కాటేపల్లి జనార్థన్ రెడ్డి
కాటేపల్లి జనార్థన్ రెడ్డి | |||
| |||
ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 మార్చి 30 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మహబూబ్ నగర్, తెలంగాణ | 1960 మార్చి 10||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | రాంరెడ్డి, కిష్టమ్మ | ||
జీవిత భాగస్వామి | ధనశోభ | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె |
కాటేపల్లి జనార్థన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యుడు.[1]
జీవిత విషయాలు
[మార్చు]జనార్థన్ రెడ్డి 1960, మార్చి 10న రాంరెడ్డి, కిష్టమ్మ దంపతులకు మహబూబ్ నగర్లో జన్మించాడు. బిఎస్సీ చదివిన జనార్థన్ రెడ్డి 1982-1983 లో హైదరాబాదు, మాసబ్ ట్యాంక్ లోని కంప్రెహెన్సీవ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బిఎడ్ పూర్తిచేశాడు. వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందాడు.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]జనార్థన్ రెడ్డికి ధనశోభతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.
రాజకీయ విశేషాలు
[మార్చు]మండల కార్యకర్తగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన జనార్థన్ రెడ్డి, ఆ తరువాత పిఆర్‌టియు యూనియన్‌లో సభ్యుడిగా చేరాడు. పిఆర్‌టియు యూనియన్ ప్రధాన కార్యదర్శి కొంతకాలం పనిచేసి, 2000-2010 వరకు పిఆర్‌టియు యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. టి. హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మద్దతుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా గెలుపొంది మార్చి 30 నుండి 2014 జూన్ 1 వరకు పనిచేశాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 జూన్ 2 నుండి 2017 మార్చి 29 వరకు తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.
కాటేపల్లి జనార్దన్‌రెడ్డి 2017, మార్చి 30న జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు.[3][4]
ఇతర వివరాలు
[మార్చు]కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మాల్దీవులు, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం మొదలైన దేశాలలో పర్యటించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Katepally Janardhan Reddy | MLC | Mahabubnagar | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-30. Retrieved 2021-08-06.
- ↑ admin (2020-09-25). "Telangana Teachers MLC Katepally Janardhan Reddy". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-08-06. Retrieved 2021-08-06.
- ↑ Sakshi (23 March 2017). "టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి". Sakshi. Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.
- ↑ Sakshi (31 March 2017). "నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.