Jump to content

కులం

వికీపీడియా నుండి
(కులము నుండి దారిమార్పు చెందింది)

భారతదేశంలోని ఉత్తరప్రదేశు రాష్ట్రంలో షెడ్యూలుకులానికి చెందిన మేదరి కులస్థుడు బుట్టలు అల్లుతున్న దృశ్యం (1916 పుస్తకంలో)

కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి ఆర్యులు రూపొందించిన ఒక వ్యవస్థ. తమలో తాము వివాహాలు చేసుకుంటూ, ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు. వృత్తి, ఆచారాలు, సామాజిక స్థాయి వంటి అనేకాంశాలు కులాల్లో పరంపరాగతంగా కొనసాగేవి. వంశపారంపర్యంగా పాటించబడే ఒక సామాజిక ఆచారం. సాధారణంగా కులం వృత్తులు, కులవివాహాలు, సంస్కృతి, సామాజిక స్థాయి, రాజకీయాలపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది.[1][2] యునిసెఫ్ అధ్యయనాల ప్రకారం కులవివక్ష ప్రపంచవ్యాప్తంగా 25కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది.[3][4] ఈ కుల వ్యవస్థ ప్రముఖంగా ఆసియా (భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, జపాన్), ఆఫ్రికా ఖండాలలో ప్రబలి ఉంది. భారత దేశంలో కుల వ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఏర్పడినవి. కులం లేదా వర్ణం భారతదేశంలో హిందూ మతానికి చెందిన ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో కులము అనే పదానికి తెగ, జాతి, వంశము సమానార్థాలున్నాయి.[5] భారతదేశంలో కులం అనే పదం జాతి లేక సామాజిక వర్గాన్ని సూచిస్తుంది. పూర్వం ఆర్యుల కాలంలో ఎంతో మేధస్సుతో జాతి వర్గీకరణ చేయబడింది. ఒక జాతికి (కులం) సంబంధించిన వారందరికీ ఒకే లక్షణములు ఉంటాయి. కాని పూర్వం కొందరు ఆర్యులు వాత్సాయన ఋషి కాలంలో శూద్ర స్త్రీలను కామకోరికలకు బానిసలుగా మార్చుకోవడం, బలాత్కారం చేయడం వల్ల నేడు అనేక మిశ్రమ జాతులు వారు ఏర్పడినారు.

వేదకాలంలో కులం

[మార్చు]

మన హిందూ మతము పేరు చెప్పగానే మొదట అందరికీ గుర్తుకు వచ్చేది కులాల సంగతి. హిందూమతమునకు ప్రామాణ్యము వేదాలు అని అందరికీ తెలుసు. స్త్రీలు, శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని అలా అని వేదాలలో ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు. కానీ వేదాలలో అలా లేదని చెప్పడానికి ఈ ప్రయత్నం. భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు “చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః”అన్నాడు. దీని అర్థం”మొదట వారి గుణాల బట్టి, తర్వాత వారు చేసే పనుల బట్టి నాలుగు వర్ణాలు (కులాలు) నాచే (భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి.“అని అర్థం. వేదాలలో నాలుగు వర్ణాల (కులాల) గురించి చెప్పారు కానీ వాటి మధ్య ఎక్కువ, తక్కువల గురించి చెప్పలేదు. మధ్యయుగంలో సాంప్రదాయవాదులు స్త్రీ,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని వారి వారి గ్రంథాలలో చొప్పించారు కానీ ఏ వేదంలోనూ అలా చెప్పబడలేదు. సరిగదా ఆ అధికారం ఉన్నదని చెప్పాయి.

  • 1. యజుర్వేదం(26.2) శ్లోకం

“యధేమంవాచం కళ్యాణీవధజనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యం శూద్రాయ చర్యాయచస్వయచరణాయ”

అంటే “నేనెలా ఈ కళ్యాణవాక్కులను బ్రహ్మ మొదలు శూద్రుల వరకు సర్వ మానవులకూ చెప్పానో నీవూ అలానే చెప్పాలి.”అని అర్థము.

  • 2. అధర్వణ వేదం (8వ మండలం, 2వ అనువాకం) బ్రాహ్మణులకు, శూద్రులలో కూడా చివరివారికి

“సత్యమహం గభీరకావ్యేన సత్యంజాతే నస్మిజాతవేద, నం దాసోనం ఆర్యోమహిత్వ వ్రతం మిమయయదహధరిష్యే”

అంటే “ఓ మానవుడా! గంభీర సత్యస్వరూపుడనైన నేను పుట్టుక నిచ్చినవాడను. నేను దాస (శూద్ర), ఆర్య పక్షపాతము గలవాడను కాదు. నావలె ప్రవర్తించి సత్యవంతములైన నా ఆదేశములను పాటించు వారినందరినీ రక్షిస్తాను“ అని అర్థము.

  • 3. ఇంకనూ ఋగ్వేద 10వ మండలం,3 వ అనువాకంలోని 30-34 వరకుగల సూక్తాలను ప్రచారం చేసిన కపశైలీషుడు శూద్రుడని ఐతరేయ బ్రాహ్మణమును, స్వయంగా ఋగ్వేదములోనూ, శాయనాచార్య భాష్యములోనూ చూడవచ్చు.
  • 4. అలానే ఋగ్వేద ఒకటవ మండలం, 17వ అనువాకంలోని 116-126 వరకు గల సూక్తాలను ప్రచారం చేసిన కక్షవాన్ ఋషి అంగదేశపు రాజు బానిస కొడుకని ఋగ్వేదంలోనూ, శాయన భాష్యములోనూ, మహాభారతంలోనూ చూడవచ్చు.
  • 5. అంతేకాక జనశృతి అనే ఋషి శూద్రుడు. సత్యకామజాబాలి వేశ్య కొడుకు. వీరిద్దరూ ఉపనిషత్తుల ప్రకారం (వేదాల చివరివి) ఉత్తమ వేదాంతబోధ పొందినవారు.
  • 6. ఋగ్వేద ఒకటవ మండలం 223వ అనువాకం 129వ సూక్తాన్ని లోపాముద్ర, 8వ మండలం 1వ అనువాకం 91 వ సూక్తాన్ని అపలా అనే స్త్రీలు ప్రచారం చేసారని ఋగ్వేద అనుక్రమణిక, శాయనభాష్యములోనూ చెప్పబడింది.

