ఏ.కామేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎ.కామేశ్వరరావు భారత స్వాతంత్ర్య సమరయోధుడు.

జీవితం[మార్చు]

కామేశ్వరరావు 1902లో జన్మించారు. ఆయన గుంటూరు ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆయన చిన్నతనంలోనే తన మామయ్యతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయారు. కర్నూలులో దాతల సహకారంతో చదువును కొనసాగించారు. అక్కడి నుంచి కూడా పారిపోయి 1917నాటికి బొంబాయి(నేటి ముంబై) చేరుకున్నారు.

సైన్యంలో[మార్చు]

నాలుగేళ్ళపాటు సైన్యంలో చేరి పనిచేశారు. పలు హోదాల్లో సైన్యంలో పనిచేసిన కామేశ్వరరావు, ప్రపంచ యుద్ధ కాలంలో మెసపుటేనియా ప్రాంతంలో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. సైనిక ధర్మాసనం ఆయనను సైన్యంలో చేసిన శిక్షింపదగిన పనుల కారణంగా కాల్చిచంపాలన్న తీర్పునిచ్చింది. అనంతరం సాంకేతికాంశాల కారణంగా ఆ మరణశిక్ష అమలుకాలేదు. ఆయన పొందిన ఆ పునర్జన్మను మాతృభూమి సేవకు వినియోగించారు.