ఎఱకేశ్వర దేవాలయం (పిల్లలమర్రి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎఱకేశ్వర దేవాలయం (పిల్లలమర్రి)
పిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం
పిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం
ఎఱకేశ్వర దేవాలయం (పిల్లలమర్రి) is located in Telangana
ఎఱకేశ్వర దేవాలయం (పిల్లలమర్రి)
తెలంగాణలో దేవాలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు17°10′11″N 79°34′56″E / 17.169683°N 79.582198°E / 17.169683; 79.582198Coordinates: 17°10′11″N 79°34′56″E / 17.169683°N 79.582198°E / 17.169683; 79.582198
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసూర్యాపేట
స్థలంపిల్లలమర్రి
సంస్కృతి
దైవంచెన్నకేశవ స్వామి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుకాకతీయ నిర్మాణ శైలి
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీc. 1208 CE

ఎఱకేశ్వర దేవాలయం, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా, పిల్లలమర్రి గ్రామానికి పశ్చిమ వైవున్న ఒక శివాలయం. మూసీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయాన్ని సా.శ 1208లో కాకతీయులకు సామంతులైన రేచర్ల కుటుంబానికి చెందిన బాటిరెడ్డి భార్య ఎఱకసాని నిర్మించింది.[1][2][3][4][5] పిల్లలమర్రి గ్రామంలో రాతి, గ్రానైట్ చెక్కబడిన నాలుగు దేవాలయాలలో ఈ ఎఱకేశ్వర దేవాలయం ఒకటి. మిగిలిన మూడు దేవాలయాలు (పార్వతి-మహాదేవ నామేశ్వర దేవాలయం, త్రికూటేశ్వర ఆలయం, చెన్నకేశవ దేవాలయం) ఈ దేవాలయానికి తూర్పున 250 మీటర్ల దూరంలో ఉన్నాయి. .

స్థానం[మార్చు]

65వ జాతీయ రహదారిలో రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 153 కి.మీ దూరంలో, సూర్యాపేట పట్టణానికి వాయువ్యంగా 8 కి.మీ దూరంలో ఈ పిల్లలమర్రి గ్రామం ఉంది.

చరిత్ర[మార్చు]

ఎఱకేశ్వర దేవాలయ అంతస్తు ప్రణాళిక

13వ శతాబ్దం ప్రారంభంలో (సా.శ 1203-1208)[2][6] కాకతీయుల దగ్గర సామంతులుగా పనిచేసిన రేచర్ల అధిపతులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. సా.శ 1208లో పిల్లలమర్రిలో రేచర్ల కుటుంబానికి చెందిన బాటిరెడ్డి భార్య ఎఱకసాని ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఇక్కడున్న ఒక శాసనంలో పేర్కొనబడింది.[1][3][4] అందువల్ల ఇక్కడి దేవుడికి ఎఱకేశ్వరుడు అనే పేరు పెట్టారు. [5][7][8] 14వ శతాబ్దం ప్రారంభంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దక్కన్ ప్రాంతంలో జరిపిన దాడుల సమయంలో ఈ ఆలయం ధ్వంసం చేయబడింది. ఆ తరువాత ముసునూరి నాయక రాజవంశానికి చెందిన కాపయ్య నాయకుడికి సేవలందిస్తున్న స్థానిక ఫ్యూడటరీ చీఫ్ ద్వారా ఎఱకేశ్వర స్వామిని తిరిగి స్థాపించినట్లు సా.శ 1357నాటి శాసనంలో పేర్కొనబడింది.[9]

ఇక్కడి ప్రాంగణంలో దేవాలయ చరిత్ర, పిల్లలమర్రి గ్రామ చరిత్ర గురించి తెలుగులో రాతి శాసనాలు ఉన్నాయి. సా.శ 1195(శాక. 1117) నాటి శాసనంలో మొదటి ప్రతాపరుద్రుని పాలన గురించి, సా.శ 1208 (శాక 1130) నాటి శాసనంలో గణపతిదేవుని పాలన గురించి ప్రస్తావించబడింది.[10][11]

1926, 1927లో పురావస్తు శాస్త్రవేత్త, ఎపిగ్రాఫిస్ట్ గులాం యజ్దానీ ఆధ్వర్యంలో ఈ దేవాలయ తొలి పురావస్తు సర్వేలు, డాక్యుమెంటేషన్ పూర్తయి, 1929లో ప్రచురించబడ్డాయి. పిల్లలమర్రిలోని నాలుగు దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటికి తప్పుగా పేరు పెట్టబడ్డాయని ఈ అధ్యయనంలో తేలింది.[12]

