Jump to content

కె.వేద

వికీపీడియా నుండి
కె.వేద
జననం
జాతీయతభారతీయుడు
వృత్తిసంగీత దర్శకుడు

కె.వేద, తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్, కీబోర్డు ప్లేయర్. టెలివిజన్, డాక్యుమెంటరీలు, రేడియో జింగిల్స్, షార్ట్ ఫిల్మ్స్ మ్యూజిక్ స్కోర్‌లు చేసిన తరువాత సినీ దర్శకుడు దశరధ్ దర్శకత్వంలో మంచు మనోజ్, రెజీనా నటించిన “శౌర్య” సినిమాతో సంగీత దర్శకుడిగా ఆరంగ్రేటం చేశారు.[1][2] తెలంగాణ ప్రభుత్వం కోసం ప్రతిష్టాత్మక కృష్ణా-పుష్కరాలు పాటకు సంగీతం సమకూర్చారు.

జీవిత విషయాలు

[మార్చు]

వేద తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంలో జన్మించాడు. వీరి పెద్దన్నయ్య దశరధ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కాగా, రెండో అన్నయ్య నళిని కాంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

చదువు

[మార్చు]

వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ సైన్స్, కరైకుడిలోని అలగప్ప విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ పూర్తిచేశారు. యుకెలోని రాయల్ స్కూల్స్ ఆఫ్ మ్యూజిక్ లండన్ అసోసియేటెడ్ బోర్డ్ నుండి గ్రేడ్‌లు పొందారు. గంధర్వ మహావిద్యాలయంలో మాన్వాడే గురువు వద్ద హిందుస్తానీ హార్మోనియం నేర్చుకున్నారు. కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు.[3]

సంగీత దర్శకుడిగా

[మార్చు]

సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతోద్యోగం చేసిన వేద, సంగీతంపై ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలేసి సినీరంగంలోకి అడుగుపెట్టారు. తొలుత టీవీ సీరియళ్ళకు, వాణిజ్య ప్రకటనలకు సంగీతాన్నందించారు. అనంతరం చక్రి దగ్గర కొన్నాళ్లపాటు కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా పనిచేశారు. అనూప్ రూబెన్స్ వంటి ఇతర సంగీత దర్శకులు దగ్గర పియానో, కీబోర్డ్, ఆర్గాన్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించడంలో ప్రావీణ్యం సంపాందించారు.[4] వేట, లవ్ డాట్ కామ్, D/O వర్మ, మనుషులతో జాగ్రత్త, నాని బుజ్జి బంగారం, ఎంతచూసిన నువ్వే వంటి సినిమాలకు సంగీత విభాగంలో పనిచేశారు.

సినిమాలు

[మార్చు]
  1. లవ్ యూ రామ్[5][6]
  2. శౌర్య (2016)[7]
  3. నా లవ్ స్టోరీ (2017)[8]

పురస్కారాలు

[మార్చు]
  1. 1994లో కామేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో 10వ తరగతి చదువుతున్నపుడు ఎస్.హెచ్.క్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణ భారతదేశ ప్రాంతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి, ఖమ్మం జిల్లా ప్రతినిధిగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతులమీదుగా రాష్ట్రపతి స్కౌట్స్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.[9]
  2. దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్‌ సందర్భంగా 2022 డిసెంబరు 10న ఎల్.బి. స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్‌ కు సంబంధించిన అఫీషియల్ సాంగ్ స్వరపరచినందుకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతులమీదుగా ప్రత్యేక మెమోంటోను అందుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Shourya review: Ensures good thrills". The Hindu. 2016-03-04. ISSN 0971-751X. Retrieved 2023-02-08.
  2. kavirayani, suresh (2015-12-18). "Shourya's digital poster launched". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2023-02-08.
  3. 2016 మార్చి 3వ తేదీన ఆంధ్రజ్యోతి-చిత్రజ్యోతి పేపర్లో వచ్చిన ''సంగీతంలో నేటివిటీ ఉండాలి: కె.వేద'' అనే న్యూస్ నుండి
  4. "అలా మొదలైంది!". Sakshi. 2016-02-22. Retrieved 2023-02-08.
  5. "Director Dasaradh's latest titled Love You Ram". Telugu Cinema. Retrieved 2023-02-08.
  6. "Harish Shankar unveils the teaser of Love You Ram". 123telugu.com (in ఇంగ్లీష్). 2022-12-09. Retrieved 2023-02-08.
  7. "Shourya review. Shourya Telugu movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 2023-02-08.
  8. "Naa Love Story music launch - idlebrain.com news". www.idlebrain.com. Retrieved 2023-02-08.
  9. 1994 డిసెంబరు 8న ఖమ్మం జిల్లా ఈనాడు పేపర్లో వచ్చిన ''కామేపల్లి విద్యార్థికి రాష్ట్రపతి అవార్డు'' అనే న్యూస్ నుండి

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కె.వేద&oldid=3838152" నుండి వెలికితీశారు