Jump to content

ఆషా సైని

వికీపీడియా నుండి
(ఆషా సైనీ నుండి దారిమార్పు చెందింది)
ఆషా సైని
జననం
ఫ్లోరా

చంఢీఘర్
వృత్తిమోడల్, నటి

ఆషా శైని ఒక భారతీయ సినీ నటి, మోడల్. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. 1999 లో ప్రేమకోసం అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. రజినీకాంత్, విజయకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతి బాబు, రాజశేఖర్ లాంటి నటుల సరసన సుమారు 50 కి పైగా సినిమాల్లో నటించింది.[1]

వ్యక్తిగత వివరాలు

[మార్చు]

ఆషా శైని చండీఘర్ లోని ఒక ఆర్మీ అధికారి కుటుంబంలో జన్మించింది. ఆమె జన్మనామం ఫ్లోరా. జమ్మూ కశ్మీర్ లోని ఉదంపూర్ లోనూ, ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివింది.[2] తర్వాత కొద్ది కాలానికి ఆమె కుటుంబం కోల్కతకు మారింది. అక్కడే ఆమె మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నించింది. మిస్ కోల్కత అందాల పోటీల్లో పాల్గొనింది.[3]

కెరీర్

[మార్చు]

ఆమె 1999లో వచ్చిన ప్రేమకోసం అనే తెలుగు సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా నిర్మాత ఆమె పేరును ఆషా సైనిగా మార్చాడు. ఒక జ్యోతిష్కుడి సలహాతో కొద్ది రోజులు మయూరి అని పేరు మార్చుకుని చివరికి ఆశా అనే పేరుకే స్థిరపడింది.[4] తర్వాత ఆమె 10 సినిమాలకు పైగా సహాయ పాత్రలు పోషించింది. ఆమె సహాయ పాత్ర పోషించిన నరసింహ నాయుడు మంచి విజయం సాధించింది.[5]

2002 లో ఆమె టి. పి. అగర్వాల్ నిర్మించిన భారత్ భాగ్య విధాత సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది.[6] ఆమె రెండో హిందీ చిత్రం లవ్ ఇన్ నేపాల్ చిత్రంలో గాయకుడు సోనూ నిగంతో కలిసి నటించింది. తర్వాత నమ్మణ్ణ, గిరి లాంటి కన్నడ సినిమాల్లో నటించింది.[7]

వివాదం

[మార్చు]

మార్చి 2008 లో ఆమెను చెన్నైలో నకిలీ వీసా కలిగిఉన్నదనే నేరం మీద అరెస్టు చేశారు.[8] దాంతో ఆమెను తమిళ చిత్ర పరిశ్రమ బహిష్కరించింది.[9] కానీ ఆమె తాను నిర్దోషినని ప్రకటించింది.[10] దాంతో రెండు వారాల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తి వేశారు.[11]

సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Vinita Chaturvedi (2011-12-19). "Flora Saini: Another southern hottie ready to storm Bollywood". The Times of India. Archived from the original on 2013-01-03. Retrieved 2013-01-11.
  2. Deepa Natarajan (2010-04-22). "Rising like a phoenix". Deccanherald.com. Retrieved 2013-01-11.
  3. "Love in Delhi, the Fllora way". The Hindu. 2003-08-28. Archived from the original on 2003-10-24. Retrieved 2013-01-11.
  4. Y Sunita Chowdhary (2012-02-18). "Arts / Cinema : Itsy-Bitsy: Name game". The Hindu. Archived from the original on 2012-07-19. Retrieved 2013-01-11.
  5. "Welcome to". Sify. Archived from the original on 2013-02-02. Retrieved 2013-08-17.
  6. "rediff.com, Movies: Puru, Chandrachur: Face off!". Rediff. 2001-04-30. Retrieved 2013-01-11.
  7. "Karnataka / Bangalore News : Flora Shiny had acted in Kannada movies". The Hindu. 2008-03-15. Archived from the original on 2008-03-18. Retrieved 2013-01-11.
  8. "Asha Saini arrested in Chennai". Sify. Archived from the original on 2013-02-02. Retrieved 2013-01-11.
  9. "Aasha Saini aka Mayuri arrested en route to the US". IndiaGlitz. 2008-03-12. Archived from the original on 2008-03-14. Retrieved 2013-01-11.
  10. "Asha Saini claims innocence". Sify. 2008-03-28. Archived from the original on 2019-01-20. Retrieved 2013-08-17.
  11. "Actress relieved from ban". IndiaGlitz. 2008-07-24. Archived from the original on 2008-07-25. Retrieved 2013-01-11.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆషా_సైని&oldid=4014903" నుండి వెలికితీశారు