“న స్త్రీ శూద్ర వేదం అధీయతాం” (స్త్రీలు, శూద్రులు వేదమును అభ్యసింపరాదు) అన్నది మధ్యయుగపు గ్రంథాలలో చేర్చారు కానీ ఈ వాక్యము ఏ వేదములోనూ లేదు. ఇది వైదిక వాక్యము కాదు.

  • 7. ఇక జనక మహారాజు కొలువులోని గార్గి అనే మహాయోగిని గురించి అందరికీ తెలుసు. యాజ్ఞవల్కుడు అను ఋషిని ధైర్యంగా ప్రశ్నలు అడగి సమాధానాలు రాబట్టింది. ఆ తర్వాతనే యాజ్ఞ్యవల్కుడు వేదవేత్తగా అంగీకరింపబడ్డాడు. ఈ యాజ్ఞవల్క్యుని భార్య అయిన మైత్రేయి ఇతనిచే బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఆ కాలంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందింది. (బృహదారణ్యకోపనిషత్తు నుండి).
  • 8. వజ్రసూచీ ఉపనిషత్తు ప్రకారం ఎవరికి వేదాలను అధ్యయనం చేసి ఆచరించాలన్న సహజమైన కోరిక ఉంటుందో, సామర్థ్యము ఉంటుందో వారు స్త్రీపురుష శూద్ర భేదము లేక అందరూ అర్హులే.

నిజమైన ఆత్మానుభవం పొందిన వారి ఉపదేశాలకు, శాస్త్ర వాక్యాలకు వైరుధ్యమేర్పడినప్పుడు ఆత్మవేత్తల (ఆత్మానుభవం పొందినవారు) మాటే వినమని ధర్మశాస్త్రాలు చెపుతాయి.

దుష్టము, సంకుచితము ఐన నేటి కులవ్యవస్థ శాస్త్రీయము కాదని, ఇవి వేదాల తర్వాతి కాలంలోని గ్రంథాలలో చేర్చబడ్డాయని చెప్పవచ్చు.

ఆధునిక భారతదేశంలో కులవ్యవస్థ

[మార్చు]

ఆధునిక భారతదేశ కుల వ్యవస్థ, జాతి అని పిలువబడే సహజ సామాజిక సమూహాల మీద వర్ణం అని పిలువబడే నాలుగు సైద్ధాంతిక వర్గీకరణ కృత్రిమ విధానం మీద ఆధారపడి ఉంటుంది. 1901 నుండి డెసినియలు సెన్ససు ప్రయోజనాల కోసం, బ్రిటిషు వారు జాతులన్నింటినీ పురాతన గ్రంథాలలో వివరించిన విధంగా చతుర్వర్ణ ఉపవర్గాలుగా వర్గీకరించారు. సెన్ససు కమిషనరు హెర్బర్టు హోపు రిస్లీ ఇలా పేర్కొన్నాడు. " ప్రాతిపదికగా సూచించబడిన సూత్రం ఏమిటంటే సాంఘిక ప్రాధాన్యత ద్వారా వర్గీకరణ గుర్తించబడింది. వాస్తవానికి కొన్ని నిర్దిష్ట కులాలు విభజన ఆధునికమని వ్యక్తమవుతున్నాయి. ఇవి సైద్ధాంతిక భారతీయ కులవ్యవస్థలో ఉపవిభాగాలని భావిస్తున్నారు. " [6] పురాతన హిందూ గ్రంథాలలో ప్రతిపాదించబడిన వర్ణవ్యవస్థ సమాజాన్ని నాలుగు తరగతులుగా విభజించింది: బ్రాహ్మణులు (పండితులు, యజ్ఞ పూజారులు), క్షత్రియులు (పాలకులు, యోధులు), వైశ్యులు (రైతులు, వ్యాపారులు, చేతివృత్తులవారు), శూద్రులు (పనివారు, కార్మికులు). గ్రంథాలలో వర్ణ వర్గీకరణలో ప్రత్యేకమైన అంటరాని వర్గం గురించి ప్రస్తావించలేదు. వర్ణవ్యవస్థ సమాజంలో ఎప్పుడూ క్రియాశీలకంగా లేవని పండితులు విశ్వసిస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ వాస్తవీయత కలిగి ఉండటానికి ఆధారాలు లేవు. సమాజం ఆచరణాత్మక విభజన ఎల్లప్పుడూ జనన సమూహాలపరంగా ఉండేది. ఇవి ఏ నిర్దిష్ట సూత్రం మీద ఆధారపడవు. కానీ జాతి మూలాలు, వృత్తులు, భౌగోళిక ప్రాంతాల వరకు మారవచ్చు. జాతులు ఎటువంటి స్థిర సోపానక్రమం లేకుండా ఎండోగామసు సమూహాలు, కానీ జీవనశైలి, సామాజిక, రాజకీయ లేదా ఆర్ధిక స్థితిగతుల ఆధారంగా కాలక్రమేణా వ్యక్తీకరించబడిన వర్గీకరణ అస్పష్టమైన భావనలకు లోబడి ఉంటాయి. భారతదేశంలోని అనేక ప్రధాన సామ్రాజ్యాలు, మౌర్యాలు,[7] శాలివాహనలు,[8] చాళుక్యులు,[9] కాకతీయులు [10] వంటి అనేక వంశాలు వర్ణ వ్యవస్థలో శూద్రులుగా వర్గీకరించబడే వ్యక్తులచే స్థాపించబడ్డాయి. 9 వ శతాబ్దం నాటికి బ్రాహ్మణులు, వైశ్యులతో సహా నాలుగు కులాల రాజులు వర్ణ సిద్ధాంతానికి విరుద్ధంగా హిందూ భారతదేశంలో రాచరిక వ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించారు.[11] అనేక సందర్భాలలో, బెంగాలులో మాదిరిగా, చారిత్రాత్మకంగా రాజులు, పాలకులు అవసరమైనప్పుడు, జాతివర్గీకరణ మీద మధ్యవర్తిత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఇది ఉపఖండంలో వేలాదిగా ఉండి, ప్రాంతాల వారీగా మారుతుంది. ఆచరణలో జాతీయుల వర్ణ తరగతులకు, అనేక ప్రముఖ జాతులకు అన్వయించక పోవచ్చు, ఉండకపోవచ్చు. ఉదాహరణకు యాదవులలో రెండు వర్ణాలు ఉన్నాయి. అంటే క్షత్రియులు, వైశ్యులు. జాతుల వర్ణస్థితి కాలక్రమేణా ఉచ్చారణకు లోబడి ఉంటుంది.

