Jump to content

కుల్‌దీప్ యాదవ్

వికీపీడియా నుండి
కుల్‌దీప్ యాదవ్
2014 లో కుల్దీప్ యాదవ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1994-12-14) 1994 డిసెంబరు 14 (వయసు 30)
కన్పూర్, ఉత్తర ప్రదేశ్
ఎత్తు5 అ. 6 అం. (168 cమీ.)[1]
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుLeft-arm unorthodox spin
పాత్రbowler
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 288)2017 మార్చి 25 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2022 డిసెంబరు 14 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 217)2017 జూన్ 23 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2023 జూలై 29 - వెస్టిండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.23
తొలి T20I (క్యాప్ 69)2017 జూలై 9 - వెస్టిండీస్ తో
చివరి T20I2023 ఆగస్టు 13 - వెస్టిండీస్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.23
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012ముంబై ఇండియన్స్
2014–2021కోల్‌కతా నైట్‌రైడర్స్ (స్క్వాడ్ నం. 23)
2009–presentఉత్తర ప్రదేశ్ (స్క్వాడ్ నం. 3)
2022-presentఢిల్లీ క్యాపిటల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లి ఎ
మ్యాచ్‌లు 8 81 35 94
చేసిన పరుగులు 94 156 914 210
బ్యాటింగు సగటు 10.44 11.14 22.85 11.05
100లు/50లు 0/0 0/0 1/6 0/0
అత్యుత్తమ స్కోరు 40 19 117 25
వేసిన బంతులు 1165 4234 6670 4894
వికెట్లు 34 134 134 155
బౌలింగు సగటు 21.55 27.48 29.76 26.85
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 1 7 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/40 6/25 6/79 6/25
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 12/– 14/– 14/–
మూలం: ESPNcricinfo, 25 March 2023
Kuldeep Yadav
Kuldeep Yadav in 2014
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1994-12-14) 1994 డిసెంబరు 14 (వయసు 30)
Kanpur, ఉత్తర ప్రదేశ్, India
ఎత్తు5 అ. 6 అం. (168 cమీ.)[2]
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుLeft-arm unorthodox spin
పాత్రbowler
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 288)2017 మార్చి 25 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2022 డిసెంబరు 14 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 217)2017 జూన్ 23 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2023 జూలై 29 - వెస్టిండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.23
తొలి T20I (క్యాప్ 69)2017 జూలై 9 - వెస్టిండీస్ తో
చివరి T20I2023 ఆగస్టు 13 - వెస్టిండీస్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.23
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012ముంబై ఇండియన్స్
2014–2021కోల్‌కతా నైట్‌రైడర్స్ (స్క్వాడ్ నం. 23)
2009–presentఉత్తర ప్రదేశ్ (స్క్వాడ్ నం. 3)
2022-presentఢిల్లీ క్యాపిటల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లి ఎ
మ్యాచ్‌లు 8 81 35 94
చేసిన పరుగులు 94 156 914 210
బ్యాటింగు సగటు 10.44 11.14 22.85 11.05
100లు/50లు 0/0 0/0 1/6 0/0
అత్యుత్తమ స్కోరు 40 19 117 25
వేసిన బంతులు 1165 4234 6670 4894
వికెట్లు 34 134 134 155
బౌలింగు సగటు 21.55 27.48 29.76 26.85
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 1 7 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/40 6/25 6/79 6/25
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 12/– 14/– 14/–
మూలం: ESPNcricinfo, 25 March 2023

కుల్‌దీప్ యాదవ్ (జననం 1994 డిసెంబరు 14) భారతీయ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. అతను బౌలరు ఆల్-రౌండరు, లెఫ్ట్ ఆర్మ్ అన్‌ఆర్థడాక్స్ స్పిన్ బౌలరు. భారతదేశం తరఫున, దేశీయ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడే సమర్ధుడైన లోయర్ ఆర్డర్ బ్యాటర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అతను సంతకం చేసాడు. [3] అతను భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఆడాడు. 2014 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడాడు. [4] 2019 డిసెంబరు 18 న, వెస్టిండీస్‌పై హ్యాట్రిక్‌ సాధించి, భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు. [5] 2020 జనవరి 17 న, ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ వన్‌డేలో యాదవ్, తన 58వ ఇన్నింగ్స్‌లో వన్‌డే క్రికెట్‌లో 100 వికెట్లు తీసి, ఇన్నింగ్స్ సంఖ్య పరంగా భారతదేశం తరపున అత్యంత వేగంగా ఆ రికార్డు చేరిన స్పిన్ బౌలరు అయ్యాడు. [6] టోర్నమెంట్‌లో రషీద్ ఖాన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లతో పాటు 10 వికెట్లు పడగొట్టి, భారతదేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

దేశీయ కెరీర్

[మార్చు]

