గంగుబుడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగుబుడి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం లక్కవరపుకోట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,396
 - పురుషులు 734
 - స్త్రీలు 662
 - గృహాల సంఖ్య 337
పిన్ కోడ్ 535 161
ఎస్.టి.డి కోడ్

గంగుబూడి, విజయనగరం జిల్లా, లక్కవరపుకోట మండలానికి చెందిన గ్రామము. [1]

ప్రస్తుతం doddi rambabu ఈ వూరి సర్పంచ్. ఈ వూరిలో మంచాలపట్టినేసే కార్మికులూ, వారికొక సహకార సంఘం ఉన్నాయి. ఈ వూరిలో పద్మశాలీలు, యాదవులు, అయ్యరక పాత్రుల్లు ఎక్కువ. ఈ వూరి నుండి శ్రీరంపురానికి, tamarapalli ki దారి ఉంటుంది. గంగుబూడి కొత్తవలస పోస్ట్ ఆఫీసు కిందకు వచ్చే గ్రామం.ఈ ఊరిలో ఒక కొండ ఉంది.ఆ కొండ పేరు "నంది కొండ". ఆ కొండ మీద శ్రీ సీతారముల వారి గుడి ఉంది.ఈ గుడి చుట్టు పక్కల ఊరులలో పేరు గాంచింది.ప్రతి యేటా ఈ ఊరిలో ఆ గుడి పేరుమీద భీష్మ ఏకాదశి రోజున ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఊరిలో ఒక ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉన్నాయి.చుట్టు పక్కల ఊరులవారు కూడా ఇక్కడ ఉన్న ఉన్నత పాఠశాలలో చదువుకుంటారు.ఈ ఉన్నత పాఠశాలను ప్రభుత్వం " సక్సెస్ స్కూల్ "గా గుర్తించింది. ఈ ఊరిలో ఒక ప్రైవైట్ పాఠశాల కూడా ఉంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1, 396 - పురుషుల సంఖ్య 734 - స్త్రీల సంఖ్య 662 - గృహాల సంఖ్య 337

మూలాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=గంగుబుడి&oldid=2732304" నుండి వెలికితీశారు