హెర్బర్టు హోపు రిస్లీ నేతృత్వంలోని 1901 నాటి బ్రిటిషు వలసరాజ్యాల జనాభా లెక్కల ఆధారంగా జాతులన్నింటినీ సైద్ధాంతిక వర్ణాలను వర్గీకరించాడు.[12] రాజకీయ శాస్త్రవేత్త లాయిడు రుడాల్ఫు అభిప్రాయం ఆధారంగా భారతదేశంలో కనిపించే ఆధునిక కులాలన్నింటికీ ఎంత పురాతనమైనప్పటికీ కులం వర్తించవచ్చని రిస్లీ విశ్వసించాడు. ఈ వర్ణవ్యవస్థలో " అనేక వందల మిలియన్ల భారతీయులను గుర్తించి, దానిలో సమ్మిళితం చేయడానికి ఇది ఉద్దేశించబడింది." [13] సాంప్రదాయిక, భేదానికి దారితీసిన దానికంటే ప్రస్తుత కాలంలో వృత్తి ఆధారిత ప్రాధాన్యత క్రీయాశీల సమూహాల క్రమంలో వివిధ కులాలను ఏర్పాటు చేసే ప్రయత్నం తక్కువగా జరిగింది. " వాస్తవంగా ఈ చర్య భారతీయులను చరిత్ర పురోగతి నుండి తొలగించింది. సమయానుకూలంగా మార్పులేని స్థితిలో ఉన్నందుకు వారిని ఖండించింది. ఒక కోణంలో భారతీయ ప్రజలలో స్థిరమైన సమాజం ఉందని నిరంతరం ఆరోపిస్తున్న బ్రిటిషు వారు అప్పుడు ఇలా విధించడం విడ్డూరంగా ఉందని, పురోగతిని నిరాకరించిన నిర్మాణంగా ఉందని అభివర్ణించింది".[14] వర్ణం (వృత్తి ఆధారంగా సమాజ వర్గీకరణ), జతి (సమూహాలు) అనేవి రెండు విభిన్న భావనలు: వర్ణం అనేది ద్విజులు (బ్రాహ్మణులు) చేత చేయబడిన ఆదర్శప్రాయమైన నాలుగు-భాగాల విభాగం. జాతి (సంఘం)సమూహాన్ని సూచిస్తుంది. ఉపఖండంలో ప్రబలంగా ఉన్న వేలాది వాస్తవ ఎండోగామసు సమూహాలకు ఇది వర్తిస్తుంది. శాస్త్రీయ రచయితలు వర్ణరహితంగా మరేదీ మాట్లాడరు. ఎందుకంటే ఇది అనుకూలమైన సంక్షిప్తలిపిని అందించింది; ఇండోలాజిస్టులు కూడా కొన్నిసార్లు ఇద్దరిని అయోమయానికి గురిచేసినప్పుడు సమస్య తలెత్తుతుంది.[15] ఈ విధంగా 1901 జనాభా లెక్కల నుండి కులం అధికారికంగా భారతదేశానికి అవసరమైన సంస్థగా మారింది. బ్రిటీషు నిర్వాహకుల నుండి ఒక ముద్రతో, అప్పటికే ఇండాలజీ మీద ఆధిపత్యం వహించిన ఒక విధానాన్ని అభివృద్ధి చేసింది. " భారతదేశం అధికారిక రాజకీయ స్వాతంత్ర్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ దాని స్వంత గతాన్ని, వర్తమానాన్ని తెలుసుకునే శక్తిని ఇంకా పొందలేదు".[16]

బ్రిటను నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత భారత రాజ్యాంగం సానుకూల వివక్ష కోసం 1950 లో దేశవ్యాప్తంగా 1,108 కులాలను షెడ్యూల్డు కులాలుగా జాబితా చేసింది.[17] అంటరాని వర్గాలను కొన్నిసార్లు సమకాలీన సాహిత్యంలో షెడ్యూల్డు కులాలు, దళిత (హరిజన) అని పిలుస్తారు.[18] 2001 లో భారత జనాభాలో దళితులు 16.2% ఉన్నారు.[19] 15 మిలియన్ల వెట్టిచాకిరి అనే బంధిత బాల కార్మికులలో ఎక్కువ మంది అత్యల్ప కులాలకు చెందినవారున్నారు.[20][21]

