Jump to content

ఉషా గంగూలీ

వికీపీడియా నుండి
ఉషా గంగూలీ
జననం1945
మరణం2020 ఏప్రిల్ 23(2020-04-23) (వయసు 74–75)
వృత్తిరంగస్థల నటి, దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు1970–2020
సుపరిచితుడు/
సుపరిచితురాలు
వ్యవస్థాపకురాలు-దర్శకుడు రంగకర్మీ నాటక సంస్థ (1976)

ఉషా గంగూలీ (1945 - ఏప్రిల్ 23, 2020) భారతీయ రంగస్థల నటి, దర్శకురాలు. 1970ల, 1980లలో కోల్‌కతాలోని హిందీ నాటకరంగంలో పనిచేసింది. 1976లో రంగకర్మీ థియేటర్ గ్రూపును స్థాపించి, మహాభోజ్, రుడాలి, కోర్ట్ మార్షల్, అంటార్యాత్ర వంటి నాటకాలు రూపొందించింది.[1][2][3] 1972లో పడతిక్‌కు చెందిన థెస్పియన్ శ్యామానంద్ జలన్ కాకుండా, కోల్‌కతాలోని హిందీ నాటకానికి చెందిన ఏకైక దర్శకురాలు.[4][5] రంగస్థల దర్శకురాలిగా 1998లో భారతదేశ కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు,[6] గుడియా ఘర్ నాటకానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి ఉత్తమ నటి అవార్డులు అందుకుంది.[1]

జీవిత విషయాలు

[మార్చు]

ఉత్తరప్రదేశ్‌ లోని నెర్వా గ్రామంలోని కుటుంబానికి చెందిన ఉషా గంగూలీ 1945లో రాజస్థాన్‌ లోని జోధ్‌పూర్‌ లో జన్మించింది. భరతనాట్యం నేర్చుకుని తరువాత కోల్‌కతాకి వెళ్ళింది. కోల్‌కతాలోని శ్రీ శిక్షాయతన్ కళాశాలలో చదువుకున్న ఉషా, హిందీ సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేసింది.[7] 1970లో కలకత్తా విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీ భౌవానిపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజీలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేసి, 2008లో పదవీ విరమణ చేసంది.

నాటకరంగం

[మార్చు]

శూద్రకుడు రాసిన మృచ్ఛకటికమ్‌ నాటకం ఆధారంగా 1970లో సంగిత్ కళామందిర్ సంస్థ ప్రదర్శించిన మిట్టి కి గాడి నాటకంలోని వసంతసేన పాత్రతో తన రంగస్థల ప్రస్థానాన్ని ప్రారంభించింది.[8] హిందీ అధ్యాపకురాలిగా బోధన కొనసాగిస్తూనే నాటకరంగంలో కృషిని కొనసాగించింది.[9]

1976, జనవరిలో రంగకర్మీ నాటక సంస్థను ఏర్పాటుచేసింది.[8] నర్తకిగా శిక్షణ పొందిన ఉషా, మదర్ నాటకానికి దర్శకత్వం వహించిన ఎంకె.అన్వాసే, ఇబ్సన్ నాటకం ఎ డాల్స్ హౌస్ అనుకరణైన గుడి ఘర్ నాటకాన్ని దర్శకత్వం వహించిన త్రిప్టి మిత్రాలను తన సంస్థ నాటకాలను దర్శకత్వం చేయడానికి ఆహ్వానించింది. త్రిప్టి మిత్రా, మృణాళ్ సేన్ ల ఆధ్వర్యంలో దర్శకత్వంలో శిక్షణ పొందింది.

1980లలో నాటక దర్శకత్వం ప్రారంభించిన ఉషా, కొద్దికాలంలోనే యువకులు, పేరొందిన నటులతో కలిసి కలకత్తా నగరంలో హిందీ నాటకానికి పునరుజ్జీవనాన్ని తెచ్చింది. మన్ను భండారి నవల ఆధారంగా 1984లో మహాభోజ్ నాటకం, 1987లో రత్నాకర్ మట్కారి లోక్ కథ (జానపద కథ) నాటకం, 1989లో నాటక రచయిత మహేష్ ఎల్కుంచ్వార్ హోలీ నాటకం, 1992లో మహాశ్వేతా దేవి కథను నాటకాకరణ చేసిన రుడాలి నాటకం, బ్రెహ్ట్ రాసిన మదర్ కరేజ్ ఆధారంగా హిమ్మత్ మాయి నాటకం, కోర్ట్ మార్షల్ నాటకం (అనుకరణ: స్వదేశ్ దీపక్) లకు దర్శకత్వం వహించంది.[9] 2003లో కాశినమా అనే నాటకాన్ని రాసింది.

