బోలెంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పటం

బోలెంగ్, సియాంగ్ జిల్లాలోని ఒక పట్టణం.ఇది భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సియాంగ్ నది ఒడ్డున ఉంది.[1] ఇది కొత్తగా సృష్టించబడిన సియాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం. సియాంగ్ జిల్లా పశ్చిమ సియాంగ్, తూర్పు సియాంగ్ నుండి విభజించబడింది. ఇది అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు సియాంగ్ జిల్లా పాసిఘాట్ నుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఉంది. జిల్లాకు బ్రహ్మపుత్ర పేరు పెట్టారు. స్థానికంగా సియాంగ్ అని పిలుస్తారు. [2]

సంస్కృతి[మార్చు]

బోలెంగ్ ప్రజలు వివిధ రకాల పండుగలను జరుపుకుంటారు. సోలుంగ్, అరన్, ఎటోర్ మొదలైనవి ఇక్కడ ముఖ్యమైన పండుగలు. పురాణాల ప్రకారం, ఆదిల ప్రధాన పండుగ సంపదదేవత సోలుంగ్,

సోలుంగ్‌ను ఆదివాసులు ఐదు రోజులపాటు జరుపుకుంటారు. మొదటి రోజు లేదా సోలుంగ్ గిడి డాగిన్ వారు ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యే రోజు.డోరెఫ్ లాంగ్, రెండవ రోజు జంతువధల రోజు. బిన్నాత్ బినామ్ లేదా మూడవరోజు ప్రార్థనల రోజు. టాక్టర్ ఆఫ్ ఎకోఫ్ నాల్గవ రోజు.ఈ రోజున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తయారు చేస్తారు. మీరి లేదా ఐదవ రోజు వీడ్కోలు రోజు. సోలుంగ్ సమయంలో పాడే పాటలు మానవులు, జంతువులు, మొక్కలు మొదలైనవాటి జీవితాన్ని చూపించే సోలుంగ్ అబాంగ్ సాహిత్యరూపంలో ఉంటాయి. సోలుంగ్ సెప్టెంబరు నెలలో జరుపుకుంటారు.

బోలెంగ్‌లోని ప్రసిద్ధ నృత్యాలలోపోనుంగ్ నృత్యం,తాపు అనే యుద్ధనృత్యం ఉన్నాయి. బోలెంగ్ సాహస క్రీడలకు అనువైంది. పొరుగున ఉన్న పశ్చిమ సియాంగ్ జిల్లాలోని మాలినితన్ (200 కి.మీ) పురావస్తు ప్రదేశం శ్రీకృష్ణుడు, అతని భార్య రుక్మిణి పురాణంతో ముడిపడి ఉంది. పురాతన హిందూ పురాణాల ప్రకారం సతి (పార్వతి) ఛిద్రమైన తల ఆకాశగంగ (100 కి.మీ) వద్ద పడిపోయిందని పురాణ కథనం.

భాషలు[మార్చు]

ఈ ప్రాంతంలో మాట్లాడే ప్రధానభాష ఆది.ఇతర భాషలలో హిందీ, అస్సామీ, నేపాలీ మొదలైనవి ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

పట్టణంలో రోజువారీ ప్రైవేట్ సుమో సేవ ద్వారా పసిఘాట్ పట్టణానికి అనుసంధాన సౌకర్యం ఉంది. అస్సాంలోని ధేమాజీ జిల్లా లోని ముర్కోంగ్‌సెలెక్ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం , బోలెంగ్ జనాభా 5,776. అందులో పురుషులు 51.3% శాతం మంది ఉండగా, స్త్రీలు 48.7% శాతం మంది ఉన్నారు. బోలెంగ్ సగటు అక్షరాస్యత రేటు 79%,ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ.పురుషుల అక్షరాస్యత 53.6% కాగా, స్త్రీల అక్షరాస్యత 46.4% ఉంది.

చిత్రమాలిక[మార్చు]

 

మూలాలు[మార్చు]

  1. Amar, Sangno (1 December 2014). "Tension over district headquarters simmers at Pangin-Boleng". The Arunachal Times.
  2. "Pema Khandu Declared the Formal Functioning of Siang District". Northeast Today. 25 December 2018. Archived from the original on 7 February 2020. Retrieved 21 July 2021.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బోలెంగ్&oldid=3961882" నుండి వెలికితీశారు