Jump to content

ఎ.జోసెఫ్

వికీపీడియా నుండి

ఎ.జోసెఫ్ జంతు, ఇంజనీరింగ్ శాస్త్రవేత్త. యానిమల్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ లో సుప్రసిద్ధుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయంలో చదివారు. ఆ తరువాత పీ.హెచ్.డి చేశారు. జంతు శాస్త్రములో అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉంటూ ఇంజనీరింగ్ నిపుణులు సైతం ఆశ్చర్య పడే విధంగా సాంకేతిక సంపత్తిని సృజించారు. అక్కడ పదోన్నతి పొంది జంతుశాస్త్ర విభాగాధిపతిగా మరో సంకేతిక అబ్బురాన్ని సృష్టించారు.[1]ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే పదవీవిరమణ చేసారు.[2]

పరిశోధనలు

[మార్చు]

ఈయన అధ్యయనం చేసింది పరిశోధనలు చేసింది జంతుశాస్త్రం లో, అంతర్జాతీయ ఖ్యాతి గడిమ్సినది మాత్రం ఇంజనీరింగ్ రంగంలో. జంతు నిర్మాణాలను ఇంజనీరింగ్ శాస్త్రంతో అనుసంధించి అనేక నిర్మాణాలు చేసి అంతర్జాతీయ ఖ్యాతి పొందారు.[3]

జీవరాశులు శరీర ధర్మాలను, జీవిత చరిత్రలను ప్రక్రుతిలో వాటి ప్రయోజనాలను అధ్యయనం చేసిన ఆయన ఇంజనీరింగ్ నిపుణుల ఉహకు అందని విధంగా 2000 నవంబరులో “సాంకేతిక సామగ్రి”ని రూపొందించారు. ముఖ్యంగా జీవరాసుల శరీరాకృతిని, వాటి క్రియాశీలతను ఆధారంగా చేసుకొని ఈయన తయారుచేసిన పరికరాలు పరిశోధనా కేంద్రాలలో పాటు దేశ రక్షణ రంగ అవసారాలను కొన్నింతిని తీర్చాయి.[4]

డాక్టర్ జోసెఫ్ "మెరైన్ బయోలాజికల్ ఇన్‌ష్ట్రమెంటేషన్" పేరిట తమ అధ్యయనాలను 1980 నుండి కొనసాగించారు. ఈయన కనుగొన్న 22 పరికరాలలో 9 పరికరాలు డాక్టరేట్ డిగ్రీలను అందించాయి. 2000 సంవత్సరంలో రూపొందించిన "మల్టిపుల్ గ్రాబ్ ఎక్విప్‌మెంటు"ను ఆనాటి విశ్వవిద్యాలయ్ం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్. రాధాకృష్ణ 2011, డిసెంబరు 11 న జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. సముద్ర జీవాలలోఒకటైన జెల్లీ ఫిష్ శరీరాకృతి, శరీర ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించారు. దీనిలో అండర్ వాటర్ వీడియో కెమేరా, వర్తులాకారపు ఈ పరికరాన్ని సముద్ర గర్భంలోకి వదిలి నౌకల నుండి సముద్ర అంతర్భాగాలను వీక్షిస్తూ "గ్రాబ్స్"తో అగాధాలలో ఉండే వస్తువులను పట్తి పైకి తీసుకు రావచ్చు.

డా. జోసెఫ్ "రోటరీ వీడియో మైక్రోస్కోప్"ను 1997 లో ఆవిష్కరించారు[5][6] దీనిని అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ ఆవిష్కరించారు.

కాళీదేవాలయం,విశాఖపట్నం

[మార్చు]

