కాండం

వికీపీడియా నుండి
(కాండాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కణుపులు, కణుపు మధ్యమాలు చూపుతున్న కాండం.

మొక్కలో వాయుగతంగా పెరిగే వ్యవస్థను 'ప్రకాండ వ్యవస్థ' (Shoot system) అంటారు. ఇది ప్రథమాక్షం (Plumule) నుంచి ఉద్భవిస్తుంది. ప్రకాండ వ్యవస్థ అక్షాన్ని 'కాండం' (ఆంగ్లం: Stem) అంటారు. పత్రాలు, మొగ్గలు, పుష్పాలు వంటి ఉపాంగాలు కాండం మీద లేదా శాఖల మీద ఉద్భవిస్తాయి.

లక్షణాలు[మార్చు]

  • కాండం ప్రకాండవ్యవస్థలో నిటారుగా పెరిగే అక్షం.
  • కాండం చివరలో ఉండే కొన మొగ్గ (terminal bud) కాండం నిలువు పెరుగుదలను నియంత్రిస్తుంది.
  • కాండం కణుపులు (nodes), కణుపు మధ్యమాలు (internodes) గా విభేదన చెంది ఉంటుంది.
  • కాండం మీద పత్రాలు కణుపుల నుంచి ఏర్పడతాయి. పత్రానికి, కాండానికి మధ్య ఉండే పై కోణాన్ని గ్రీవం (Axil) అంటారు. గ్రీవంలో ఏర్పడే గ్రీవపు మొగ్గలు శాఖలను ఉత్పత్తి చేస్తాయి.
  • సాధారణంగా లేత కాండం ఆకుపచ్చగాను, ముదిరిన కాండం గోధుమవర్ణంలోను ఉంటాయి.

విధులు[మార్చు]

  • కాండం పత్రాలన్నింటికి సూర్యరశ్మి తగిలేటట్లుగా విస్తరింపచేయడంలో సహాయపడుతుంది.
  • పేళ్ళు భూమినుంచి గ్రహించిన నీటిని, లవణాలను పత్రాలకు అందజేయడం, పత్రాలలో తయారైన ఆహారపదార్ధాలను మొక్కలోని ఇతర భాగాలకు అందించడంలో ప్రధానపాత్ర వహిస్తుంది.

కాండాలు-రకాలు[మార్చు]

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
కాండాలు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
బలహీన కాండాలు
 
దృఢకాండాలు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
సాగిలబడే కాండాలు
 
 
 
 
తిరుగుడు తీగెలు
 
 
 
 
 
 
 
 
 
 
సాధారణ కాండాలు
 
 
 
 
 
 
రూపాంతర కాండాలు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
శయనకాండాలు
 
ఉర్విక్ర కాండాలు
 
సవ్యదిశ తిరుగుడు తిగెలు
 
అపసవ్యదిశ తిరుగుడుతిగెలు
 
వృక్షాలు
 
పొదలు
 
గుల్మాలు
 
వాయుగత కాండాలు
 
ఉపవాయుగత కాండాలు
 
భూగర్భకాండాలు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ఏకవార్షిక గుల్మాలు
 
 
 
ద్వైవార్షిక గుల్మాలు
 
 
 
బహువార్షిక గుల్మాలు
 
 
 
 
 
 


కాండం రూపాంతరాలు[మార్చు]

కాండం వాతావరణానికి అనుగుణంగా సాధారణ విధులతో పాటు కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి రూపాంతరం చెందుతుంది. ఇలాంటి శాశ్వతమార్పులను 'కాండ రూపాంతరాలు' అంటారు. ఉనికిని బట్టి కాండం రూపాంతరాలు మూడు రకాలు.[1]

వాయుగత కాండ రూపాంతరాలు[మార్చు]