స్వతంత్ర భారతదేశం కుల సంబంధిత హింసను చూసింది. 2005 లో దళితుల మీద అత్యాచారం, హత్యలతో సహా సుమారు 1,10,000 హింసాత్మక కేసులను ప్రభుత్వం నమోదు చేసింది.[22] 2012 లో ప్రభుత్వం 651 హత్యలు, 3,855 గాయాలు, 1,576 అత్యాచారాలు, 490 కిడ్నాపులు, 214 కాల్పుల కేసులను నమోదు చేసింది.[23]

పట్టణీకరణ కారణంగా కుల వ్యవస్థ సామాజిక-ఆర్థిక పరిమితులు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ ఇప్పటికీ వివాహ ప్రక్రియ, పితృస్వామ్యంలో కులవ్యవస్థ ప్రాధాన్యత వహిస్తుంది. ప్రజాస్వామ్య రాజకీయాలలో కూడా ఇది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ కులం రాజకీయ నాయకులకు నియోజకవర్గాలను సిద్ధం చేస్తుంది. ప్రపంచ వ్యాపారాలు, విదేశీ వ్యాపారాల నుండి వచ్చే ఆర్థిక అవకాశాలు భారతదేశ మధ్యతరగతి జనాభాను ప్రభావితం చేశాయి. ఛత్తీసుగఢ్ పాటరు కులసంఘం (సిపిసిసి) లోని కొందరు సభ్యులు సాంప్రదాయ గ్రామీణ కుమ్మరి సభ్యులలో మిగిలినవారికి భిన్నంగా మధ్యతరగతి పట్టణ వృత్తినిపుణులుగా ఉన్నారు. సిపిసిసిలో మధ్యతరగతి సభ్యులు, సాంప్రదాయ సభ్యుల సహజీవనం కులం, తరగతి మధ్య విభజనను సృష్టించింది.[24] భారతీయ రాజకీయాలలో కుల పట్టుదల ఉంది. కులసంఘాలు కుల ఆధారిత రాజకీయ పార్టీలుగా అభివృద్ధి చెందాయి. రాజకీయ పార్టీలు, రాష్ట్రాలు ప్రజలను సమీకరించటానికి, పాలనావిధాన అభివృద్ధికి కులాన్ని ఒక ముఖ్యమైన అంగంగా భావిస్తాయి.[25]

భట్టు, బెటిల్లె అధ్యయనాలు కులం భారతీయ సమాజంలోని సామాజిక అంశాల స్థితి, బహిరంగత, చైతన్యంలో మార్పులను చూపించాయి. దేశం మీద ఆధునిక సామాజిక ఒత్తిళ్ల ఫలితంగా, భారతదేశం వారి సామాజిక రంగంలో కుల వ్యవస్థ డైనమికుగానూ, ఆర్థికంగా మార్పును ఎదుర్కొంటోంది.[26] పెద్దలచేత ఏర్పాటు చేసిన వివాహాలు ఇప్పటికీ భారతదేశంలో సర్వసాధారణమైన పద్ధతిగా భావించబడుతున్నాయి. డేటింగు ద్వారా యువ భారతీయుల సంబంధాలను నియంత్రించడానికి ఇంటర్నెటు ఒక నెట్వర్కును అందించింది. ఈ అనువర్తనాల వాడకం ద్వారా వివాహం సాధ్యం కాదు కనుక ఇది అనధికారికంగా వేరుచేయబడుతుంది.[27] భారతదేశంలో, హిందూ సంస్కృతిలో ఉన్నతవర్గీయులతో వివాహం ఇప్పటికీ అంగీకరించబడిన వివాహ విధానంగా ఉంది. పురుషులు తమ కులంలో, లేదా క్రింద కులంలో స్త్రీలను వివాహం చేసుకోవచ్చని పురాతన హిందూసంస్కృతి సూచించింది. ఒక స్త్రీ ఉన్నత కులంలోకి వివాహం చేసుకుంటే, ఆమె పిల్లలు వారి తండ్రి హోదాను తీసుకుంటారు. ఆమె దిగువ కులంలో వివాహం చేసుకుంటే, ఆమె కుటుంబం వారి అల్లుడి సామాజిక స్థితికి తగ్గించబడుతుంది. ఈ సందర్భంలో మహిళలు వివాహం సమతౌల్య సూత్రాన్ని కలిగి ఉంటారు. వివాహం నిబంధనలు సమానత్వాన్ని సూచించకపోతే ఉన్నత కులాన్ని వివాహం చేసుకోవడంలో ఎటువంటి ప్రయోజనం ఉండదు.[28] అయినప్పటికీ ఈ ఒప్పందం కారణంగా ప్రతికూల చిక్కుల నుండి పురుషులు క్రమపద్ధతిలో రక్షించబడతారు.

భౌగోళిక అంశాలు కూడా కుల వ్యవస్థకు కట్టుబడి ఉండాలని నిర్ణయిస్తాయి. ఒకే కులంలో అర్హత కలిగిన వధూవరులు లేకపోవడం వల్ల చాలా ఉత్తరప్రాంత గ్రామాలు అన్యదేశ వివాహంలో పాల్గొనే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో మహిళలు తక్కువ కుల వ్యవస్థకు చెందినవారు కాబట్టి వారి స్వేచ్ఛమీద అధిక ఆంక్షలు ఉన్నప్పటికీ విడిచిపెట్టడం లేదా విడాకులు తీసుకునే అవకాశం తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. ఉన్నాయి. మరోవైపు ఉత్తర పర్వతాలకు చెందిన పహారీ మహిళలకు తమ భర్తలను వదిలివేసినప్పటికీ కళంక రహితులుగా ఉండడానికి తగినంతగా అధిక స్వేచ్ఛ ఉంది. భర్త ఆధిపత్య చర్యలు సామాజిక అంచనాల ద్వారా రక్షించబడనందున ఇది తరచుగా అనుకూల దాంపత్యానికి దారితీస్తుంది.[29]

