గర్భాధారణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గర్భాధారణ
Classification and external resources
PregnantWoman.jpg
గర్భవతి
ICD-10Z33
ICD-9650
DiseasesDB10545
MedlinePlus002398
eMedicinearticle/259724
MeSHD011247

గర్భధారణను గర్భావస్థ లేదా గర్భావది కాలం అని కూడా పిలుస్తారు, ఇది మహిళలో ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువ మంది సంతానంగానీ అభివృద్ధి చెందుతున్న సమయంగా ఉంది. [1][1] బహుళ గర్భంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉండే కవలల వంటి సంతానం ఉంటారు.[2] లైంగిక సంపర్కం లేదాసహాయక పునరుత్పత్తి సాంకేతికత ద్వారా గర్భధారణ సంభవించవచ్చు. ఇది సాధారణంగా చివరి ఋతుక్రమ వ్యవధి (ఎల్ ఎమ్ పి) నుండి సుమారు 40 వారాలు (10 చాంద్రమాన నెలలు) వరకు కొనసాగుతుంది, మరియు శిశు జననంతో ముగుస్తుంది.[1][3] ఇది గర్భంలో పిండం పడటం తరువాత సుమారు 38 వారాలు.ఉంటుంది. గర్భధారణ నుండి మొదటి 8 వారాలలో గర్భస్థ పిండం శిశువుగా అభివృద్ధి చెందిన తరువాత జననం వరకు, దానిని పిండం అని పిలుస్తారు.[3] గర్భధారణ ప్రారంభ లక్షణాలలో బహిష్టులు రాకపోవటం, మృదువైన వక్షాలు, వికారం మరియు వాంతులు, ఆకలి, మరియు తరచుగా మూత్రవిసర్జన ఉండవచ్చు.[4] గర్భనిర్ధారణ పరీక్షతో గర్భం ధృవీకరించబడవచ్చు.[5]

గర్భధారణ ప్రత్యేకించి మూడు త్రైమాసికాలుగా విభజించబడింది. మొదటి త్రైమాసికం ఒక వారం నుండి పన్నెండు వారాల వరకు ఉంటుంది మరియు గర్భంలో పిండం పడటం ఉంటుంది. గర్భాధారణ తరువాత ఫలదీకరణం చెందిన అండం ఫెలోపియన్ ట్యూబ్‌‌లో క్రిందకు ప్రయాణిస్తూ, గర్భాశయం లోపలి భాగంలో అతుక్కుంటుంది, ఇక్కడ పిండం మరియు మాయగా రూపొందటం ప్రారంభమవుతుంది.[1] మొదటి త్రైమాసికంలో గర్భస్రావం అయ్యే అత్యధిక ప్రమాదవకాశం ఉంది (గర్భస్థ శిశువు లేదా పిండం యొక్క సహజ మరణం) [6] రెండవ త్రైమాసికం 13 వారాల నుండి 28 వారాల వరకు ఉంటుంది. రెండవ త్రైమాసికం మధ్యలో పిండం కదలిన భావనను అనుభవించవచ్చు. అత్యంత నాణ్యత కలిగిన వైద్య సంరక్షణ అందించినట్లయితే, 28 వారాల వయస్సులో 90% కంటే ఎక్కువ మంది శిశువులు గర్భాశయం బయట జీవించగలరు. మూడవ త్రైమాసికం 29 వారాల నుండి 40 వారాల వరకు ఉంటుంది.[1]

ప్రసూతి సంరక్షణ గర్భం ఫలితాలను మెరుగుపరుస్తుంది.[7] దీనిలో అదనపు ఫోలిక్ ఆమ్లాన్నితీసుకోవడం, మందులు మరియు మద్యపానాన్ని తీసుకోకపోవటం, రోజువారీ వ్యాయామం, రక్త పరీక్షలు మరియు సాధారణ భౌతిక పరీక్షలు ఉంటాయి.[7] గర్భధారణ సమస్యలలో గర్భధారణతో అధిక రక్తపోటు, గర్భధారణ మధుమేహం, ఇనుము లోపంతో రక్తహీనత మరియు తీవ్రమైన వికారం వాంతులు ఉండవచ్చు.[8] ప్రారంభ నిర్ణీత కాలం 37 మరియు 38 వారాలతో, గర్భాధారణ 37 వారాల నుండి 41 వారాలు కొనసాగుతుంది, పూర్తి కాలవ్యవధి 39 మరియు 40 వారాలు ఉంటుంది మరియు.ఆలస్య కాలవ్యవధి 41 వారాలు ఉంటుంది. 41 వారాల తరువాత దీన్ని గడువు దాటాక వచ్చే ప్రసవం అని పిలుస్తారు. 37 వారాల ముందు పుట్టిన శిశువులునెల తక్కువ శిశువులుగా ఉంటారు మరియుమస్తిష్క పక్షవాతం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదవకాశంతో ఉంటారు.[1] ఇతర వైద్య కారణాల వల్ల తప్పనిసరి అయితే తప్ప 39 వారాల ముందు ప్రసవ ప్రేరణ లేదా సిజేరియన్ శస్త్రచికిత్సతో ప్రసవం కృత్రిమంగా ప్రారంభించబడకూడదని సిఫార్సు చేయబడింది.[9]

