చర్చ:ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విలీనం, దారిమార్పు[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లోని_పట్టణ_స్థానిక_సంస్థల_జాబితా#నగరపాలక_సంస్థలు లో ఈ వ్యాసాన్ని విలీనం చేసి, ఆ విభాగానికి దారిమార్పు చేస్తే ముందు నిర్వహణ సులభమవుతుంది. ఒకే వివరం రెండు చోట్ల కొనసాగితే అన్ని చోట్ల తాజా చేయటానికి అదనపు శ్రమే కాక, వాటిలో తేడాలు ఏర్పడే అవకాశముంది. వ్యాసానికి ఎక్కువ పరిమాణంలో వివరం చేర్చిన User:Vin09, User:యర్రా రామారావు గారలు, ఇతరులు స్పందించవలసింది.--అర్జున (చర్చ) 22:42, 21 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్దున గారూ మీ అభిప్రాయంతో నేను ఏకీభవించుటలేదు.దానికి కారణాలు దిగువ వివరిస్తున్నాను.
ఇది ఈ ఒక్క వ్యాసానికి మాత్రమే సంబంధించిన చర్చ కాదు.
  1. పట్టణ స్థానిక సంస్థల అంటే బహు కొద్దిమందికి మాత్రమే తెలుసు.
  2. పట్టణ స్థానిక సంస్థల అంటే ఒక్క నగరపాలక సంస్థలు మాత్రమే కాదు.పురపాలక సంఘాలు, నగరపంచాయితీలు కూడా ఈ కోవలోకే వస్తాయి.పై ప్రయోగాలు వీటి అన్నిటిమీద ప్రయోగించవలసిఉంటుంది.
  3. పై ప్రయోగాలు రెండు రాష్ట్రాలలో చేయాలి.
  4. ఈ ప్రయోగాలు వలన వికీపీడియాలో వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది.
  5. ఇక మీరు చేప్పే అభిప్రాయం "ఈ వ్యాసాన్ని విలీనం చేసి, ఆ విభాగానికి దారిమార్పు చేస్తే ముందు నిర్వహణ సులభమవుతుంది. ఒకే వివరం రెండు చోట్ల కొనసాగితే అన్ని చోట్ల తాజా చేయటానికి అదనపు శ్రమే కాక, వాటిలో తేడాలు ఏర్పడే అవకాశముంది." అనే దానికి నిర్వహణ కష్టమని వ్యాసాలు విలీనం చేయాలని అనటం అర్థంలేని అభిప్రాయం. నిర్వహణ అనేది వికీపీడియా నిరంతర ప్రక్రియ.దానికి ఈ భాష్యం తగదు.వికీపీడియాలో కాలంచెల్లి నిర్వహణకు భారంగా ఉన్నవాటిపై ఈ శ్రద్ద మనమందరం దానిమీద పెడితే బాగుంటుందని నాసూచన.
ఈ విషయాలు అన్నీ అర్జున్ గారికి తెలిసికూడా ఈ ఒక్క నగరపాలక సంస్థలుకు మాత్రమే చర్చ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు.ఒకవేళ దీనికి ఒకరాయి వేసి చూద్దాం, ఇది ఒ.కె. అయితే తరువాత వాటికి వేద్దామనే అభిప్రాయంతో ఉన్నారా అని నా సందేహం.
పట్టణ స్థానిక సంస్థల్లో భాగంగా ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో ఇంకనూ సృష్టించని పురపాలకసంఘాలుకు, నగర పంచాయతీలకు ప్రాజెక్ట్ పని జరుగుతుంది.అందులో నాతో పాటు ప్రణయ్ రాజ్, చదువరి, మహేశ్వరరాజు గారలు భాగస్యామ్యంతో చురుకుగా పనిజరుగుతుంది.కావున ఈ చర్చ కేవలం వ్యాసంలో సవరణలు చేసిన ఇద్దరి అభిప్రాయాలకు మాత్రమే సంబంధించింది కాదు.సరే వారి అభిప్రాయాలు ఎలా ఉన్నా నేను మాత్రం పై కారణాలు రీత్యా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:36, 28 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రెండు చోట్లా ఒకే జాబితా ఉంటే కాలక్రమంలో జాబితాల్లో తేడా రావచ్చునననే అర్జున గారి వాదన సబబే. అయితే అందుకోసం ఈపేజీని తొలగించాల్సిన పనిలేదు. జాబితాను మాత్రమే ఒక మూసగా చేసి దాన్ని రెండు పేజీల్లోనూ ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. __చదువరి (చర్చరచనలు) 04:01, 30 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు, @Chaduvari గార్లకు, పై చర్చ ప్రకారం, జాబితాను ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలులోని విభాగం నుండి ఇమిడ్చాను. అర్జున (చర్చ) 10:48, 10 ఆగస్టు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]