గడ్డిగారి విఠల్‌ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గడ్డిగారి విఠల్ రెడ్డి

పదవీ కాలము
2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గము ముధోల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఆగస్టు 6, 1954
దేగాం, భైంసా మండలం, నిర్మల్ జిల్లా
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

గడ్డిగారి విఠల్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు,ముధోల్ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

విఠల్ రెడ్డి 1954, ఆగస్టు 6నిర్మల్ జిల్లా, భైంసా మండలం, దేగాం గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి గడ్డిగారి గడ్డెన్న ఆరుసార్లు ఎమ్మెల్యేగా, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో బి. సి. సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహించాడు.[2]

విద్యాభ్యాసం - ఉద్యోగం[మార్చు]

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. పూర్తిచేసి, 20 ఏళ్ళపాటు భైంసా పట్టణంలో న్యాయవాదిగా పనిచేశాడు.

రాజకీయ విశేషాలు[మార్చు]

2006-2008, 2010-2013 మధ్యకాలంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశాడు. 2009లో ప్రజా రాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన విఠల్ రెడ్డి, 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పదకంటి రమాదేవిపై 14వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3] ఈయన [4]2014, ఆగష్టు 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి సమీప బిజెపి అభ్యర్థి పదకంటి రమాదేవిపై 43వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5][6][7]

మూలాలు[మార్చు]

  1. https://www.news18.com/amp/news/politics/mudhole-election-result-2018-live-updates-gaddigari-vittal-reddy-of-trs-wins-1968703.html
  2. Andhrajyothi, Politician Biography. "Vittal Reddy". www.andhrajyothy.com. Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-04. Retrieved 2019-05-04.
  4. https://www.andhrajyothy.com/elections/prajatantram_biography?PLID=206
  5. https://www.news18.com/amp/assembly-elections-2018/telangana/mudhole-election-result-s29a010/
  6. http://myneta.info/telangana2018/candidate.php?candidate_id=4724
  7. https://www.thehindu.com/news/national/telangana/lone-congress-mla-from-adilabad-vittal-reddy-joins-trs/article6288445.ece/amp/