రింగులు తిరిగిన నులితీగ.
  • నులితీగలు (Tendrils):ఇవి గడియారపు స్పింగు వలె సన్నగా మెలి తిరిగి ఉంటాయి. ఇవి ఎగబ్రాకుటకు సహయపడతాయి. గ్రీవపు మొగ్గలు, శిఖరపు మొగ్గలు నులితీగలుగా మారుతాయి. ఉదా: సిస్ఫస్ (నల్లేరు)
  • ముళ్ళు (Thorns): కొన్ని మొక్కలలో మొగ్గలు పెరుగుదల శక్టిని కోల్పోయి గట్టిపడి సూదివలె మారి ముళ్ళుగా ఏర్పడుతాయి. ఇవి ఎడారి మొక్కలలో ఎక్కువగా కనిపిస్తాయి.ఇవి జంతువుల బారి నుండి రక్షించుకోవటానికి మొక్కకు తోడ్పడుతాయి. గ్రీవపు.. లేదా శిఖరపు మొగ్గలు ముళ్ళుగా మారుతాయి.
  • కొక్కేలు (Hooks):బలహీన కాండాలలో కాండం కొక్కేలుగా మారి మొక్క ఎగబ్రాకడానికి తోడ్పడుతాయి. ఉదా:హ్యూగోనియా
  • పత్రభకాండాలు (Phylloclades): పత్రం వలె రూపాంతరం చెంది, పత్రం విధులను నిర్వర్తించు కాండాలను పత్రాభ కాండాలు అంటారు. ఉదా: నాగజెముడు
  • దుంపవంటి కాండాలు (Tuberous stems): నిల్వ చేయడం అనే ప్రక్రియ వలన కొన్ని కాండాలు ఉబ్బి ఉంటాయి.
  • లఘులశునాలు (Bulbils):గ్రీవపు మొగ్గల నుండి వాయుగతంగా అభివృద్ది చెందే లశునం వంటి నిర్మాణాలు లఘులశునాలు. శాఖీయ ప్రత్యుత్పత్తికి ఉయోగపడతాయి. ఉదా: కిత్తనార

ఉపవాయుగత కాండ రూపాంతరాలు[మార్చు]

కాండం కొంత భాగం భూగతంగాను, మరికొంత భాగం వాయుగతంగానూ ఉంటుంది. ఈ కాండాలు బలహీనంగా ఉంటాయి.కాండం కింది భాగం నుండి అబ్బురపు వేళ్ళు ఏర్పడుతాయి. ఇవి శాఖీయోత్పత్తిలో ఉపయోగపడతాయి. ఇవి నాలుగు రకాలు. అవి...

  • రన్నర్లు (Runners): వీటి ప్రకాండం నేల మీద సాగిలబడి అన్ని వైపుల విస్తరిస్తుంది. ప్రతి కణుపు వద్ద అబ్బురపు వేళ్ళు వృద్ధి చెందుతాయి. ఈ మొక్కల కణుపు నడిమిలు ఏ కారణం చేతనైనా కుళ్ళినా, వేరుపడినా అవి స్వతంత్ర మొక్కలుగా జీవించగలవు.
  • స్టోలన్లు (Stolons): ఈ మొక్కల శాఖలు బలహీనంగా భూమికి దగ్గరగా ఉంటాయి. ఇవి ఎప్పుడైనా భూమికి అంటుకపోయినప్పుడు, ఆ శాఖల అడుగుభాగాన అబ్బురపు వేళ్ళు పుట్టి ఆ శాఖను భూమిలో నాటుతాయి.
  • పిలకమొక్కలు (Suckers): కొన్ని మొక్కలలో కాండం మృత్తికలో ఉండి గ్రీవపు మొగ్గలను, శాఖలను ఏర్పరుస్తాయి. ఈ శాఖలు భూమిలోనే కొంత వరకు విస్తరించి, తర్వాత వాయుగతంగా వృద్ధి చెందుతాయి.
  • ఆఫ్ సెట్లు (Offsets): ఇవి ఒకే కణుపు నడిమి గల బలహీన కాండపు మొక్కలు. శాఖ కొనభాగంలో పైన పత్రాల గుంపు, దిగువన అబ్బురపు వేళ్ళ గుంపు ఉంటాయి. ఈ కాండాలను ఎక్కువగా నీటిమొక్కలలోను, అరుదుగా నేలపై పెరిగే మొక్కలలోనూ చూడవచ్చు.
భూమి పైగాగాన కనిపించే చెట్టులోని మొదటి భాగాన్ని మాను, చెట్టు మొండెం, మ్రాను, మొద్దు, చెట్టు మొదలు అని అంటారు

భూగర్భ కాండ రూపాంతరాలు[మార్చు]

వాయుగత కాండం వలె వీటికి ఆకుపచ్చని సామాన్య పత్రాలు ఉండవు. వేరు వలె భూమిలో ఉండినా, ఈ కాండాలకు కణుపుల వద్ద పొలుసాకులు, మొగ్గలు, బహిర్జాత శాఖలు ఉండటం వలను వీటిని భూగర్భకాండాలుగా పిలుస్తారు. ఇవి ఆహారపు నిల్వకు, శాఖీయోత్పత్తికి, ధీర్ఘకాలికతకు ఈ కాండాలు ఉపకరిస్తాయి. ఇవి నాలుగు రకాలు. అవి...

