Jump to content

చర్చ:ఎస్.వి. రంగారావు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఎస్.వి. రంగారావు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 19 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
ఎస్.వి. రంగారావు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 11 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


ఇంటి పేరు

[మార్చు]

ఇంటి పేరు ఇక్కడ ఇంటి పేరు ఇలా సామర్ల అని ఉన్నది. ఆంగ్ల వికీ లొ కూడా అలాగే ఉన్నది ఏది సరి--మాటలబాబు 15:03, 7 సెప్టెంబర్ 2007 (UTC)

సామర్ల అన్నది కరెక్టు. వ్యాసములో సరిచేసాను. ధన్యవాదములు -

అనుబంధ వ్యాసాలు

[మార్చు]

చిత్రాలు (అస్వెర్ చిత్రాలు), సినిమాల్లో కొన్ని పాత్రలు - ఈ రెండు వ్యాసాలను ఈ వ్యాసానికి అనుబంధ వ్యాసంగా కూర్చినట్లున్నారు. కాని ఆ అవుసరం కనిపించడంలేదు. ప్రధాన వ్యాసంలోనే భాగాలుగా ఉంచవచ్చును. అంతే గాకుండా చిత్రాలు (అస్వెర్ చిత్రాలు), సినిమాల్లో కొన్ని పాత్రలు అన్న పేర్లు సహేతుకమైనవి కావు. ఈ పేరుతో వేరే వ్యాసాలుంటాయని ఊహించలేరు. కనుక వాటిని ఎస్.వి. రంగారావు వ్యాంసతో కలిపైయడం మంచిదనుకొంటున్నాను. వ్యాసం మరీ పెద్దదయితే అప్పుడు విడగొట్టవచచ్చును. పేర్లు కూడా "ఎస్.వి. రంగారావు సినిమాల జాబితా", "ఎస్.వి. రంగారావు పాత్రల జాబితా" వంటి పేర్లుండాలి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:19, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శివ గారు, మీరు ఒక మంచి వ్యాసాన్ని చాలా అసంబద్దంగా తీర్చిదిద్దారు. నేను మళ్ళీ దానిని సరి దిద్దాను. ఇంకొకసారి మార్పులు చేసే ముందు దయచేసి ఇతర వ్యాసాలను పరిశీలించమని కోరుతున్నాను. - --Svrangarao 14:29, 6 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రంగారావుగారూ! నమస్తే. నేను అసంబంద్ధంగా తీర్చి దిద్దాను అని అరోపణ చేసారు కాని, నెను చేసిన మార్పులు ఏవిధంగా అసంబద్ధమో వ్రాయలేదు. దయచేసి తెలియ చేయమని మనవి.--SIVA 18:35, 14 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వివాదం గురించి

[మార్చు]

వ్యాసంలో జరిగిన మార్పులు

[మార్చు]

ఈ వ్యాసానికి సంబంధించిన వ్యాఖ్యలలో సభ్యుల మధ్య కొన్ని అపార్ధాలు తలెత్తాయి. టూకీగా జరిగింది ఇది -

