ఆలో
ఆలో
ఆలో | |
---|---|
జిల్లా ప్రధాన కార్యాలయం | |
Coordinates: 28°10′N 94°46′E / 28.17°N 94.77°E | |
దేశం | India |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ సియాంగ్ జిల్లా |
Government | |
• Type | బహుళ పార్టీ ప్రజాస్వామ్యం |
• డిప్యూటీ కమిషనర్ | శ్రీమతి శ్వేతికా సచన్, ఐఏఎస్ |
Elevation | 619 మీ (2,031 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 20,680 |
• Rank | 4 (in AP) |
• జనసాంద్రత | 13/కి.మీ2 (30/చ. మై.) |
Languages | |
• Official | ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 791 001 |
Telephone code | 91 3783 XXX XXXX |
Vehicle registration | AR-08 |
Climate | Cfa (Köppen) |
ఆలో,భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ సియాంగ్ జిల్లాకు ప్రధాన కార్యాలయం, ఒక జనగణన పట్టణం. గతంలో దీనిని అలోంగ్ అని పిలిచేవారు. 220 కిలోమీటర్లు (140 మై.) ఒక రోజు ప్రయాణం పట్టింది అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్న లికబాలి నుండి 220 కిలోమీటర్లు (140 మైళ్లు) దూరంలో ఉంది.దీనిని చరుకోవటానికి ఒకరోజు ప్రయాణ సమయం పట్టింది.అలో ప్రాంతంలో భారత వైమానిక దళానికి చెందిన అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ (ఎ.ఎల్.జి)ఉంది.
సంస్కృతి.
[మార్చు]ఈ ప్రాంత ప్రజలు ప్రధాన పండుగ మోపిన్.ఇది ఏప్రిల్ 5 నుండి 6 వరకు జరుగుతుంది.ప్రతి సంవత్సరం జనవరి 11 నుండి 15 వరకు జరిగే పర్యాటక కాలంలో గరిష్టంగా 3-4 రోజులు యోమ్గో రివర్ ఫెస్టివల్ జరుపుకుంటారు. పర్యాటకం, దేశీయ సంస్కృతి, సాంప్రదాయం, చేనేత, హస్తకళలను ప్రోత్సహించడానికి, దాని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే ఉద్దేశ్యంతో ఈ పండుగను జరుపుకుంటారు.
జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం అలో పట్టణ జనాభా మొత్తం 16,834 మంది కాగా అందులో పురుషులు 56% ఉండగా స్త్రీలు 44% మంది ఉన్నారు. పట్టణ సరాసరి అక్షరాస్యత 69%, ఇది జాతీయ సరాసరి అక్షరాస్యత 59.5% కన్నాఎక్కువ.పురుషులు అక్షరాస్యత 75% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 61% ఉంది.పట్టణ జనాభా మొత్తంలో 15% మంది 6 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది బాలురుకు 916 మంది బాలికలు కలిగి ఉన్నారు.[2]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పట్టణ జనాభా మొత్తం 20,700.ఆలో జనాభాలో ఎక్కువ భాగం గాలో తెగకు చెందిన ప్రజలు నివసిస్తారు.ప్రధాన మతం డోని-పోలో,తరువాత క్రైస్తవ మతం, టిబెటన్ బౌద్ధమతం, హిందూ, ఇస్లాం అనుచరులు అతి తక్కువగా ఉన్నారు.వీరి ప్రధాన భాష గాలో.
రహదారి సౌకర్యం
[మార్చు]ఆలోకు మంచి రహదారి వసతులు లేవు.ఉత్తర లఖింపూర్ నుండి రాజధాని నగరం ఇటానగర్ వరకు వెళ్ళే రహదారి ఆలో పట్టణాన్ని నగరానికి కలుపుతుంది. ఆలోకు నిరంతర బస్సు ద్వారా ప్రయాణ సౌకర్యాలు ఇటానగర్ నుండి నడుస్తాయి.అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా సర్వీస్ (ఎపిఎస్టిఎస్) బస్సులు ఆలో నుండి అందుబాటులో ఉన్నాయి.ఆలో పట్టణానికి పసిఘాట్ నుండి 106 కిలోమీటర్లు బస్సు ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు.దీనికి సుమారు 5 గంటల సమయం పట్టింది. మోయింగ్ నుండి 150 కిమీ బస్సులో ఆలో చేరుకోవడానికి సుమారు 6 గంటలు సమయం పడుతుంది.
అలోకు సమీప విమానాశ్రయం అస్సాం రాష్ట్రంలో ఉన్న ఉత్తర లఖింపూర్ వద్ద ఉంది. ఉత్తర లఖింపూర్ లేదా లీలబరి విమాన సేవల ద్వారా గువహటి, కోల్‌కతాకు అనుసంధానించబడి ఉంది.ఉత్తర లఖింపూర్ లేదా లీలబరి నుండి ఆలోకు బస్సు లేదా టాక్సీ తీసుకోవచ్చు.
ఆలోకు రైల్వే లేదు. సమీప రైల్వే స్టేషన్ సిలాపాథర్ వద్ద ఉంది.బ్రాడ్ గేజ్ రైల్వే ద్వారా ఆలోను సిలాపాథర్‌కు అనుసంధానించే కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు. సర్వే పూర్తై రైల్వే బోర్డుకు పంపబడింది. [3]
మీడియా
[మార్చు]అలోంగ్‌లో ఆల్ ఇండియా రేడియో రిలే స్టేషన్ ఉంది. ఇది ఎఫ్ఎం పౌన . పున్యాలపై ప్రసారం చేస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Aalo Population Census 2011". Government of India. Retrieved 10 August 2016.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "Govt plans 3 key railway lines". The Indian Express. Retrieved 4 August 2011.