Jump to content

గండి బాబ్జీ

వికీపీడియా నుండి
గండి బాబ్జీ
గండి బాబ్జీ


ఆంధ్ర ప్రదేశ్ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 9 - ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2009
ముందు బండారు సత్యనారాయణ మూర్తి
తరువాత పంచకర్ల రమేష్ బాబు
నియోజకవర్గం పరవాడ

వ్యక్తిగత వివరాలు

జననం 1963
మొగలిపురం, సబ్బవరం మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు దేముడు
జీవిత భాగస్వామి అరుణ
సంతానం విజయ్ దీప్ & వంశీ దీప్
వృత్తి రాజకీయ నాయకుడు

గండి బాబ్జీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో పరవాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2024 నవంబర్ 9న ఆంధ్ర ప్రదేశ్ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ( నూనెగింజల అభివృద్ధి) ఫెడరేషన్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

గండి బాబ్జీ 1963లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, సబ్బవరం మండలం, మొగలిపురం గ్రామంలో జన్మించాడు. ఆయన బీఎల్‌ పురః చేసి లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసి అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

గండి బాబ్జీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పరవాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన ఆ తరువాత 2009లో పెందుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయి, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[4]

గండి బాబ్జీ 2019లో ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 95వ వార్డు నుంచి టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా, టీడీపీ తరఫున మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించగా, పార్టీలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఆయన పోటీ నుంచి తప్పుకున్నాడు. ఆయన 2021లో విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా నియమితుడయ్యాడు.[5] గండి బాబ్జీ 2024 మార్చి 26న తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షునిగా నియమితులయ్యాడు.[6][7]

సంవత్సరం నియోజకవర్గం విజేత పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
2004 పరవాడ గండి బాబ్జీ కాంగ్రెస్ పార్టీ 68045 బండారు సత్యనారాయణ మూర్తి తెలుగు దేశం పార్టీ 57250
2009 పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు ప్రజారాజ్యం పార్టీ 51700 గండి బాబ్జీ కాంగ్రెస్ పార్టీ 48428
2014 పెందుర్తి బండారు సత్యనారాయణ మూర్తి తెలుగు దేశం పార్టీ 94531 గండి బాబ్జీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 75883

మూలాలు

[మార్చు]
  1. Eenadu (10 November 2024). "ఏపీలో పదవుల పండగ". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
  2. Andhrajyothy (10 November 2024). "పదవుల పండగ". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
  3. "Paravada Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2023-09-12.
  4. "Pendurthi Elections Results 2014, Current MLA, Candidate List of Assembly Elections in Pendurthi, Andhra Pradesh". Elections in India. Retrieved 2023-09-12.
  5. Andhra Jyothy (23 December 2021). "సౌత్‌ టీడీపీ ఇన్‌చార్జిగా గండి బాబ్జీ" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.
  6. The Hindu (26 March 2024). "Gandi Babjee is TDP Visakhapatnam Parliament president" (in Indian English). Archived from the original on 19 June 2024. Retrieved 19 June 2024.
  7. Andhrajyothy (27 March 2024). "విశాఖ టీడీపీ అధ్యక్షుడిగా బాబ్జీ". Archived from the original on 19 June 2024. Retrieved 19 June 2024.