Jump to content

ఐటీడీఏ ఉట్నూర్

వికీపీడియా నుండి

సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ITDA - UTNOOR (Integrated Tribal Development Agency) ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ ఉట్నూరు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు మండల కేంద్రంలో ఉంది. భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజనుల సంక్షేమం కోసం 01ఆగష్టు1975 లో స్థాపించారు[1].ఈ ఐటిడిఎ కు నిధుల పంపిణీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరుగుతుంది.

సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూరు
(ఐటిడిఎ ఉట్నూరు)
సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూరు
ఆశయంఆదివాసీలు, గిరిజనుల సంక్షేమం కోసం
స్థాపన01 ఆగస్టు 1975
వ్యవస్థాపకులుకేంద్ర ప్రభుత్వం గిరిజన మంత్రిత్వ శాఖ
ప్రధాన
కార్యాలయాలు
ఆదిలాబాదు,ఉట్నూరు
సేవాతెలంగాణ,ఉమ్మడి ఆదిలాబాదు
సేవలుగిరిజనుల అభివృద్ధికై
సభ్యులు4
అధికారిక భాషతెలుగు
అధ్యక్ష్యుడు/చైర్మన్జిల్లా కలెక్టర్
ప్రధాన కార్యనిర్వహకుడుప్రాజెక్టు ఆధికారి

1982 ఫ్రిబ్రవరి నెలలో ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఐఎఎస్ అధికారి శ్రీ ఎమ్.వెంకట పూర్ణ చంద్రశేఖర్ శాస్త్రి గోండు తెగ నుండి మొదటి గ్రౄప్- 1 అధికారి మడావి తుకారాం సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఆదిలాబాద్ నుండి పనిచేస్తున్న ఐటిడిఏ సంస్థ కార్యాలయాన్ని గిరిజన బాలుర వసతి గృహం ఉట్నూరు కి మార్చారు. ఐటిడిఏ లో పని చేయటానికి ఆ శక్తి గల సిబ్బంది అందరు కూడా ఉట్నూరులోనే ఉండి పనిచేయవలసిందిగా ఆదేశాలు కూడా జారీ చేయడంతో అధికారులందరు అంకితభావంతో గోండు గూడెంలో తాండాలో పర్యటించి గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేయడం ప్రారంభించారు.

క్రమసంఖ్య జిల్లా పేరు ఐటిడిఎ పేరు జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయం గిరిజన సంక్షేమశాఖ సహాయ సంక్షేమశాఖ అధికారి పాయింట్
1 ఆదిలాబాదు ఉట్నూరు ఉట్నూరు ఉట్నూర్,ఆదిలాబాద్,బోథ్
2 నిర్మల్ ఉట్నూరు నిర్మల్ నిర్మల్
3 ఆసిఫాబాద్ ఉట్నూరు ఆసిఫాబాద్ జైనూర్,ఆసిఫాబాద్,కాగజ్ నగర్
4 మంచిర్యాల ఉట్నూరు మంచిర్యాల మంచిర్యాల్

గిరిజన తెగలు

[మార్చు]

ఆదిలాబాదు జిల్లా గిరిజనుల్లో ఆదివాసీ, తెగలు గోండులు, కొలాములు,పర్ధన్ లు తోటీలు,కోయలు వీరంత ఒకే సామాజిక రాజకీయ ఆర్ధిక వ్యవస్థగా అల్లుకుని శతాబ్దాలుగా జీవిస్తూవచ్చారు.వీరిని అనుకుని కొద్ది సంఖ్యలో నాయక్ పోడులు,ఆంద్ లు,మన్నెవార్ కూడా ఉన్నారు.1976 నుంచి జిల్లాలో లంబాడీల్నీ కూడా షెడ్యూలు తెగగా భారత ప్రభుత్వం గుర్తించడంతో వారు గిరిజన సమూహంలో భాగంగా ఉంటున్నారు.వీరిలో కొలాముల్నీ,తోటీల్నీ ఆదిమ గిరిజన తెగలు (PVTG) గా ప్రభుత్వం గుర్తించింది. తక్కువ జనాభా, వ్యవసాయానికి పూర్వపు ఆర్థిక వ్యవస్థ అత్యంత కనిష్ట అక్షరాస్యత కలిగిన వీరు ఆదిమ గిరిజన తెగలు గా ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలోని గిరిజన మండలాలు

[మార్చు]

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 8 గిరిజన మండలాలున్నాయి.అవి 1) ఉట్నూరు, 2) ఇంద్రవెల్లి 3) నార్నూర్,4) జైనూర్, 5) సిర్పూర్ (యు) ,6) కెరమెరి,7) వాంకిడి, 8)తిర్యాని

లక్ష్యం

[మార్చు]

అదివాసీలు,గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తు గిరిజనుల సర్వతో ముఖాభివృధ్ధికి పాటుపడుతు కృషి చేయడం[2].