2012 లో 213 మిలియన్ గర్భాలు సంభవించాయి, వీటిలో 190 మిలియన్లు అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో మరియు 23 మిలియన్లు అభివృద్ధి చెందిన ప్రపంచంలో సంభవించాయి. ఇది 15 మరియు 44 సంవత్సరాల వయస్సు మధ్య ప్రతి 1,000 మహిళలకు 133 గర్భాలుగా ఉన్నాయి.[10] గుర్తింపు పొందిన గర్భాలలో 10% నుంచి 15% గర్భస్రావంతో ముగుస్తున్నాయి.[6] 1990 లో గర్భం యొక్క సమస్యలతో సంభవించిన 377,000 మరణాలు 2013 లో 293,000 మరణాలకు తగ్గాయి. సాధారణ కారణాలలో ప్రసూతి రక్తస్రావం,, గర్భస్రావంతో సమస్యలు, గర్భధారణ వల్ల అధిక రక్తపోటు, బాలింత జ్వరం మరియు ఆటంకాలతో కూడిన కాన్పు ఉన్నాయి.[11] ప్రపంచవ్యాప్తంగా 40% గర్భాలు ప్రణాళిక చేయని గర్భాలు. ప్రణాళిక చేయని గర్భాలలో సగం గర్భవిచ్చిత్తి కాబడ్డాయి.[10] అమెరికాలో అనూహ్యంగా గర్భధారణను పొందిన వారిలో 60% మంది మహిళలు కొంత స్థాయి వరకు కుంటుంబ నియంత్రణ పద్ధతులను ఉపయోగించారు.[12]

రిఫరెన్సులు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Pregnancy: Condition Information". http://www.nichd.nih.gov/. 2013-12-19. Retrieved 14 March 2015. External link in |website= (help)
  2. Wylie, Linda (2005). Essential anatomy and physiology in maternity care (Second Edition ed.). Edinburgh: Churchill Livingstone. p. 172. ISBN 9780443100413.CS1 maint: Extra text (link)
  3. Abman, Steven H. (2011). Fetal and neonatal physiology (4th ed. ed.). Philadelphia: Elsevier/Saunders. pp. 46–47. ISBN 9781416034797.CS1 maint: Extra text (link)
  4. "What are some common signs of pregnancy?". http://www.nichd.nih.gov/. 07/12/2013. Retrieved 14 March 2015. Check date values in: |date= (help); External link in |website= (help)
  5. "How do I know if I'm pregnant?". http://www.nichd.nih.gov/. 2012-11-30. Retrieved 14 March 2015. External link in |website= (help)
  6. 6.0 6.1 The Johns Hopkins Manual of Gynecology and Obstetrics (4 ed.). Lippincott Williams & Wilkins. 2012. p. 438. ISBN 9781451148015.
  7. 7.0 7.1 "What is prenatal care and why is it important?". http://www.nichd.nih.gov/. 07/12/2013. Retrieved 14 March 2015. Check date values in: |date= (help); External link in |website= (help)
  8. "What are some common complications of pregnancy?". http://www.nichd.nih.gov/. 07/12/2013. Retrieved 14 March 2015. Check date values in: |date= (help); External link in |website= (help)
  9. World Health Organization (November 2014). "Preterm birth Fact sheet N°363". who.int. Retrieved 6 Mar 2015.
  10. 10.0 10.1 Sedgh, G; Singh, S; Hussain, R (September 2014). "Intended and unintended pregnancies worldwide in 2012 and recent trends". Studies in family planning. 45 (3): 301–14. PMID 25207494.
  11. GBD 2013 Mortality and Causes of Death, Collaborators (17 December 2014). "Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990-2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013". Lancet. doi:10.1016/S0140-6736(14)61682-2. PMID 25530442.
  12. K. Joseph Hurt, Matthew W. Guile, Jessica L. Bienstock, Harold E. Fox, Edward E. Wallach (eds.). The Johns Hopkins manual of gynecology and obstetrics (4th ed.). Philadelphia: Wolters Kluwer Health / Lippincott Williams & Wilkins. p. 382. ISBN 9781605474335.CS1 maint: Uses authors parameter (link)