భారతదేశంలోని 72 కులాల నమూనాల ఒక పేజీ. ఇందులో 1837 లో భారతదేశంలోని మదురాలో కనుగొనబడిన వివిధ మతాలు, వృత్తులు, జాతి సమూహాలకు చెందిన పురుషులు, మహిళల 72 పూర్తి-రంగు చిత్రలేఖనాలు ఉన్నాయి. ఇది జనాదరణ పొందిన అవగాహనను నిర్ధారిస్తుంది. 1901 జనాభా లెక్కల నుండి బ్రిటీషు వారు వర్ణవ్యవస్థగా వర్గీకరించబడిన హిందువులకు మాత్రమే వర్తించింది

గత శతాబ్దంలో భారతదేశంలో వేగంగా పట్టణీకరణ జాత్యంతర వివాహాల పెరుగుదలను ప్రభావితం చేసే అంశంగా మారింది. పట్టణ కేంద్రాలు సాంప్రదాయం మీద తక్కువ ఆధారపడటం కారణంగా మరింత ప్రగతిశీలమైనవిగా భావించబడ్డాయి. భారతదేశ నగరాలు జనాభా విజృంభించడంతో, ఉద్యోగ మార్కెటు వేగవంతం అయ్యింది. సాంప్రదాయిక వివాహం ఈ సూత్రాలను సాధించడానికి ఉద్యోగం ఒక సాధనంగా భావించడింది. ప్రస్తుతం ఒక వ్యక్తి స్థిరత్వం, సమృద్ధి సాధించడానికి పట్టణీకరణ, ఉద్యోగావకాశాలు మరింత సహకరించి సంప్రదాయ వివాహాలు అధికరించాయి. ఫలితంగా పురుషుల వివాహం గురించిన ఆందోళన తగ్గింది. అందువలన పట్టణ భారతీయయువకులలో మరింత ప్రగతిశీల తరాల వ్యవస్థలో పురాతన దిగువ జాతి వధూస్వీకరణ విధానం తగ్గుముఖం పట్టింది.

స్థానికంగా "రిజర్వేషను గ్రూపులు" అని పిలువబడే అఫిర్మేటివ్ యాక్షనుతో భారతదేశం ప్రయోగాలు చేసింది. కోటా సిస్టం ఉద్యోగాలు, అలాగే బహిరంగంగా నిధులతో నిర్వహించబడుతున్న కళాశాలలలో నియామకాలు, భారతదేశంలోని 8% మైనారిటీ, బలహీన వర్గాలకు అందించబడ్డాయి. తత్ఫలితంగా తమిళనాడు వంటి రాష్ట్రాలలో లేదా తక్కువ జనాభా ఉన్న ఈశాన్య ప్రాంతాలలో, 80% పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కోటాలో కేటాయించబడ్డాయి. విద్యలో కళాశాలలు దళితులు ప్రవేశించడానికి అర్హతగా భావించబడిన మార్కులను తగ్గించాయి.[30]

సమకాలీన కాలంలో కులవ్యవస్థ

[మార్చు]

ఇప్పుడు కూడా కుల వ్యవస్థ ఉనికిలో ఉన్నప్పటికీ సమాజంలో కులం కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.పూర్వం కూటికి పేదలం కానీ కులానికి పేదలం కాదు అనేవారు. ఇప్పుడు కొంత మంది కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు కానీ అక్కడ కూడా తమ డబ్బు-హోదాకి తగిన వ్యక్తుల్నే ఎంచుకుంటున్నారు. ఉన్నవాళ్ళు-లేనివాళ్ళు అనే భేదం ఎప్పుడూ ఉంటుంది. సొంతకులంలో కూడా డబ్బున్న కుటుంబాలకి చెందిన వాళ్ళు పేద కుటుంబాలకి చెందిన వాళ్ళని పెళ్ళి చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. పట్టణ ప్రాంతాలలోనూ, కొన్ని గ్రామీణ ప్రాంతాలలోనూ కుల పునాదులు అంత బలంగా కనిపించడం లేదు. అంత కంటే డబ్బున్న వాళ్ళు - పేద వాళ్ళు అన్న భేదాలే ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయాల విషయంలో మాత్రం కులం ఎక్కడా లేనంత బలంగా కనిపిస్తుంది. కొన్ని కుల సంఘాల వాళ్ళు తమ కులం వారికి ఇన్ని సీట్లు ఇస్తేనే వోట్లు వేస్తామని డిమాండ్లు చేస్తుంటారు. నియోజకవర్గాలు కూడా కులాల వారీగా రాజ్యాంగ ప్రకారం కేటాయుంపులు చేయబడ్దాయి. ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల కులం పేరును తొలగించవలిసిందిగా ఎన్నికలు కమిషను ఆదేశించాలని కోరుతూ గాంధీ లేవనెత్తిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు 24.10.2008 న తోసిపుచ్చింది.

చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః”అన్నాడు. దీని అర్థం”మొదట వారి గుణాల బట్టి, నాచే (భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి.“అని అర్థం. వేదాలలో నాలుగు వర్ణాల (కులాల) గురించి చెప్పారు కానీ వాటి మధ్య ఎక్కువ, తక్కువల గురించి చెప్పలేదు. మధ్యయుగంలో సాంప్రదాయవాదులు స్త్రీ,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని వారి వారి గ్రంథాలలో చొప్పించారు కానీ ఏ వేదంలోనూ అలా చెప్పబడలేదు. సరిగదా ఆ అధికారం ఉన్నదని చెప్పాయి.

