అక్షాంశ రేఖాంశాలు: 19°43′59″N 78°42′39″E / 19.73306°N 78.71083°E / 19.73306; 78.71083

ఆత్మలింగ హనుమాన్ దేవాలయం పెండల్ వాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆత్మలింగ హనుమాన్ దేవాలయం పెండల్ వాడ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని పెండల్ వాడ గ్రామంలో ఉంది. ఇది అతి పురాతనమైన దేవాలయం. ఆంజనేయస్వామి చేతిలో ఆత్మలింగాన్ని చూపుతూ గంభీర వందనంతో దర్శనమిస్తాడు[1][2][3].

ఆత్మలింగ హనుమాన్ దేవాలయం పెండల్ వాడ
ఆత్మలింగ హనుమాన్ దేవాలయం పెండల్ వాడ is located in Telangana
ఆత్మలింగ హనుమాన్ దేవాలయం పెండల్ వాడ
ఆత్మలింగ హనుమాన్ దేవాలయం పెండల్ వాడ
తెలంగాణ లో ఉనికి
భౌగోళికాంశాలు :19°43′59″N 78°42′39″E / 19.73306°N 78.71083°E / 19.73306; 78.71083
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్
ప్రదేశం:పెండల్ వాడ జైనథ్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఆంజనేయస్వామి
ఉత్సవ దైవం:హనుమంతుని జయింతి వేడుకలు, శ్రీసీతారామ లక్షమణ కళ్యాణోత్సవాలు,
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:5

చరిత్ర

[మార్చు]

18 వ శతాబ్ధంలో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సైద్ పూ ర్ గ్రామ సమీపంలో సాత్నాలవాగు ఒడ్డున హనుమంతుని దేవాలయం ఉండేది. ఆ ఆలయంలో నాల్లు రాతి స్తంభాలు,రాతితో చెక్కబడిన పెద్ద పెద్ద భీంలు నాల్గు కూడా ఒక దాని పై ఒకటి పేర్చి ఉండేను.దాని పై కప్పు పైన ధర్మ చక్రంలాగా ఒక పుష్పం చెక్కబడి ఉండేను. అక్కడ కొలువైన హనుమంతుని విగ్రహం పెన్ గంగా నది కి వరదలు వచ్చినప్పుడు పెండల్ వాడ వాగు నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చి పెండల్ వాడ గ్రామ సమీపంలోని వాగు మూల మలుపు వద్ద నిలిచిందట దానిని బండరాయిగా భావించిన గ్రామ రజకులు ఆబండ పై బట్టలు ఉతుకుతూ , స్నానం చేసేవారట ఒక రోజు గ్రామ పెద్దకు స్వప్నంలో స్వామి కనిపించి తాను వాగులో ఉన్నానని పైకి తీసి పూజలు నిర్వహించాలని కోరడంతో గ్రామస్థులు వాగులో పరిశీలించగా హనుమంతుడు భారీ విగ్రహం కనిపించింది. ఎడ్ల సహాయంతో విగ్రహాన్ని బయటకు తీసి పెండల్ వాడ గ్రామంలో ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుండి ప్రతి మంగళవారం, శనివారం రోజున పెండల్ వాడ హనుమాన్ మందిరంలో స్వామి పూజలు అందుకోంటునారు.[4][5].

విశిష్టత

[మార్చు]

ఈ ఆంజనేయ స్వామి గర్భగుడి రాతి స్తంభాలతో నిర్మితమై ఉంది. స్వామి ఆలయం ఎనిమిది అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పు కుడిచేయి పైకెత్తి చేతిలో ఆత్మలింగాన్ని చూపుతూ భక్తులకు దర్శనమిస్తారు.స్వామి ఎడమ కాలికింద శనీశ్వరస్వామిని అణగద్రొక్కి ఉంచిన దృశ్యం మనకు కనిపిస్తుంది. దర్శనం కోసం వచ్చే భక్తులు కాళ్ళకు చెప్పులు ధరించకుండా కాలినడకన వచ్చి గంగానదికి ఉపనది అయిన పెన్ గంగాలో స్నానం చేసి ఆంజనేయుని పూజలు నిర్వహించి ఆంజనేయునికి మొలదారం వేసి దానిని ఇంటికి తీసుకెళ్ళి ధరిస్తారు.

ఉత్సవాలు

[మార్చు]

ఈ ఆలయంలో ప్రతియోట హనుమత్ ధనుర్మాస కార్యక్రమాలు,శివరాత్రి పర్వదినాల్లో ఐదు రోజులు పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, జాతర,అన్నదానం కార్యక్రమాలు జరుగును.శ్రీసీతారామ లక్ష్మణస్వామి వసంతోత్సవాలు,కళ్యాణోత్స వాలు,అభిషేకోత్సవం ,కార్తీక దీపోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.శివరాత్రి పండుగ సందర్బంగా ఐదు రోజులు రథోత్సవం ,భోజన నైవేద్యం సమర్పణ, బోనాలు,హారతి మిగతా రోజుల్లో పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతుంది.

భక్తుల తాకిడి

[మార్చు]

భక్తులు ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,మహారాష్ట్ర తో పాటు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్,నిజామాబాద్,కరీంనగర్, వరంగల్ ,ఖమ్మం జిల్లాల నుండి భక్తులు ఆధికంగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

ఎలా చేరుకోవచ్చు

[మార్చు]

ఈ ఆలయాన్ని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాదు,నిజామాబాద్,కరీంనగర్, వరంగల్, జిల్లాల నుండి వచ్చే భక్తులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోవాలి, అచ్చట నుండి 20 కిలో మీటర్లు దూరంలో జైనాథ్ మండలంలోని పెండల్ వాడ గ్రామంలో ఉంది.భక్తులు బస్సులో గాని ఇతర ప్రైయివెటు వాహనాలతో ఆలయాన్ని చేరుకోవచ్చు[6].

మూలాలు

[మార్చు]
  1. Astrology, Om. "Pendalwada Hanuman Temple Adilabad Telangana History & Architecture". Om Astrology (in English). Retrieved 2024-06-29.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "Sri Anjaneya Swamy Temple Timings – Pendalwada". temple-timings.blogspot.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-29.
  3. "Pendalwada Village , Jainad Mandal , Adilabad District". www.onefivenine.com. Retrieved 2024-06-29.
  4. "కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారా.. ఈ గుడికి వెళ్తే చాలు మీ జాతకం మారిపోతుంది!". News18 తెలుగు. 2024-05-12. Retrieved 2024-06-29.
  5. Astrology, Om. "Pendalwada Hanuman Temple Adilabad Telangana History & Architecture". Om Astrology (in English). Retrieved 2024-06-29.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  6. "Hanuman Temple – Hindu Temple Timings, History, Location, Deity, shlokas" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2024-06-29. Retrieved 2024-06-29.