Jump to content

ఆషాఢ శుద్ధ పూర్ణిమ

వికీపీడియా నుండి
(ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

ఆషాఢ శుద్ధ పూర్ణిమ లేదా ఆషాఢ పూర్ణిమ అనగా ఆషాఢమాసములో శుక్ల పక్షములో పూర్ణిమ తిథి కలిగిన 15వ రోజు.

గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉంది.ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.

సంఘటనలు

[మార్చు]
  • 2007

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 689.