"'తర్వాత వారు చేసే పనుల బట్టి నాలుగు వర్ణాలు (కులాలు) "'

వివిధ కులస్థుల నివాసాలు

[మార్చు]

చాలా వరకు గ్రామాలలో ఒక కులానికి చెందిన వారంతా ఆ గ్రామంలోని ఒక ప్రత్యేక వాడలో నివసిస్తారు. కొన్ని గ్రామాలలో వాడల పేర్లు వారి కులంతో సంబంధం కలిగి ఉంటాయి. ఇది పట్టణాలలో కచ్చితంగా పాటించకపోయినా కొంతవరకు పట్టణాలలో కూడా ఈ విధమైన నివాసాలు కానవస్తాయి. కుల నిర్ములన చెయాలి. కులాంతర వివాహాలని ప్రొత్సహించంది . మనషులంత ఎకమవుదాం. యువకులరా మనమె ఈ పనికి పూనుకొవాలి.

కుల నిర్మూలన

[మార్చు]
కులం కార్య విభాగమే, కులాలలో సమత్వమూ, సమాన గౌరవమూ, ఉన్నన్నాళ్ళూ నిలిచాయి కులాలు. కార్య విభాగంలో భేదంగాని, గౌరవంలో భేదంగాని రాగానే వేరుపురుగు పుట్టిందన్నమాటే. మూఢత్వమూ, అజ్ఞానమూ తగ్గగానే తక్కువజాతి వాళ్ళనే వాళ్ళు మోసం తెలుసుకుని తిరగబడుతున్నారు. స్త్రీ కూడా అంతే. - చలం

భారతీయ సమాజంలో ఒక కులం లేదా మతం మనుషులు మరొక కులం వారి కంటే ఎక్కువ తక్కువని అనుకోవటం వల్ల, మనుషులందరు సమానులు కాదనుకోవటం వల్ల, అంటరానితనాన్ని పాటించటం గతంలో జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం కులాంతర మతాంతర వివాహాలకు ఇచ్చేప్రోత్సాహక మొత్తాన్ని 25000 నుండి 50000 రూపాయలకు పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖా మంత్రి మీరాకుమారి చేప్పారు. డాక్టర్ అంబేద్కర్ లాంటి అభ్యుదయవాదులు, మానవతావాదులు కులనిర్మూలన కోసం పోరాడుతున్నారు కానీ పెద్దగా ప్రయోజనం లేదు. రాజస్తాన్ లో గుజ్జర్లు తమను షెడూల్డ్ ట్రైబుల్లో చేర్చాలని, మన రాష్ట్రంలో కాపులు తమను వెనుకబడిన కులాల్లో చేర్చాలని పోరాడుతున్నారు. గతంలో కారంచేడు, నీరుకొండ, చుండూరు, పదిరికుప్పం లాంటి చోట్ల కులహింస జరగ్గా, మళ్ళీ ఇప్పుడు హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరగటం వల్ల కులనిర్మూలన జరుగుతుంది.

అజాత్

[మార్చు]

1920 ప్రాంతంలో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా 'మంగ్రోల్‌ దస్తగిర్‌' గ్రామంలో గణపతి భభుత్కర్‌ అనే సంఘసంస్కర్త మనుషులంతా సమానమేనని చెప్పి కులం, మతం పట్టింపులేని వారందరినీ 'అజాత్‌' అనే ఒక సామాజిక వర్గంగా మార్చే ఉద్యమం చేపట్టారు. భభుత్కర్‌ సందేశం నచ్చి విదర్భ ప్రాంతంలో దళిత, మాలి, బ్రాహ్మణ.... లాంటి దాదాపు 18 కులాలవారు కలిసిపోయారు. 1950 నాటికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అజాతీయులుగా చెప్పుకునే వారి సంఖ్య సుమారు అరవైవేలకు చేరింది.1960, 70ల్లో 'అజాత్‌' ఒక ప్రత్యేక సామాజిక వర్గంగా గుర్తింపు పొందింది. వీరి స్కూల్‌ సర్టిఫికెట్‌లోనూ కులం అని రాసున్న చోట అజాత్‌ ఉంటుంది.ఇప్పటికీ మంగ్రోల్‌లోని గణపతి భభుత్కర్‌ నిర్మించిన ఆలయ ప్రాంగణంలో ఏటా నవంబరులో 'అజాత్‌' సమావేశం జరుగుతుంది. 105 కుటుంబాలకు చెందిన రెండువేల మంది ఈ సమావేశాలకు హాజరవుతారు. జనాభా గణనలో కులం పేరు తప్పనిసరిగా చేర్చాలనుకుంటే, ఏ కులమూ లేదని చెప్పేవారికీ ప్రత్యేక గుర్తింపునివ్వాలి' అని వీరు డిమాండ్ చేస్తున్నారు.[31]

కుల నిర్మూలనపై వ్యాఖ్యానాలు

[మార్చు]
మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి సంఘ సంస్కర్తలు వర్ణ వ్యవస్థ ను నిరసించారు..[32]

కుల నిర్మూలన గురించి అంబేద్కర్ మాటలు:

  • కులంవల్ల ఆర్థిక శక్తియుక్తులేమీ సమకూడవు. కులంవల్ల జాతి కూడా ఏమీ వికసించదు. కానీ కులం ఒకపనిచేసింది. అది హిందువులు నీతి నికోల్పోయి పూర్తిగా చిన్నాభిన్నామయ్యేలా చేసింది. కులాలు ఒక కూటమిగా కూడా ఏర్పడలేవు. ఒక కులం ఇంకొక కులానికి అనుబంధంగా కూడా ఉండదు. ప్రతి కులం మిగతా కులాలనుండి తానొక ప్రత్యేక కులంగా గుర్తింపుకోసం పోరాడుతుంది. కులవ్యవస్థ అందరూ కలిసి పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్ని అడ్డగిస్తుంది.ఇది మన అందరి పని అనే స్పృహ లేకుండా, హిందువులందరూ ఐఖ్యం కాకుండా చేస్తుంది. కులంఉండటం, కులస్పృహ ఉండటం వల్ల పాత వివక్ష లన్నీ గుర్తుకొస్తూ సమైక్యత ఆగిపోతున్నది. క్లబ్బు, సభ్య త్వం లాగా కులం సభ్యత్వం అందరికీ రాదు. కులంలో సభ్యత్వం కావాలంటే ఆకులంలో పుట్టాలి. అది కులధర్మం. కులాలు స్వయంప్రతిపత్తి గలవి. ఎవరైనా కొత్తవ్యక్తి వస్తే ఒక కులంలోకి చేర్చుకొమ్మని చెప్పే అధికారం ఎవరికీ లేదు. హిందూ సంఘం ఒక కులాల కూటమి. ప్రతి కులం మూసుకుపోయి ఉంటుంది కాబట్టి కులం మారే అవకాశం ఎవరికీ ఉండదు. హిందూసమాజం విస్తరించకుండా ఇతర మతస్థులను కలుపుకోకుండా కులమే అడ్డుపడింది. కులాలున్నంతవరకు హిందూ మతం విశ్వజనీన సేవా మతం కాలేదు. శుద్ధి హాస్యాస్పదం, నిష్ఫలకార్యక్రమం.సదాచార సంపన్నుల చేతిలోని కులం సంస్కర్తలనూ, సంస్కరణలనూ నాశనంచేసే ఆయుధం. తన కులంకాని వాడిలో ఉన్న ప్రతిభను ప్రశంసించే శక్తి హిందువులో ఉండదు.మౌర్యుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టారు.
  • "భగవంతుని ప్రేమికులు ఏ కులానికీ చెందరు.... ప్రేమ గుణం లేని బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కాజాలడు. భక్తి ద్వారా అంటరాని వాడు కూడా పరమ పవిత్రుడు కాగలడు."- రామకృష్ణ పరమహంస [33]
  • కుల వ్యవస్థ దేశం మీద శాపం, అది ఎంత త్వరగా నాశనం చేయబడితే అంత మంచిది. న్యాయమూర్తులు అశోక్ భను, మార్కండేయ కట్జులతో కూడిన ధర్మాసనం వాస్తవానికి కుల వ్యవస్థ "దేశం ముందున్న సవాళ్లను ఎదుర్కోవటానికి మనం ఐక్యంగా ఉండాల్సిన సమయంలో దేశాన్ని విభజిస్తోంది" అని అభిప్రాయపడ్డారు.
  • కుల రహిత సమాజంలో ప్రవేశించడానికి సమర్థవంతమైన మార్గాలు, సాధనాల్లో ఒకటి కులాంతర వివాహం. మహాత్మా గాంధీ దళితులతో కులాంతర వివాహాలకు పట్టుబట్టడం ద్వారా దీనిని సమర్థించారు. ‘కుల వినాశనం’ కోసం ఒక ముఖ్యమైన చర్యగా డాక్టరు బి.ఆర్.అంబేద్కరు కూడా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులాంతర జంటలకు నగదు ప్రోత్సాహకాలు, బంగారు పతకాలను కూడా అందించాయి. సుప్రీంకోర్టు "కులాంతర వివాహాలు వాస్తవానికి జాతీయ ప్రయోజనాలకు సంబంధించినవి, ఎందుకంటే అవి కుల వ్యవస్థను నాశనం చేస్తాయి" అని హైలైటు చేసింది.
  • కుల, మతాల ఆధారంగా దేశాన్ని ఐక్యంగా ఉంచలేము--ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్ 21.2.2010
  • దళితులను కించపరచాలనే ఉద్దేశంతో కులం పేరిట పిలిస్తే నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. (ఈనాడు20.4.2011)

సమత్వం

[మార్చు]

కులాల మధ్య తీవ్రమైన వివక్ష సాగుతున్న రోజుల్లోనే కొన్ని ప్రత్యేక అంశాల్లో ఆశ్చర్యమైన సమత్వం వెల్లివిరిసింది. ముఖ్యంగా చాతుర్వర్ణ్య వ్యవస్థను, కులకట్టుబాట్లను తీవ్రంగా పాటించేవారు కూడా గురుత్వం, ఆచార్యత్వం వంటి విషయాల్లో కులాల భేదాలను పూర్తిగా విడిచిపెట్టేవారు. ఆచార్యపురుషుల పుట్టుపూర్వోత్తరాలు కనుక్కోవడం గురుశిష్య పరంపర పద్ధతిలో తీవ్రమైన అవమానంగా, తప్పుగా ఎంచబడేది. శూద్ర, పొడబాగ్డి, అగురి కులాల వస్తాదుల వద్ద బ్రాహ్మణులు మొదలుగా అన్ని కులస్తులు ఛడీ, బాణా (కర్ర) మొదలైన పోరాటవిద్యలు నేర్చుకునేవారు. రంగంలోకి వెళ్ళగానే ముందుగా తన పోరాటానికి అడ్డురాకుండా జంధ్యాన్ని తొలగించేవారు. ఆయుధాలను గురువు పాదాల వద్ద ఉంచి, ఆయన మోకాళ్ళు తాకి, నమస్కరించి, ‘‘జేయ్ గురూ’’ అని గురువు అనుమతి పొందాకే విద్య నేర్వడం సాగేది. ఈ క్రతువును ఏ బ్రాహ్మణుడూ అవమానంగా భావించే స్థితి ఉండేదికాదు. అలాగే ఇవి చేసినందుకు తోటి బ్రాహ్మణులెవరూ వారిని అవమానించేదీ, వెలివేసేదీ లేదు.[34]