  • కొమ్ము (Rhizome): ఇది భూమిలో అడ్డంగా పెరుగుతుంది. ఇది కణుపులు, కణుపుమధ్యాలు కలిగి ఉంటుంది. గ్రీవపు మొగ్గలు, శిఖరపు మొగ్గలు ఏర్పడుతాయి. శిఖరపు మొగ్గ మొదటగా ఏర్పడి, భూమిపైకి వాయుగతంగా వృద్ధి చెందుతుంది. కొమ్ము అడుగుభాగాన అబ్బురపు వేళ్ళు ఉంటాయి. ఉదా: అల్లం, పసుపు
  • కందం (Corm): ఇది భూమిలో నిలువుగా పెరిగే భూగర్భకాండం. కణుపులు, కణుపు మధ్యాలు ఉంటాయి. అబ్బురపు వేళ్ళు అన్ని వైపుల వృద్ది చెందుతాయి. శిఖరపు మొగ్గ స్కేవ్ గా, గ్రీవపు మొగ్గలు పిల్ల కందాలుగా అభివృద్ధి చెందుతాయి.
  • దుంప కాండం (Stem Tuber): దీనిపై కణుపులు, సంక్షిప్తమైన పొలుసాకులు, వాటి గ్రీవాలలో చిన్న మొగ్గలు ఉంటాయి. ఈ భాగాన్నే కన్నుగా వ్యవహరిస్తారు. ఉదా: ఆలుగడ్డ
  • లశునం (Bulb):కాండాన్ని ఆవరించి రసవంతమైన పొలుసులతో కూడిన ఆహారపు నిల్వలు ఉంటాయి. ఈ నిర్మాణాలు పొలుసాకులైనా కావొచ్చు లేదా పైభాగంలో కృశించిపోయిన సామాన్య పత్రాల పీఠాలైనా కావొచ్చు. ఆహారపదార్థాలు నిల్వలేని చిన్న బిళ్ల వంటి కాండం నుండి పీచువేళ్ళు గుంపులుగా ఏర్పడతాయి. పొలుసుల గ్రీవాలలో మొగ్గలు ఉంటాయి. పొలుసుల అమరికను బట్టి లశునాలు రెండు రకాలు. అవి...
కంచుకిత లశునం: వీటిలో పొలుసులు ఏకకేంద్రక వలయంగా ఉంటాయి. ఉదా: నీరుల్లి
కంచుకరహిత లశునం: వీటిలో రసవంతమైన పొలుసులు వదులు వదులుగా ఉంటాయి. ఉదా: వెల్లుల్లి

మాను[మార్చు]

The base of a Yellow Birch trunk

మాను (Trunk) అంటే భూమి పైభాగాన, కొమ్మలకు క్రింది భాగాన ఉన్న కనిపించే చెట్టు లేదా వృక్షపు కాండంలోని మొదటి భాగం.[2] మాను పైభాగాన బెరడుతో కప్పబడి వుంటుంది.[3] వృక్షం యొక్క మాను నుండే ప్రధానమైన కలప తయారౌతుంది.

పాటలు[మార్చు]

‍* మాను మాకును కాను రాయీ రప్పను కానే కాను మామూలు మనిషిని నేను

శాఖీభవనం[మార్చు]

మొక్క పెరిగే క్రమంలో కాండం నుండి శాఖలు, శాఖల నుండి ఉపశాఖలు ఏర్పడతాయి. ప్రకాండంపై శాఖలు అమరి ఉండు విధానమే శాఖీభవనం. ఇది ప్రధానంగా రెండు రకాలు. అవి 1. ద్విభాజీ శాఖీభవనం, 2. పార్శ్వ శాఖీభవనం

ద్విభాజీ శాఖీభవనం[మార్చు]

కాండం అగ్రకణాలు రెండు సమభాగాలు విభజన చెంది, ఆ కణ సమూహం రెండు శాఖలుగా వృద్ధి చెందుతాయి. దీని వలన '' V '' ఆకారంలో ఉండే రెండు శాఖలు ఏర్పడుతాయి.

