ఎల్.బి. నగర్ అండర్ పాస్
ఎల్.బి. నగర్ అండర్ పాస్ | |
---|---|
![]() ఎల్.బి. నగర్ అండర్ పాస్ ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్ | |
మార్గ సమాచారం | |
Existed | 16 మార్చి 2022–present |
Location | |
States | తెలంగాణ |
ఎల్.బి. నగర్ అండర్ పాస్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హయాత్‌నగర్ మండలంలోని ఎల్.బి. నగర్ చౌరస్తాలో ఉన్న అండర్ పాస్. ఎల్.బి నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చౌరస్తాకి కుడివైపున 40 కోట్ల రూపాయలతో ఈ అండర్ పాస్ నిర్మించబడింది.[1][2]
ప్రారంభం[మార్చు]
2022 మార్చి 16న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు ఈ అండర్ పాస్ ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.[3][4]
నిర్మాణ వివరాలు[మార్చు]
హైదరాబాద్ నగరంలో ఎల్.బి నగర్ చౌరస్తా అనేది అత్యంత ప్రధానమైనది. వరంగల్, నల్గొండ, ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలతో ఇక్కడి ప్రాంతమంతా రద్దీగా ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణకు, నివారణకు ఈ ప్రాంతంలో అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టబడ్డాయి. 40 కోట్ల రూపాయలతో 490 మీటర్ల పొడవు, 12.875 మీటర్ల వెడల్పు, 72.50 మీటర్ల బాక్స్ పోర్షన్ 3 లేన్ల యునీ డైరెక్షన్ లో ఈ అండర్ పాస్ నిర్మాణం జరిగింది.[1]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 Telugu, TV9 (2022-03-16). "Hyderabad: వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేడు అందుబాటులోకి రానున్న ఎల్బీనగర్ అండర్‌పాస్, ఫ్లై ఓవర్". TV9 Telugu. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (16 March 2022). "సాగర్ చౌరస్తా TO ఉప్పల్ రయ్..రయ్.. మెరుగు పడిన ప్రజా రవాణా". EENADU. Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
- ↑ telugu, NT News (2022-03-16). "ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.
- ↑ "KTR: ఆ నిధులు తెస్తే కిషన్‌రెడ్డిని సన్మానిస్తాం: కేటీఆర్". EENADU. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.