ఐటీడీఎ లో శాఖలు

[మార్చు]

1.చదువు

2.వైద్య,ఆరోగ్యం

3.ఇంజనీరింగ్ గిరిజన సంక్షేమశాఖ

4.భూమి బదిలి నియంత్రణ చట్టం(ఎల్ టి ఆర్ 1959)

5.పెసా చట్టం

6.పివిటిజి

7.వ్యవసాయం

8.నైపుణ్యాభివృధ్ధి

9.గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ట్రైకార్

పాలనా వ్యవస్థ

[మార్చు]

ఐటిడిఎ లో ఏకీకృత పాలనా వ్యవస్థ 1986లో జి.ఓ నెంబరు 434 రూపొందించింది.2002లో ఇది‌ మరింత బలోపేతం అయింది.గిరిజన గ్రామస్థాయిలో గ్రామ పెద్ద అందరి అవసరాలు ఎలా తీరుస్తారో సమీకృత గిరిజనాభివృద్ధిసంస్థలో కూడా ప్రాజెక్టు అధికారి[3] గిరిజనుల సమస్యలన్నింటిని తీర్చాలని ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం.ప్రాజెక్టు అధికారి పదవి రీత్యా జాయింట్ కలెక్టరు గాను అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గాను గుర్తించడం జరిగింది. ఐటిడిఎ ప్రాంతంలో పనిచేసే అన్ని శాఖలు అందరు అధికారులు ప్రాజెక్టు అధికారి క్రిందకు వస్తారు.[4] విద్య,వైద్య,ఇంజనీరింగ్, పట్టుపరిశ్రమ,ఉద్యానవనాలు,వ్యవసాయం,పౌరసంబంధాలలు,ఫారెస్టు కమిటీ,జిసిసి కి కూడా ప్రాజెక్టు అధికారి చైర్మన్ గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ ఐటిడిఎ కు ఛైర్మన్ గా ఉంటారు. గవర్నింగ్ బాడీకి అధికారాలు ఇవ్వటం వలన పాలనాపరమైన ఆర్థికపరమైన సౌలభ్యం ఏర్పడింది[5].

జి.ఓ.నెంబరు 3 ,

[మార్చు]

జి.ఓ.నెం3, సాంఘిక సంక్షేమ శాఖ తేది:10-01-2000 లో స్థానిక షెడ్యూలు తెగకు చెందిన అభ్యర్థి అనే పదన్ని నిర్వచించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 342 ప్రకారం ప్రకటించబడిన షెడ్యూలు తెగలకు చెందిన అదే జిల్లాకు చెందిన షెడ్యూలు ప్రాంతంలో వారు కాని వారి తల్లితండ్రులు కాని 26 జనవరి 1950 నుండి ఇప్పటి వరకు నివస్తున్న వారినే స్థానిక షెడ్యూలు తెగకు చెందిన అభ్యర్థి అని పరిగణిస్తారు. జి.ఓ.3, కోట్టి వేత? జి.ఓ నెం 3, ప్రకారం మొత్తం పోష్టులు స్థానిక ఆదివాసీలు, గిరిజనులకే ఎందుకు ఇవ్వాలి అనే విషయం పై ఖమ్మం జిల్లా నుంచి గిరిజనులేతరులు కోర్టులకు అస్రయించడంతో ఈ జి.ఓ ను కోట్టి వేయడం జరిగింది.

గిరిజన సహకార సంఘం

[మార్చు]

GCC (Girigana Co-Oparative Corporation) గిరిజనులు అడవి నుండి సేకరించిన వస్తువులను వారు పండించిన పంటలను సరియైన ధరలకు కొనుటకొక వ్యవస్థను,గిరిజన సహకార సంఘ ములను నెలకొల్పి వారి కార్థికముగ లాభమగునట్లు చేయుటకి ఈ జిసిసి సంస్థ కృషి చేయుచున్నది.

మూలాలు

[మార్చు]
  1. Today, Telangana (2024-01-26). "Efforts being made to transform lives of tribals: ITDA Utnoor PO". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-07-09.
  2. Today, Telangana (2024-01-26). "Efforts being made to transform lives of tribals: ITDA Utnoor PO". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-07-12.
  3. "ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా చాహత్ బాజ్పయ్". Prabha News. 2023-0702. Retrieved 2024-07-12. {{cite web}}: Check date values in: |date= (help)
  4. Today, Telangana (2024-02-22). "ITDA Utnoor PO inspects Ashram schools in Asifabad". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-07-12.
  5. "రెండేళ్లయినా.. మూణ్నెళ్లు కాలేదా". EENADU. Retrieved 2024-07-12.