పార్శ్వ శాఖీభవనం[మార్చు]

మొక్క అక్షానికి పార్శ్వంగా ఉండే గ్రీవపు మొగ్గలు ఈ శాఖీభవనంలొ పాత్రవహిస్తాయి. ఇది అనిశ్చిత శాఖీభవనం, నిశ్చిత శాఖీభవనం అని రెండు రకాలు.

అనిశ్చిత శాఖీభవనం[మార్చు]

దీనిని మధ్యాభిసార లేదా ఏకపద శాఖీభవనం అని కూడా అంటారు. ఈ మొక్కలు శంఖ్వాకారంలో ఉంటాయి.

నిశ్చిత శాఖీభవనం[మార్చు]

ఈ రకమైన శాఖీభవనంలో కొన మొగ్గ శాఖల పెరుగుదలకు కొంత కాలం దొహదం చేసిన పిదప ఒక నిశ్చితాంగంగా రూపాంతరం చెందుతుంది. అంటే ముల్లుగానో, పుష్పంగానో , నులితీగగానో రూపాంతరం చెందుతుంది. ఈ శాఖీభవనం మూడు (3) రకాలుగా కనిపిస్తుంది. అవి...i). నిశ్చిత బహుశాఖీయ శాఖీభవనం, ii. నిశ్చిత ద్విశాఖీయ శాఖీభవనం, iii. నిశ్చిత ఏకశాఖీయ శాఖీభవనం.

i). నిశ్చిత బహుశాఖీయ శాఖీభవనం[మార్చు]

కొనమొగ్గ రూపాంతరం చెందిన తరువాత మూడు గ్రీవపు మొగ్గల నుండి శాఖోత్పత్తి జరుగుతుంది. ఉదా: నీరియం ([[గన్నెరు]])

ii. నిశ్చిత ద్విశాఖీయ శాఖీభవనం[మార్చు]

కొనమొగ్గ రూపాంతరం చెందిన తరువాత దాని కింద గల రెండు పత్రగ్రీవాల నుండి రెండు శాఖలు ఏర్పడుతాయి. ఉదా: దతూర (ఉమ్మెత్త).

iii. నిశ్చిత ఏకశాఖీయ శాఖీభవనం[మార్చు]

కొనమొగ్గ నిశ్చితాంగంగా అంతమైన తరువాత కింద ఉన్న ఏకాంతర పత్రగ్రీవం నుండి మొగ్గ పెరుగుదలను కొనసాగిస్తుంది. దీనివలన కొన మొగ్గ రూపాంతరాలు పత్రాభిముఖంగా ఉంటాయి. ఇది రెండు రకాలు. అవి. 1. నిశ్చిత ఏకశాఖీయ కుండలాకార శాఖీభవనం, 2. నిశ్చిత ఏకశాఖీయ వృశ్చికాకార శాఖీభనం.

1. నిశ్చిత ఏకశాఖీయ కుండలాకార శాఖీభవనం: కొనమొగ్గ రూపాంతరం చెందిన తరువాత ఏర్పడే శాఖలన్ని క్రమంగా ఒకే వైపునే వృద్ధి చెందుతాయి. ఉదా: టెర్మినేలియా కెటప్పా (బాదం).

2. నిశ్చిత ఏకశాఖీయ వృశ్చికాకార శాఖీభనం: కొనమొగ్గ రూపాంతరం చెందిన తరువాత ఏర్పడే శాఖలన్ని ఏకాంతర దిశలో ఏర్పడుతాయి. ఉదా: గాసిపియం (పత్తి).


మూలాలు[మార్చు]

  1. "కాండ రూపాంతరాలు". Archived from the original on 2020-08-15. Retrieved 2020-05-07.
  2. "trunk". thefreedictionary.com/: The Free Online Dictionary. Retrieved 2011-04-30. The main woody axis of a tree.
  3. "trunk". thefreedictionary.com/: The Free Online Dictionary. Retrieved 2011-04-30. The tough outer covering of the woody stems and roots of trees, shrubs, and other woody plants. It includes all tissues outside the vascular cambium.
"https://te.wikipedia.org/w/index.php?title=కాండం&oldid=3852545" నుండి వెలికితీశారు