కరియా ముండా
కరియా ముండా | |||
![]()
| |||
పదవీ కాలం 8 జూన్ 2009 – 18 మే 2014 | |||
ముందు | చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ | ||
---|---|---|---|
తరువాత | ఎం. తంబిదురై | ||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | సుశీల కెర్కెట్టా | ||
తరువాత | అర్జున్ ముండా | ||
నియోజకవర్గం | ఖుంటి | ||
పదవీ కాలం 1989 – 2004 | |||
ముందు | సైమన్ టిగ్గా | ||
తరువాత | సుశీల కెర్కెట్టా | ||
నియోజకవర్గం | ఖుంటి | ||
పదవీ కాలం 1977 – 1980 | |||
ముందు | నిరల్ ఎనెమ్ హోరో | ||
తరువాత | నిరల్ ఎనెమ్ హోరో | ||
నియోజకవర్గం | ఖుంటి | ||
జార్ఖండ్ శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2005 – 2009 | |||
ముందు | నియోజకవర్గం సృష్టించారు | ||
తరువాత | సావన్ లక్రా | ||
నియోజకవర్గం | ఖిజ్రీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అనిగరా, బీహార్, (ప్రస్తుత జార్ఖండ్), బ్రిటిష్ ఇండియా | 20 ఏప్రిల్ 1936||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి |
సునందా దేవి (m. 1967) | ||
సంతానం | 2 కుమారులు, 3 కుమార్తెలు | ||
నివాసం | అనిగర గ్రామం, ఖుంటి జిల్లా , జార్ఖండ్ | ||
పూర్వ విద్యార్థి | రాంచీ విశ్వవిద్యాలయం | ||
సంతకం | ![]() | ||
పురస్కారాలు | పద్మభూషణ్ 2019 | ||
మూలం | http://loksabhaph.nic.in/Members/MemberBioprofile.aspx?mpsno=259&lastls=16 |
కరియా ముండా (జననం 20 ఏప్రిల్ 1936) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిది సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికై, 15వ లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌గా, భారత ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1]
ఆయన 2019లో దేశ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]కరియా ముండా 1936 ఏప్రిల్ 20న జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా అనిగరా గ్రామంలో జన్మించాడు. ఆయన రాంచీ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కరియా ముండా 1977లో భారతీయ లోక్ దళ్ నుండి ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 1989, 1991, 1996, 1998, 1999, 2009, 2014లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికై 8 జూన్ 2009 నుండి 18 మే 2014 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.
కరియా ముండా 14 ఆగస్టు 1977 నుండి 28 జూలై 1979 వరకు మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో కేంద్ర ఉక్కు & గనుల శాఖ సహాయ మంత్రిగా, అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో 1 సెప్టెంబర్ 2001 నుండి 29 జనవరి 2004 వరకు వ్యవసాయ & గ్రామీణ పరిశ్రమల మంత్రిగా, 29 జనవరి 2003 నుండి 9 జనవరి 2004 వరకు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా, 9 జనవరి 2004 నుండి 22 మే 2004 ఇంధన వనరుల మంత్రిగా పని చేశాడు. ఆయన బీహార్, జార్ఖండ్ శాసనసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. ఆయన 21 సెప్టెంబర్ 2022న పిఎం కేర్స్ ఫండ్ ట్రస్టీగా నామినేట్ అయ్యాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (24 March 2019). "బ్యాక్ టు పెవిలియన్ : 8సార్లు ఎంపీకి టిక్కెట్ ఇవ్వని బీజేపీ" (in Telugu). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ The Hindu (21 September 2022). "Ratan Tata, Justice K.T. Thomas, Kariya Munda appointed trustees of PM CARES Fund". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.