Jump to content

ఎల్.శర్మన్ నాయక్

వికీపీడియా నుండి
ఎల్. శర్మన్ నాయక్
జననంఎల్ .శర్మన్ నాయక్
జూన్ 20,1962
రాం నాయక్ తాండ జన్నారం మండలం, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తిIAS అధికారి (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్)
ప్రసిద్ధిగిరిజన ఐఎఎస్
మతంహిందూ మతము
భార్య / భర్తజయశ్రీ
పిల్లలుఇద్దరు కుమార్తెలు సంకీర్తన, జాహ్నవి
తల్లిదండ్రులురాము నాయక్, హస్లీబాయి

ఎల్ .శర్మన్ నాయక్ (జననం: 20 జూన్ 1962) తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా,జన్నారం మండలంలోని రాం నాయక్ తాండ నివాసి .లంబాడీ గిరిజన తెగకు చెందిన ఐఎఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అధికారి[1][2][3] .

జననం విద్యాభ్యాసం

[మార్చు]

శర్మన్ నాయక్ తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రాంనాయక్ తాండలో లావుడ్యా రామునాయక్, హస్లీబాయి అను లంబాడీ గిరిజన దంపతులకు జన్మించాడు. నాన్న వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.వాళ్ళ నాన్నకు నా కొడుకు ఆఫీసర్ ‌కావాలని కోరిక ఉండేది. నాన్న కోరిక మేరకు శర్మన్ జన్నారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకూ చదివారు. పదవ తరగతి పరీక్షలలో ఫెల్ అయి రెండేళ్ళు ఇంటి వద్దనే ఉన్నాడు.అనంతరం‌ కష్టపడి చదవి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి, ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లక్సెట్టిపేట యుందు హెచ్ ఈ సీ తీసుకుని మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై నిజాం కాలేజీ హైదరాబాద్ లో బిఏ డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.ఏ రాజనీతి శాస్త్రంలో కూడా ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాడు . అంతటితో ఆగకుండా మళ్ళీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి చదివి ఆ తర్వాత సివిల్ ప్రిపేర్ అయి మూడు సార్లు ఇంటర్వూ వరకు వేళ్ళారు.

ఉద్యోగ జీవితం

[మార్చు]

ఎల్.శర్మన్ రాజనీతి శాస్త్రంలో ఎం.ఎ పూర్తి చేసిన తర్వాత ఇండియన్ పోస్టల్ శాఖలో వెలువడిన ప్రకటనలో జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి ఎంపికైనాడు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ అడ్మినిస్ట్రేషన్ అబిడ్స్ లోని హైదరాబాద్ జనరల్ పోస్ట్ ఆఫీస్ (జిపిఓ)లో పని చేస్తూ కొన్ని నెలలు తరువాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.న్యాయ విద్యా కోర్సు పూర్తి చేసిన తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ లో ఇన్ స్పెక్టర్ ఉద్యోగం సాధించాడు. అంతటితో ఆగకుండా ఐఏఎస్ కావాలనే సంకల్పంతో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ సబ్జెక్టులుగా తీసుకుని సివిల్స్ పరీక్షలు రాసి మూడు సార్లు ఇంటర్వూ వరకు వేళ్ళారు. 1994లో గృప్ వన్ ఎంపికయ్యారు. కరీంనగర్ జిల్లాలో శిక్షణ, ప్రొబేషనరీ అనంతరం నాగర్ కర్నూల్ ఆర్డీవో గా పని చేశాడు. గృప్ వన్ అధికారిగా విధుల్లో చేరి ఐఏఎస్ అధికారి అయ్యే వరకు జీహెచ్ఎంసీ అదనపు కార్యదర్శిగా, మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేశాడు.అనంతరం ఐఏఎస్ అధికారి అయిన తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్[4],ఆ తర్వాత హైదరాబాదు కలెక్టర్ గా పని చేసి పదవీ విరమణ పొందాడు[5][6].

