Jump to content

గంగూబాయి హనగల్

వికీపీడియా నుండి
గంగూబాయి హంగల్
1930లలో తన కూతురు కృష్ణతో గంగూబాయి హంగల్
వ్యక్తిగత సమాచారం
జననం(1913-03-05)1913 మార్చి 5 [1][2]
హంగల్, కర్ణాటక, భారత దేశము[3]
మూలంధార్వాడ్, కర్ణాటక, భారత దేశము[1][2]
మరణం2009 జూలై 21(2009-07-21) (వయసు 96)
హుబ్లీ, కర్ణాటక, భారత దేశము[2]
సంగీత శైలిహిందుస్తానీ శాస్త్రీయ సంగీతం
వృత్తిగాయని
క్రియాశీల కాలం1931–2006[4]

గంగూబాయి హనగల్ (5 మార్చి 1913 - 21 జూలై 2009) కిరాణా ఘరానాకు చెందిన హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు.ఈమెను అందరూ "లేడీ ఆఫ్ ఖయాల్" అని పిలుస్తారు. ఖయాల్ సంగీతం చాలావరకు పురుషులకే పరిమితమైనదని భావిస్తారు. అలాంటి పురుషాధిక్య ప్రపంచంలోకి అడుగు పెట్టిన గంగూబాయి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం, "లేడీ ఆఫ్ ఖయాల్" అనిపించుకోవడం అంటే చాలా గొప్పవిషయమే. పడవ నడిపే వారి కులములో జన్మించిన గంగూబాయి కులవివక్షను, లింగవివక్షను సమర్థంగా ఎదుర్కొని సంగీత ప్రపంచంలో ఎనలేని పేరు సంపాదించింది. మగవారికి దీటుగా ఉన్న గాత్రం ఈవిడ విలక్షణత. ఈవిడ కర్ణాటకలోని ధార్వాడలో జన్మించింది. ఈమె తల్లి కూడా గాయకురాలే[5].

విశేషాలు

[మార్చు]

ఈమె చిన్ననాటనే తల్లి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టింది. గంగూబాయికి కర్ణాటక సంగీతం మీదకన్నా హిందుస్తానీ సంగీతం మీద ఆసక్తి ఎక్కువ ఉండేది. అందువల్ల గ్రాంఫోన్లు అమ్మే దుకాణాల నుండి వినిపించే మరాఠీపాటలు, హిందుస్తానీ సంగీతం వింటుండేది. కూతురు ఆసక్తిని, అభిరుచిని అర్థం చేసుకున్న తల్లి అంబాబాయి ఆమెను కృష్ణాచార్య హల్గూరు దగ్గర హిందుస్తానీ సంగీతం నేర్చుకోవడానికి పంపింది. ఆ సమయంలోనే రెండేళ్ళు కథక్ నృత్యం కూడా అభ్యసించింది. అయితే నృత్యాభ్యాసంతో సంగీత సాధన కుంటుపడుతుందనే భయంతో నాట్యాన్ని వదులుకుంది. తన 16వ యేట సవాయి గంధర్వ వద్ద సంగీత అభ్యాసం మొదలుపెట్టింది. మూడేళ్లపాటు కొనసాగిన ఈ శిక్షణకు గాను ఆమె గురుదక్షిణగా 20 తులాల బంగారం సమర్పించుకుంది[5].

ఈమె తొలిప్రదర్శన బెల్గాంలో జరిగింది. కాంగ్రెస్ సభలలో ఈమె పాడినప్పుడు ఆ సభకు మహాత్మాగాంధీ కూడా హాజరయ్యాడు. ఈమె స్వరంలో స్త్రీత్వం కన్నా పురుషత్వమే ఎక్కువ కనిపిస్తుంది.

భారత ప్రభుత్వం ఈమెను పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది[5].

ఈవిడ మరణానంతరం తన నేత్రదానానికై ఆదేశించింది.

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Pawar, Yogesh (April 21, 1999). "Classic revisited". Indian Express. Archived from the original on 2009-07-25. Retrieved 2009-07-21.
  2. 2.0 2.1 2.2 "Veteran Indian singer Gangubai Hangal dies". Associated Press. Google News. 2009-07-21. Archived from the original on 2009-08-08. Retrieved 2009-07-21.
  3. ABC of English. Government of Karnataka. p. 57.
  4. "Gangubai's concert of life ends". The Hindu. 2009-07-21. Archived from the original on 2009-07-24. Retrieved 2009-07-21.
  5. 5.0 5.1 5.2 ఆదెళ్ళ, శివకుమార్ (15 October 2001). "హిందుస్తానీ సంగీతం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (2): 19. Retrieved 19 March 2018.
  6. "SNA: List of Akademi Awardees — Music — Vocal". సంగీత నాటక అకాడమీ. Archived from the original on 2016-02-01. Retrieved 2009-07-21.
  7. "SNA: List of Akademi Fellows". Sangeet Natak Akademi. Archived from the original on 2011-07-27. Retrieved 2009-07-21.

ఇతర లింకులు

[మార్చు]