Jump to content

కనెటికట్

వికీపీడియా నుండి
అమెరికా పటంలో కనెటికట్ రాష్ట్రం

కనెటికట్ అమెరికా లోని రాష్ట్రం. ఈ రాష్ట్రం ఈశాన్య అమెరికా లోని న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలో ఉంది. 1614 లో డచ్ వారి ఆధీనంలో ఉన్నప్పటికీ 1636 వ సంవత్సరానికి కనెటికట్ బ్రిటిషువారి ఏలుబడి లోనికి వచ్చింది. అమెరికా స్వతంత్ర పోరాటంలో బ్రిటిషు వారిపై తిరుగుబాటు చేసిన పదమూడు కాలనీలలో కనెటికట్ కూడా ఒకటి. కనెటికట్ వాసులను నట్ మెగ్గర్లు అని కానీ, యాంకీలు అనిగానీ పిలుస్తారు. అమెరికా జనాభా లెక్కల ప్రకారం కనెటికట్ అమెరికాలోకెల్లా అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం.[1][2][3] దీని రాజధాని హార్ట్‌ఫోర్డ్.

దీనికి తూర్పున రోడ్ ఐలండ్, ఉత్తరాన మస్సాచుసెట్స్, పశ్చిమాన న్యూయార్కు, దక్షిణాన లాంగ్ ఐలండ్ సౌండ్ ఉన్నాయి. రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ ప్రవహించే కనెటికట్ నది పేరు మీదుగా రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది.

విస్తీర్ణం పరంగా కనెటికట్, అమెరికా లోని మూడవ అతిచిన్న రాష్ట్రం.[4] జనాభా పరంగా 29 వ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. [5] అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాల్లో నాలుగవది. [4] రాజ్యాంగ రాష్ట్రం అని, నట్ మెగ్ రాష్ట్రం అనీ, ప్రొవిజన్స్ రాష్ట్రం అనీ, స్థిరమైన అలవాట్లు గల రాష్ట్రం అనీ ఈ రాష్ట్రానికి పేర్లున్నాయి.[6] అమెరికా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థను రూపొందించడంలో కనెటికట్ పాత్ర ప్రముఖమైనది.

కనెటికట్‌లో తొలి వలసలను స్థాపించిన ఐరోపావాసులు డచ్చి వారు. రాష్ట్రంలోని సగం డచ్చి వారి వలస, న్యూ నెదర్లాండ్‌లో భాగంగా ఉండేది. 1630 ల్లో ఇంగ్లీషు వారు తమ తొలి వలసను స్థాపించారు.

2019 జూలై 1 నాటికి కనెటికట్ జనాభా 35,65,287. 2010 నుండి ఇది 0.25% తగ్గింది.

రాష్ట్రం లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లోని చాలాభాగం న్యూయార్కు నగరంతో ముడిపడి ఉంది. అత్యధికంగా సంపద పోగుపడీన ప్రదేశం. ఆస్తుల ధరలు చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం. 2019 సంవత్సరానికి కనెటికట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి $289 బిలియన్లు. 2018 లో ఇది $277.9 బిలియన్లు ఉండేది.[7] 2019 లో రాష్ట్ర తలసరి ఆదాయం $79,087. అమెరికాలోనే ఇది అత్యధికం.[8] అయితే వివిధ వర్గాల ప్రజల ఆదాయంలో చాలా పెద్ద అంతరం ఉన్న రాష్ట్రం ఇది.[9] ఆర్థిక సేవల రంగానికి ఈ రాష్ట్రం పేరుపొందింది. హార్ట్‌ఫోర్డ్ లో ఇన్స్యూరెన్సు కంపెనీలు, ఫెయిర్‌ఫీల్డ్ కౌంటీలో హెడ్జి ఫండ్లూ విస్తరించాయి.


మూలాలు

[మార్చు]
  1. Ohlemacher, Stephen (November 29, 2005). "Highest wages in East, lowest in South". USA Today. Archived from the original on May 25, 2010. Retrieved April 30, 2010.
  2. "Median Household Income". American FactFinder. U.S. Census Bureau. 2013. Archived from the original on 2016-10-25. Retrieved October 25, 2015.
  3. "US slips down development index". BBC News. July 17, 2008. Archived from the original on January 8, 2011.
  4. 4.0 4.1 Table 18, Area Measurements: 2010; and Population and Housing Unit Density: 1990 to 2010 (PDF). United States Summary: 2010, Population and Housing Unit Counts (Report). United States Census Bureau. September 2012. p. 41. Retrieved May 16, 2014.
  5. Table 19, Population by Urban and Rural and Type of Urban Area: 2010 (PDF). United States Summary: 2010, Population and Housing Unit Counts (Report). United States Census Bureau. September 2012. p. 42. Retrieved May 16, 2014.
  6. "Sites, Seals & Symbols". Secretary of the State. State of Connecticut. August 28, 2015. Archived from the original on July 31, 2008. Retrieved October 25, 2015.
  7. "Gross Domestic Product by State, 4th Quarter and Annual 2019" (PDF). Bureau of Economic Analysis, U.S. Department of Commerce. April 7, 2020. Retrieved April 16, 2020.
  8. "State Annual Personal Income, 2019 (Preliminary) and State Quarterly Personal Income, 4th Quarter 2019" (PDF) (Press release). Bureau of Economic Analysis, U.S. Department of Commerce. March 24, 2019. Retrieved April 16, 2020.
  9. Sommeiller, Estelle; Price, Mark (February 19, 2014). The Increasingly Unequal States of America: Income Inequality by State, 1917 to 2011 (Report). The Economic Policy Institute.
"https://te.wikipedia.org/w/index.php?title=కనెటికట్&oldid=3850657" నుండి వెలికితీశారు