లో చేర్చారు. అచట ఆమె కోలుకోవటానికి నాలుగు నెలల కాలం పట్టింది.[6]

ఈ ప్రమాదాన్ని పోలీసు శాఖ ఒక ఆత్మహత్యగా అనుమానించింది. ఆమె రైల్వే కాసింగ్ వద్ద ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చని భావించింది. కానీ అరుణిమ ఆ వాదనలను ఖండించింది.[7][8]

ఎవరెస్టు అధిరోహణం[మార్చు]

ప్రతిఒక్కరూ ఆమెపై సానుభూతి చూపడం మొదలుపెట్టారు. ఇది భరించలేని అరుణిమ ఏదో ఒక సాహసకార్యం చేయాలనే ఆ క్షణమే నిర్ణయించుకుంది. ‘అందరూ నాగురించి ఎంతో ఆందోళన చెందారు. వారంతా సానుభూతి చూపడం మొదలుపెట్టారు. సానుభూతి చూపులనుంచి బయటపడేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఎవరెస్టు శిఖరం ఎత్తు గురించి చర్చించుకోవడం వినపడింది. అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయానికి పెద్దన్నయ్యతో పాటు కోచ్ పూర్తిగా సహకరించారు’ అని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అరుణిమ పేర్కొంది. అనంతరం టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్‌లో సభ్యురాలిగా చేరి శిక్షణ తీసుకుంది. ఉత్తర కాశిలో జరిగిన శిబిరంలో ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్ వద్ద అరుణిమ మెళకువలు తెలుసుకుంది[9] . మే 21, 2013 న ఆమె ఎవరెస్టు శిఖరాన్ని ఉదయం 10.55 కి చేరుకుంది. ఇది Eco Everest Expedition.లో భాగంగా టాటా గ్రూప్ సంస్థలు స్పాన్సర్ చేసినది[10]. ఆమె ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ను ఆదర్శంగా తీసుకుంది. ఆయన తనకు వచ్చిన కేన్సర్ వ్యాధిని లెక్కచేయకుండా "ఏదో ఒకటి చేయాలి" అనే తలంపుతో విజయాలను సాధించాడు.[11]

సూచికలు[మార్చు]

 1. "Arunima becomes first Indian amputee to scale Everest". The Hindu. 2013-05-21. Retrieved 2013-05-21.
 2. "National player thrown off train in UP, loses leg". India Today. 2011-04-13. Retrieved 2013-05-21.
 3. "Arunima Sinha becomes first Indian amputee to scale Mt Everest". The Indian Express. 2013-05-21. Retrieved 2013-05-21.
 4. "Railways job to volleyball player who lost her leg". India Today. 2011-04-14. Retrieved 2013-05-21.
 5. "AIIMS calls cops to guard Arunima against infection". The Times of India. 24 Apr 2011. Retrieved 2013-05-21.
 6. "Arunima Sinha, the girl who lost a leg in battling snatchers becomes first amputee to scale Everest". India Today. 2013-05-21. Retrieved 2013-05-21.
 7. "Arunima may have attempted suicide or met with an accident: Railways". The Times of India. 2011-04-26. Retrieved 2013-05-21.
 8. "Police are lying, says assaulted Arunima Sinha". Zee news. 27 April 2011. Retrieved 2013-05-21.
 9. "Volleyballer Arunima Sinha who lost leg climbs 21,000ft". The Times of India. 12 Sep, 2012. Retrieved 2013-05-21. Check date values in: |date= (help)
 10. "Arunima Sinha becomes first Indian amputee to conquer Mount Everest". NDTV. 2013-05-21. మూలం నుండి 2013-06-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-05-21.
 11. "Arunima Sinha, braveheart who lost her leg after being thrown off a moving train, scales Mount Everest". NDTV. 2013-05-21. Retrieved 2013-05-21.

యితర లింకులు[మార్చు]