విశాఖపట్నంలో కాళీదేవాలయం జోసెఫ్ యొక్క అద్భుత సృష్టి. ఆ నిర్మాణ శైలి ప్రస్తుత నిర్మాణాలకూ భిన్నంగా ఉంటుంది. ఈ కట్టడం పర్యాటకులను ఆకర్షిస్తుంది.జంతువుల శరీర నిర్మాణాలను అధ్యయనం చేసి ఆ నిర్మాణ స్వరూపాన్ని సాంకేతిక రంగంలో ఉపయోగించే ఆలోచనతో జోసెఫ్ దానిని పగడం యొక్క నిర్మాణం మీద డిజైన్ చేసారు. సెమెంటు కాంక్రీటు ఉపయోగించి వెదురు బొంగులతో పటిష్ఠ నిర్మాణం చేసారు. నిర్మాణంలో స్తీల్ లేదా ఐరన్ను ఏ మాత్రం ఉపయోగించలేదు. చివరకు పునాదులు కూడా లేవు. ఇంజనీరింగ్ చదవకుండానే ఇంతటి అపూర్వ నిర్మాణం చేయడం ఇంజనీరింగ్ నిపుణులను అబ్బురపరచింది. ఈ నిర్మాణంలో ప్రణాళీకను మ్యునిసిపల్ అధికారులు అనుమతినీయలేదు కానీ 1982 లో అప్పతి మ్యునిసిపల కమీషనర్ కె.వి.రావు వ్యక్తిగత ఆసక్తితో ఈ నిర్మాణానికి అనుమతినిచ్చారు. ఈ నిర్మాణానికి ఎటువంటి పునాదులు లేకుండా ఇసుక నేల మీదనే నిర్మిచారు. భూకంపాలకు తట్టుకొనే విధంగా నిర్మాణ శైలిని రూపొందించారు. ఈ నిర్మాణం 1982 లో ప్రారంభమై 1984 పూర్తయించి.[3]

ఇతర ప్రాజెక్టులు

[మార్చు]

ఆయన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ కాంపస్ పై బ్రిడ్జి కొరకు 18 అడుగుల అర్థ చంద్రాకార ఆర్చిని నిర్మించారు. ఈ నిర్మాణాన్ని మానవుని పుర్రెలో గల కీళ్ళ ఆధారంగా నిర్మించారు. ఇది మల్టీ లాకింగ్ సిస్ట్ంతో నిర్మితమైనది. ఇందులో రాయి, కాంక్రీటును మాత్రమేవాది ఇనుమును గానీ చెక్కగానీ వాడలేదు. ఈ నిర్మాణ వ్యయాన్ని కొన్ని వేల రూపాయలలో నిర్మించారు. ఈ నిర్మాణ పతిష్ఠతను పరిశీలించుటకు ఇసుక లారీలను, రోడ్డు రోలర్లను దానిపైకి పంపి పరిశీలించి నాణ్యతా పరమైనదని ధ్రువీకరించారు.[3]

వ్రేలాడే ఇళ్ళు

[మార్చు]

ప్రస్తుతం మనం వాడే యిళ్ళ వంటి నిర్మాణాలు ప్రకృతిలో ఏ జీవరాశి కూడా నిర్మించడం లేదు. ఆయన పక్షుల నివాసాలను పరిశీలించారు. ఆయన ఒకసారి 60 అడుగుల ఎత్తుపై నుండి పడిపోయిన పక్షి గూడులోని రెండు పిల్లలు సజీవంగా ఉండటం గమనించాడు. అటువంటి నిర్మాణాలు తక్కువ వ్యయంతో బలంగా ఉండటంతో వాటిని నిర్మిచాలని భావించాడు. ఆయన తన నివాస ప్రాంతమైన జ్ఞానపురంలో ఈ విధమైన నిర్మాణాన్ని నిర్మించి పరీక్షించారు. అడవులలో పర్యాటకులకు ఇటువంటి నిర్మాణాలను పర్యాటకం శాఖ కోరిక మేరకు తయారుచేసారు. ఇవి తుఫానులను కూడా తట్టుకొని నిలబడ్డాయి. వీటిని ప్రదేశం మార్చవచ్చు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Structure that can resist tremors". హిందూ పత్రిక. Retrieved 2005-02-05.
  2. "drdo news letter" (PDF). Archived from the original (PDF) on 2015-09-23. Retrieved 2015-06-09.
  3. 3.0 3.1 3.2 3.3 "Structure that can resist tremors". ద హిందూ. Retrieved 2005-02-05.
  4. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్ , విజయవాడ ed.). విజయవాడ: శ్రీ వాసవ్య. 2011. p. 57.
  5. Penetration behaviour of cercariae of Schistosoma spindale (Montgomery, 1906)[permanent dead link]
  6. "discovery of rotary video microscope" (PDF). Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-06-09.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎ.జోసెఫ్&oldid=3902573" నుండి వెలికితీశారు