యాదవ్, ఉత్తరప్రదేశ్‌ లోని ఉన్నావ్‌లో ఇటుక బట్టీ యజమానికి జన్మించాడు. కాన్పూర్‌లో పెరిగాడు. ఒక ఇంటర్వ్యూలో, తాను క్రికెట్ ఆడటం కొనసాగించాలని తండ్రి కోరుకున్నాడని కోచ్ కపిల్ పాండే వద్దకు తీసుకువెళ్లాడనీ వెల్లడించాడు. బౌలింగ్ గ్రేట్స్ వసీం అక్రమ్, జహీర్ ఖాన్ నుండి ప్రేరణ పొంది, అతను లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావాలనుకున్నాడు. అయితే, చిన్నపాటి శరీరాకారాన్ని బట్టీ, ట్రయల్స్‌లో యాదవ్ చూపిన టర్న్, వైవిధ్యాలతో ఆకట్టుకున్నందున కోచ్ అతను మణికట్టు-స్పిన్ బౌలర్‌గా ఎదగాలని పట్టుబట్టాడు. అప్పటి నుండి, అతను షేన్ వార్న్ బౌలింగు వీడియోలను చూడటం ప్రారంభించాడు అతనిని తన రోల్ మోడల్‌గా చేసుకున్నాడు.

ఉత్తరప్రదేశ్ అండర్-15 జట్టులో ఎంపిక కానప్పుడు క్రికెట్‌ను వదిలేసి, ఆత్మహత్య చేసుకోవాలని భావించిన చీకటి దశ ఒకటి తన జీవితంలో ఉందని యాదవ్ వెల్లడించాడు. [7] [8] [9]

2012లో యాదవ్, ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడయ్యాడు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చేరాడు. 2014 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

2018 జనవరిలో, 2018 IPL వేలంలో యాదవ్‌ను KKR తిరిగి కొనుగోలు చేసింది. [10] 2022 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని కొనుగోలు చేసింది. [11]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

యాదవ్ 2014 అక్టోబరులో వెస్టిండీస్‌తో ఆడేందుకు భారత క్రికెట్ జట్టులో ఎంపికయ్యాడు కానీ ఏ మ్యాచ్‌లోనూ కనిపించలేదు. [12] 2017 ఫిబ్రవరిలో, బంగ్లాదేశ్‌తో జరిగిన ఒక మ్యాచ్ కోసం అతన్ని భారత టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు.[13] 2017 మార్చి 25 న ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.[14] టెస్టు క్రికెట్‌లో భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మొదటి ఎడమచేతి మణికట్టు స్పిన్ బౌలర్ యాదవ్. టెస్టు క్రికెట్‌లో అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు తీసిన మూడో ఎడమచేతి మణికట్టు స్పిన్ బౌలర్‌గా కూడా అతను నిలిచాడు.

2017 జూన్‌లో, వెస్టిండీస్‌కు పరిమిత ఓవర్ల పర్యటన కోసం యాదవ్ భారత జట్టులో ఎంపికయ్యాడు. [15] 2017 జూన్ 23 న వెస్టిండీస్‌పై భారతదేశం తరపున తన తొలి వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.[16] అయితే, ఈ గేమ్‌లో, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వర్షం కారణంగా ఆట ఫలితం లేకుండా ముగిసింది. అతనికి బౌలింగు చేసే అవకాశం రాలేదు. సిరీస్‌లోని తదుపరి మ్యాచ్‌లో బౌలింగ్ చేసి, మూడు వికెట్లు పడగొట్టాడు. [17] 2017 జూలై 9 న వెస్టిండీస్‌పై భారతదేశం తరపున తన తొలి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్ (టి20I) ఆడాడు.[18]


2017 సెప్టెంబరు 21 న యాదవ్, చేతన్ శర్మ, కపిల్ దేవ్‌ల తర్వాత వన్‌డే లో హ్యాట్రిక్ సాధించిన మూడవ భారత బౌలరయ్యాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాపై ఈ హ్యాట్రిక్ సాధించాడు. [19] [20]

2018 జూలై 3 న యాదవ్, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టి20Iలో తన మొదటి ఐదు వికెట్ల పంట సాధించాడు. టి20Iలో ఐదు వికెట్లు తీసిన మొదటి ఎడమ చేతి మణికట్టు-స్పిన్ బౌలరతడు. యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ తర్వాత టి20Iలో ఐదు వికెట్లు తీసిన మూడవ భారతీయ బౌలరతడు.[21] [22]

2018 జూలై 12 న, ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్‌డేలో యాదవ్, వన్‌డేల్లో తన తొలి ఐదు వికెట్ల పంట సాధించాడు. ఆ మ్యాచ్‌లో అతని 6/25, వన్‌డేలో ఎడమచేతి వాటం స్పిన్ బౌలరు సాధించిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. [23]వన్‌డేలలో ఇంగ్లండ్‌పై అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ గణాంకాలకు షాహిద్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్‌లో వన్‌డేలో అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ గణాంకాల ఆఫ్రిది రికార్డును కూడా బద్దలు కొట్టాడు. [24] [25]

2018 అక్టోబరు 6 న, వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో యాదవ్, టెస్ట్‌లలో తన మొదటి ఐదు వికెట్ల పంటను సాధించాడు. [26]

2018/19 లో భారత్ పర్యటించిన ఆస్ట్రేలియాతో జరిగిన టి20I సిరీస్‌లో ఆకట్టుకునే ఆట తర్వాత, 2018 నవంబరు 26 న MRF ICC టి20I బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ 20 స్థానాలు ఎగబాకి,[27] తన కెరీర్లో అత్యున్నతమైన మూడవ స్థానాన్ని పొందాడు.