నాటకాలు

[మార్చు]
  1. మహాభోజ్ (ది గ్రేట్ ఫీస్ట్) (1984)
  2. లోక్ కథ (జానపద కథ) (1987)
  3. హోలీ (1989)
  4. కోర్ట్ మార్షల్ (1991)
  5. రుడాలి (ది మౌర్నర్) (1992)
  6. హిమ్మత్ మాయి (మదర్ కరేజ్) (1998)
  7. ముక్తి (1999)
  8. శోభయత్ర (2000)
  9. కాశినమా (2003)
  10. ఛండాలిక
  11. సర్హాద్ పర్ మాంటో
  12. మనసి (బెంగాలీలో) (2011)[10]

ఇతర వివరాలు

[మార్చు]
  1. ఓ హెన్రీ రాసిన ది గిఫ్ట్ ఆఫ్ ది మాగీ ఆధారంగా 2004లో రితుపర్నో ఘోష్ దర్శకత్వం వహించిన రెయిన్ కోట్ హిందీ సినిమా స్క్రిప్ట్ రచనలో సహకరించింది.
  2. 1990లలో రంగకర్మీ నుండి నటశిక్షణ శిబిరాలు ప్రారంభించింది.[11]
  3. 2005లో జర్మనీ లోని స్టుట్‌గార్ట్‌లో జరిగిన థియేటర్ డెర్ వెల్ట్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చిన ఏకైక భారతీయ నాటక బృందంగా రంగకర్మీ నిలిచింది.[8]
  4. సంస్థ నుండి 2006లో లాహోర్ నగరంలో జరిగిన పంజ్ పానీ పండుగలో రుడాలి నాటకాన్ని ప్రదర్శించింది.[12]
  5. 2010, ఆగస్టులో మాదకద్రవ్యాల పునరావాస కేంద్రంలోని ఖైదీల మనస్సుల గురించి తన మొదటి బహుభాషా నాటకం భోర్ ప్రదర్శించింది.[13]

మరణం

[మార్చు]

ఉషా గంగూలి 2020, ఏప్రిల్ 23న కలకత్తాలో మరణించింది.[14][15]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Using theatre to voice her deepest concerns". The Tribune. 20 September 2004.
  2. "Calcutta, home to Hindi Theatre". The Hindu. 29 అక్టోబరు 1997. Archived from the original on 25 జూలై 2011. Retrieved 23 ఏప్రిల్ 2020.
  3. "Panelist: Usha Ganguly – South Asian Theater Festival, 2009". South Asian Theater Festival. 2009. Archived from the original on 27 July 2011.
  4. Dharwadker, p. 440
  5. Borah, Prabalika M. (1 March 2011). "The language of expression". The Hindu. Chennai, India.
  6. "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 17 ఫిబ్రవరి 2012. Retrieved 23 ఏప్రిల్ 2020.
  7. "Change-makers to beat bias". The Telegraph. Calcutta, India. 22 April 2006. Archived from the original on 23 ఫిబ్రవరి 2018. Retrieved 23 ఏప్రిల్ 2020.
  8. 8.0 8.1 8.2 "Everyone is not going to sit silent...?". The Telegraph (Kolkata). Calcutta, India. 23 July 2005. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 23 ఏప్రిల్ 2020.
  9. 9.0 9.1 "Usha Ganguly:Profile and Interview at Prithivi Theatre Festival 2006". mumbaitheatreguide.com. November 2006. Archived from the original on 2020-01-16. Retrieved 2020-04-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. "Drama: March 12". The Telegraph (Kolkata). Calcutta, India. 10 March 2011.
  11. "Theatre adapts to changes". Deccan Chronicle. 26 February 2011. Archived from the original on 9 జూలై 2011. Retrieved 23 ఏప్రిల్ 2020.
  12. "Samaaj, Rudali and Sassi Punnoo at Punj Pani festival". Daily Times. 6 April 2006.
  13. "Waiting for a new dawn". Indian Express. 6 August 2010.
  14. India Today, Life Style (23 April 2020). "Thespian Usha Ganguly dies at 75 in Kolkata. Shabana Azmi, Aparna Sen mourn loss". Archived from the original on 23 ఏప్రిల్ 2020. Retrieved 23 April 2020.
  15. Indian Ecpress, Entertainment (23 April 2020). "Theatre personality Usha Ganguli passes away". Dipanita Nath. Archived from the original on 23 ఏప్రిల్ 2020. Retrieved 23 April 2020.

ఇతర లంకెలు

[మార్చు]