భారత దేశంలో కొందరు ప్రముఖ కులాంతర మతాంతర వివాహితుల జాబితా

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Scott, John; Marshall, Gordon (2005), "caste", A Dictionary of Sociology, Oxford, UK; New York, NY: Oxford University Press, p. 66, ISBN 978-0-19-860987-2, retrieved 10 ఆగస్టు 2012
  2. Winthrop, Robert H. (1991), "Caste", Dictionary of Concepts in Cultural Anthropology, New York, NY: Greenwood Press, pp. 27–30, ISBN 978-0-313-24280-9, retrieved 10 ఆగస్టు 2012
  3. "వివక్ష Archived 2013-12-30 at the Wayback Machine." యునిసెఫ్.
  4. "విశ్వవ్యాప్తంగా కులవివక్ష Archived 2008-11-15 at the Wayback Machine" మానవహక్కుల గమనిక.
  5. బ్రౌన్ నిఘంటువు ప్రకారం కులము పదప్రయోగాలు.[permanent dead link]
  6. Crooke, William. "Social Types". Chapter II in Risley, Sir Herbert Hope. The People of India
  7. Roy, Kaushik (2012), Hinduism and the Ethics of Warfare in South Asia: From Antiquity to the Present, Cambridge University Press, ISBN 978-1-107-01736-8
  8. Shalivahana was born in a potter's house, by grace of Adi-Sheshan. William Cooke Taylor (1838). Examination and Analysis of the Mackenzie Manuscripts Deposited in the Madras College Library. Asiatic Society. pp. 49–55
  9. Bilhana, in his Sanskrit work Vikramanakadevacharitam claims the Chalukyas were born from the feet of Brahma, implying they were Shudras, while some sources claim they were born in the arms of Brahma, and hence were Kshatriyas (Ramesh 1984, p. 15)
  10. Most of the Kakatiya records proudly describe them as Shudra.[Talbot, Austin Cynthia (2001), Pre-colonial India in Practice: Society, Region, and Identity in Medieval Andhra, Oxford University Press, ISBN 978-0-19803-123-9] Examples include the Bothpur and Vaddamanu inscriptions of Ganapati's general Malyala Gunda senani. The Kakatiyas also maintained marital relations with other Shudra families, such as the Kotas and the Natavadi chiefs. All these evidences indicate that the Kakatiyas were of Shudra origin.[Sastry, P. V. Parabhrama (1978). N. Ramesan, ed. The Kākatiyas of Warangal. Hyderabad: Government of Andhra Pradesh. OCLC 252341228 page 29]
  11. Notes of Yuan Chwang, Altekar, Anant Sadashiv (1934). The Rashtrakutas And Their Times; being a political, administrative, religious, social, economic and literary history of the Deccan during C. 750 A.D. to C. 1000 A.D. Poona: Oriental Book Agency. OCLC 3793499, p 331
  12. Nicholas B. Dirks (2001). Castes of Mind: Colonialism and the Making of New India. ISBN 978-0-691-08895-2.
  13. Rudolph, Lloyd I. (1984). The Modernity of Tradition: Political Development in India. Rudolph, Susanne Hoeber. University of Chicago Press. pp. 116–117. ISBN 978-0-226-73137-7.
  14. "The British Empire, Imperialism, Colonialism, Colonies".
  15. Dumont, Louis (1980), Homo hierarchicus: the caste system and its implications, Chicago: University of Chicago Press, pp. 66–67, ISBN 978-0-226-16963-7
  16. Inden, R. (1986). Orientalist Constructions of India. Modern Asian Studies, 20(3), 401-446. doi:10.1017/S0026749X00007800
  17. "The Constitution (Scheduled Castes) Order 1950". Lawmin.nic.in. Archived from the original on 19 జూన్ 2009. Retrieved 30 నవంబరు 2013.
  18. Lydia Polgreen (21 డిసెంబరు 2011). "Scaling Caste Walls With Capitalism's Ladders in India". The New York Times.
  19. "Scheduled castes and scheduled tribes population: Census 2001". Government of India. 2004.
  20. "Children pay high price for cheap labour Archived 2017-06-27 at the Wayback Machine". UNICEF.
  21. ZAMA COURSEN-NEFF (30 జనవరి 2003). "For 15 million in India, a childhood of slavery". The New York Times. Retrieved 22 మార్చి 2017.
  22. "UN report slams India for caste discrimination". CBC News. 2 March 2007.
  23. "Viewpoint: India must stop denying caste and gender violence". BBC News. 11 June 2014
  24. Natrajan, Balmurli (2005). "Caste, class, and community in india: An ethnographic approach". Ethnology. 4 (3): 227–241.
  25. Sen, Ronojoy. (2012). "The persistence of caste in indian politics". Pacific Affairs. 85 (2): 363–369. doi:10.5509/2012852363.
  26. Gandhi, Rag S. (1980). "FROM CASTE TO CLASS IN INDIAN SOCIETY". Humboldt Journal of Social Relations. 7 (2): 1–14.
  27. Gandhi, Divya. (2 ఏప్రిల్ 2016). "Running in the family". The Hindu.
  28. Kingsley Davis (13 జూన్ 2013). "Intermarriage in Caste Societies". AnthroSource. 43 (3): 376–395. doi:10.1525/aa.1941.43.3.02a00030.
  29. Berreman, Gerald D. (1962). "Village Exogamy in Northernmost India". 18 (1): 55–58. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  30. Delhi A.R (13 జూన్ 2013). "Indian Reservations". The Economist. Retrieved 4 డిసెంబరు 2018.
  31. ఈనాడు 25.7.2010
  32. Elenanor Zelliot, "Caste in Contemporary India," in Rinehart 2004
  33. Nikhilananda 1992, p. 155
  34. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 డిసెంబరు 2014.

ఉపయుక్త గ్రంథ సూచి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కులం&oldid=4069161" నుండి వెలికితీశారు