కె. నవీన్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. నవీన్ రావు

ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 జూన్ 2019 నుండి 29 మార్చ్ 2023
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 15 మే 1978
కూకట్‌పల్లి, హైదరాబాద్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కుర్మయ్యగారి కొండల్ రావు, తిలోత్తమ
నివాసం కూకట్‌పల్లి , హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త
మతం హిందూ

కుర్మయ్యగారి నవీన్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కె. నవీన్ కుమార్ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ కూకట్‌పల్లిలో 1978, మే 15l కుర్మయ్యగారి కొండల్ రావు, తిలోత్తమ దంపతులకు జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కె. నవీన్ రావు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉన్నాడు. ఆయన 2016లో జరిగిన హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. కె. నవీన్ రావు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా అవకాశం కోసం అడిగాడు. అప్పుడు ఆయనకు అవకాశం దక్కలేదు. 2018లో తెలంగాణ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ రావును టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించాడు.[2] ఆయన 2019 జూన్ 7లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[3] ఆయన శాసనమండలి సభ్యుడిగా 2019, జూన్ 19న ప్రమాణస్వీకారం చేశాడు.

తెలంగాణ శాసనమండలికి 2023 మార్చిలో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పేరును మార్చి 7న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా[4] ఆయన 9న నామినేషన్ దాఖలు చేశాడు.[5] 16 మార్చి నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగియడంతో బరిలో ఎవరు లేకపోడడంతో నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించి ఆయనకు ధ్రువీకరణ పత్రాలు అందజేశాడు.[6]

ఆయన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (1 June 2019). "98 per cent polling in Telangana MLC by-elections". The New Indian Express. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.
  2. The Hindu (28 May 2019). "TRS picks Naveen Rao for MLC by-poll in MLAs' quota". The Hindu (in Indian English). Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.
  3. Sakshi (1 June 2019). "ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నవీన్‌". Sakshi. Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.
  4. Sakshi (8 March 2023). "ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు వీరే". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
  5. Andhra Jyothy (9 March 2023). "శాసన మండలికి ఎమ్మెల్యే కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
  6. Andhra Jyothy (17 March 2023). "ముగ్గురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవం". Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  7. Eenadu (6 April 2024). "పార్లమెంటు నియోజకవర్గాల్లో భారాస సమన్వయకర్తల నియామకం". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.