2019 ఫిబ్రవరి 11 న యాదవ్, టి20I బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానానికి చేరుకున్నాడు. [28] 2019 ఏప్రిల్‌లో అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు. [29] [30] 2019 జూన్ 30 న, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, కుల్దీప్ తన 50వ వన్‌డేలో ఆడాడు. [31] 2019 డిసెంబరు 18 న, వెస్టిండీస్‌పై వన్‌డే మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించి, వన్డేల్లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. [32]


మూలాలు

[మార్చు]
  1. Kuldeep Yadav's profile on Sportskeeda
  2. Kuldeep Yadav's profile on Sportskeeda
  3. "Kuldeep Yadav reflects on his need to perform consistently for Kolkata Knight Riders ahead of IPL 2021". India Today (in ఇంగ్లీష్). January 31, 2021. Retrieved 2021-08-29.
  4. "Kuldeep Yadav biography". Sportskeeda. Retrieved 12 February 2019.
  5. "Stats - Rohit Sharma second only to Sachin Tendulkar". ESPN Cricinfo. Retrieved 18 December 2019.
  6. "India vs Australia: Kuldeep Yadav Becomes Fastest Indian Spinner to Get 100 ODI Wickets". Network18 Media and Investments Ltd. Retrieved 17 January 2020.
  7. "Kuldeep wanted to become a pacer, says his coach Kapil Dev Pandey". xtratime.in. 25 March 2017.
  8. "Kuldeep wanted to be an Akram; nothing doing said coach Kapil Pandey". Mid Day. 26 March 2017.
  9. "When a young Kuldeep Yadav thought of suicide after cricket selection snub". HindustanTimes. 12 November 2017.
  10. "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 27 January 2018.
  11. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 13 February 2022.
  12. "Kuldeep Yadav selected in India's squad for West Indies ODIs". Cricbuzz. Retrieved 26 August 2016.
  13. "Kuldeep Yadav replaces injured Mishra". ESPN Cricinfo. Retrieved 7 February 2017.
  14. "Australia tour of India, 4th Test: India v Australia at Dharamsala, Mar 25-29, 2017". ESPN Cricinfo. Retrieved 25 March 2017.
  15. "Pant, Kuldeep picked for West Indies tour". ESPN Cricinfo. Retrieved 15 June 2017.
  16. "India tour of West Indies, 1st ODI: West Indies v India at Port of Spain, Jun 23, 2017". ESPN Cricinfo. Retrieved 23 June 2017.
  17. "India tour of West Indies, 2nd ODI: West Indies v India at Port of Spain, Jun 25, 2017". ESPN Cricinfo. Retrieved 28 June 2017.
  18. "Only T20I, India tour of West Indies at Kingston, Jul 9 2017 | Match Summary | ESPNCricinfo". ESPNcricinfo. Retrieved 10 July 2018.
  19. "2nd ODI (D/N), Australia tour of India at Kolkata, Sep 21 2017". ESPNcricinfo. Retrieved 21 September 2017.
  20. "Kuldeep Yadav becomes third Indian bowler to pick up an ODI hat-trick". The Indian Express. 21 September 2017. Retrieved 21 September 2017.
  21. "Kuldeep Yadav's hunger for wickets impresses Mohinder Amarnath - Times of India". The Times of India. Retrieved 6 July 2018.
  22. "Brilliant Kuldeep and KL Rahul give India a perfect start". ESPNcricinfo. Retrieved 13 July 2018.
  23. "Kuldeep scales new record for left-arm wristspin". ESPNcricinfo. Retrieved 13 July 2018.
  24. "India vs England 1st ODI: Records galore for Kuldeep Yadav - Times of India". The Times of India. Retrieved 13 July 2018.
  25. "England v India: Record-breaking Kuldeep Yadav bamboozles hosts". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2018-07-12. Archived from the original on 2018-07-17. Retrieved 13 July 2018.
  26. "Kuldeep Yadav spins a web around West Indies to grab maiden 5-wicket haul in Tests". India Today. Retrieved 6 October 2018.
  27. "Yadav and Zampa break into top-five among T20I bowlers". ICC. Retrieved 26 November 2018.
  28. "Kuldeep moves to 2nd place". ESPNcricinfo. Retrieved 2019-02-11.
  29. "Rahul and Karthik in, Pant and Rayudu out of India's World Cup squad". ESPN Cricinfo. Retrieved 15 April 2019.
  30. "Dinesh Karthik, Vijay Shankar in India's World Cup squad". International Cricket Council. Retrieved 15 April 2019.
  31. "ICC Cricket World Cup 2019 (Match 38): England vs India – Stats Preview". Cricket Addictor. 29 June 2019. Retrieved 30 June 2019.
  32. "India vs West Indies: Kuldeep Yadav becomes first Indian to take 2nd international hat-trick". Times of India. Retrieved 18 December 2019.