కరోనా ‌వారియర్ అవార్డు

[మార్చు]

ఎల్ శర్మన్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కరోనా వైరస్ నివారణ చర్యలతో పాటు,హరిత హారంలో భాగంగా మొక్కులు నాటడం వివిధ అభివృద్ధి అంశాల్లో శ్రద్ధ చూపడం[7][8] ,ప్రతి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించాడు. ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించి ఆపదలో ఉన్న గర్భిణీ స్త్రీలకు రక్తదానం చేయడం, పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అను నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయడం ,నాగర్‌కర్నూల్ జిల్లాలో సుమారు మూడు వందల గ్రాములను సందర్శించడం మొదలుపెట్టాడు.అతని సేవలకు గుర్తింపుగా కరోనా ‌వారియర్ అవార్డు దక్కింది. విశ్వ గురు వరల్డ్ రికార్డు అవార్డు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యవోలు రాంబాబు అందజేయడం జరిగింది.

రాజకీయ జీవితం

[మార్చు]

శర్మన్ హైదరాబాద్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లో రావాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్లో ఖానాపూర్ నియోజకవర్గ వర్గంలో ప్రచారం కూడా జరిగింది.భారత రాష్ట్ర సమితి అధినాయకులతో సాంప్రదింపులు చేస్తూ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. 30 జూన్ 2022న పదవీ విరమణ అనంతరం జన్నారం మండల కేంద్రంలో పదవీ విరమణ ఆత్మీయ వీడ్కోలు మహోత్సవం ఏర్పాటు చేశాడు.భారీ సంఖ్యలో జనం సమీకరించి సమావేశం ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల‌ ముందస్తు ప్రచారం కూడా మొదలు పెట్టాడు.కాని అనుకోకుండా ప్రమాదం జరగడంతో రాజకీయాలకు దూరం అయినాడు[9][10].

మూలాలు

[మార్చు]
  1. [hycollector sharman "Hyderabad collector"]. {{cite web}}: |first= missing |last= (help); Check |url= value (help)
  2. "Hyderabad Collector: పది తప్పినా.. పాలనాధికారినయ్యా". EENADU. Retrieved 2024-12-11.
  3. Network, Elets News (2021-08-14). "L Sharman becomes Collector Hyderabad & S Harish becomes Collector, Medchal-Malkagiri". Elets eGov (in ఇంగ్లీష్). Retrieved 2024-12-11.
  4. Network, Elets News (2021-08-14). "L Sharman becomes Collector Hyderabad & S Harish becomes Collector, Medchal-Malkagiri". Elets eGov (in ఇంగ్లీష్). Retrieved 2024-12-11.
  5. "Telangana: IAS Officer L Sharman May Join in TRS Party - Sakshi". www.sakshi.com. Retrieved 2024-12-11.
  6. "హైదరాబాద్‌ కలెక్టర్‌గా ఎల్‌ శర్మన్‌ | Hyderabad District: L Sharman Appointed As Collector | Sakshi". www.sakshi.com. Retrieved 2024-12-11.
  7. ABN (2020-12-30). "పల్లెల అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వీడండి". Andhrajyothy Telugu News. Retrieved 2024-12-11.
  8. Bharat, E. T. V. (2020-08-29). "మొక్కలు నాటి ఛాలెంజ్​ విసిరిన కలెక్టర్​ శర్మన్​". ETV Bharat News. Retrieved 2024-12-11. {{cite web}}: zero width space character in |title= at position 21 (help)
  9. sarvi (2022-04-28). "టీఆర్ఎస్‌లోకి హైదరాబాద్ కలెక్టర్ శర్మన్.. ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్‌పై ఆశలు..!". www.teluguglobal.com. Retrieved 2024-12-11.
  10. sreeharsha.gopagani. "IAS L.Sherman : పొలిక‌ల్ ఎంట్రీ ఇవ్వనున్న హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ ఎల్‌.శర్మన్‌.. ? ఎప్ప‌టి నుంచి అంటే ?". Asianet News Network Pvt Ltd. Retrieved 2024-12-11.