 • సోమేశ్వర గుడి (ఇప్పుడు ఎఱకేశ్వర దేవాలయం)
 • నరసింహదేవ దేవాలయం (ఇప్పుడు నామేశ్వర దేవాలయం)
 • ముకండేశ్వర దేవాలయం (ఇప్పుడు త్రికూటేశ్వర దేవాలయం)
 • రామేశ్వర దేవాలయం (ఇప్పుడు చెన్నకేశవ దేవాలయం)

నిర్మాణ శైలి[మార్చు]

ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోట గుళ్ళు దేవాలయం, కాకతీయ శకంలోని ఇతర దేవాలయాల నిర్మాణ శైలిని పోలినట్లుగా ఈ దేవాలయ నిర్మాణ శైలి ఉంటుంది. ఈ దేవాలయం ఒక ఉపపీఠంపై ఉంచబడి, శిలువ ఆకారంలో ఉంటుంది.[13][14] దీనికి తూర్పు, ఉత్తర, దక్షిణాలలో మూడు వరండాలు, పశ్చిమాన గర్భాలయం ఉన్నాయి. శిఖర గర్భగుడిని ఇటుక, సున్నంతో తయారు చేశారు. ఈ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన రాయి ఆసక్తికరమైన ధ్వని లక్షణాలను కలిగి ఉందని చెప్పబడింది. గుడి రాయిని నాణెంతో తట్టినప్పుడు, అది లోహంలా శబ్ధాన్ని చేస్తున్నట్టు అనిపిస్తుంది.[14] దేవాలయంలో స్తంభాలు, గోడలు చెక్కబడ్డాయి. గోడలు ఫ్రెస్కోలతో పెయింట్ చేయబడ్డాయి.

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Rao, P. R. Ramachandra (2005). The Splendour of Andhra Art (in ఇంగ్లీష్). Akshara. p. 86.
 2. 2.0 2.1 "Monuments - Archaeology and Museums". tsdam.com. Retrieved 4 September 2021.
 3. 3.0 3.1 Rao, M. Rama (1966). Select Kākatīya Temples (in ఇంగ్లీష్). Sri Venkatesvara University. p. 91.
 4. 4.0 4.1 Ganapathi, Racharla (2000). Subordinate Rulers in Medieval Deccan (in ఇంగ్లీష్). Bharatiya Kala Prakashan. p. 155. ISBN 978-81-86050-53-8.
 5. 5.0 5.1 Kumari, V. Anila (1997). The Andhra Culture During the Kakatiyan Times (in ఇంగ్లీష్). Eastern Book Linkers. p. 3. ISBN 978-81-86339-15-2.
 6. "Telangana Protected Monuments List - Heritage Act 2017" (PDF). p. 40.
 7. Mukherjee, Amitabha (1996). Women in Indian Life and Society (in ఇంగ్లీష్). Punthi Pustak and Institute of Historical Studies. p. 89. ISBN 978-81-85094-97-7.
 8. Suryakumari, A. (1982). The Temple in Andhradesa (in ఇంగ్లీష్). Sarvodaya Ilakkiya Pannai. p. 35.
 9. Sarma, Mukkamala Radhakrishna (1972). Temples of Telingāṇa: The Architecture, Iconography, and Sculpture of the Cāḷukya and Kākatīya Temples (in ఇంగ్లీష్). Booklinks Corporation. p. 100.
 10. "PillalaMarri Temple, Telangana Tourism, TS". tstourism.co.in. Retrieved 4 September 2021.
 11. Singh, B. Satyanarayana (1999). The Art and Architecture of the Kākatīyas (in ఇంగ్లీష్). Bharatiya Kala Prakashan. p. 84. ISBN 978-81-86050-34-7.
 12. Ghulam Yazdani (1929), Annual Report of the Archaeological Department of His Exalted Highness the Nizam's Dominions for 1336 F (1926-1927 AD), Archaeological Department of Hyderabad, Baptist Mission Press, pp. vi, Plates I, II, V, VI
 13. Arch. Series (in ఇంగ్లీష్). Government of Andhra Pradesh, Department of Archaeology. 1960. p. 27.
 14. 14.0 14.1 Chatterjee, Saurabh. "A jewel in a nondescript town". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 4 September 2021.

బయటి లింకులు[మార్చు]