నటులు, రచయితల గురించి వ్యాసాలు వ్రాసినప్పుడు, వారు నటించిన లేదా వ్రాసిన పుస్తకాల గురించి మనం తప్పనిసరిగా వ్రాయవలసి ఉంటుంది. కాని, వారి సినిమాలు లేదా నవలల/కథల జాబితా వ్యాస భాగంగా ఉంచితే, వ్యాసపు నిడివి అసహజంగా పెరిగి, చదవటానికి(ముఖ్యంగా కంప్యూటర్ తెర మీద)అంత వీలుగా ఉండదు. ఒక్కసారి, ఆలోచించండి, రచయిత చలం గురించిన వ్యాసం ఒక వార పత్రికలో మనం చదువుతుంటే, మొత్తం 3 పేజీల వ్యాసంలో, 2 పేజీలు ఆయన వ్రాసిన కథల/నవలల జాబితాకే పోతే బాగుంటుందా!! మనకు కంప్యూటర్లో జాబితా మొత్తం వేరొక చోట ఉంచి, వ్యాసం చదివేవారు అవసరమనుకున్నప్పుడు మాత్రమే ఆ జాబితా కనబడేట్లు చేసే చక్కటి అవకాశం వదులు కోవటం అంత సమంజసం అని నాకనించట్లేదు. కాబట్టి నటుల,రచయితల సినిమా/పుస్తకాల జాబితాలు, వారిగురించిన వ్యాసాలతో విలీనం చేయ వద్దని మరియు జాబితా, ఆవ్యాసానికి ఉప పుటగా ఉంచి జాబితాకు వ్యాసంనుండి ఒక లింక్ ఉంచితేనే బాగుంటుందని నా అభిప్రాయమ్ మరియు మనవి.--SIVA 18:53, 1 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • Svrangarao ఆ రెండు ఉప వ్యాసాలనూ ప్రధాన వ్యాసంతో కలిపివేసి "శివ గారు, మీరు ఒక మంచి వ్యాసాన్ని చాలా అసంబద్దంగా తీర్చిదిద్దారు. నేను మళ్ళీ దానిని సరి దిద్దాను. ఇంకొకసారి మార్పులు చేసే ముందు దయచేసి ఇతర వ్యాసాలను పరిశీలించమని కోరుతున్నాను." అని వ్రాశారు.

సభ్యుని అభ్యంతరం

[మార్చు]

ఇందుకు SIVA అభ్యంతరం తెలిపారు - కారణాలు (1) చర్చా పేజీలో తాను కారణం చెప్పినా గాని లెక్క చేయకుండా, వివరణ ఇవ్వకుండా ఉప వ్యాసాలు తొలగించడం (2) దురుసుగా, కటువుగా వ్యాఖ్యలు చేయడం

కాసుబాబుగారూ, ఈ కామెంటును చాలా బాధగా వ్రాస్తున్నాను. రంగారావుగారు, ఈ కింది వ్యాఖ్య చేసి నాకు మనస్తాపం కలిగించారు. --.... -
నేను వారికి ఈ కిందివిధంగా జవాబు వ్రాశాను:రంగారావుగారూ! నమస్తే. నేను అసంబంద్ధంగా తీర్చి దిద్దాను అని అరోపణ చేసారు కాని, నెను చేసిన మార్పులు ఏవిధంగా అసంబద్ధమో వ్రాయలేదు. దయచేసి తెలియ చేయమని మనవి
నేను సినీ నటుడు S.V.RANGARAO గురించి ఉన్న వ్యాసాన్ని కొంత సరిచేసాను. ఆ పనిలో ఒక పేతికను అమర్చాను, వారి చిత్రాలను వేరొక పేజీకి మార్చాను, బాపు చమత్కార భాషణను, వ్యాసానికి ఆరంభంలో ఉంచాను. తరువాత వ్యాస విషయాలు ఒక పద్దతి ప్రకారం కూర్పు చేసాను. ఈ మాత్రానికి, రంగారావుగారు పై విధంగా స్పదించి నేను చెసిన మార్పులు "అసంబద్ధంగా" తీర్చి దిద్దానని వ్యాఖ్య చేసారు. నేను చేసిన ఏ మార్పు అసంబంద్ధం?? నేను అమర్చిన పేటిక అలాగే ఉంచారు, చిత్రాల జాబితా table format లో ఉంచారు(నేను చర్చలో స్పందిచిన ప్రకారం,ఇలా చేస్తే వ్యాస నిడివి అసహజంగా పెరగకుండా కొంతవరకు కాపాడవచ్చు, 2వ పేజీ ఏర్పరచటంఇష్టంలేకపోతే).
నేను చిత్రాల జాబితాను వేరొక పేజీకి మార్చినప్పుడు, మీరు చూచి, అలా అవసరమా, చర్చించండి అన్నారు. నేను, నా స్పందన వెంటనే, చర్చా పేజీలో వ్రాసాను. ఇప్పుడు చూస్తే, నేను వ్రాసిన స్పందన చర్చా పేజీలో లేదు, రెండు పేజీలు ఒకటిచేసారు. సరే, మీరు నిర్ణయించి రెండుపేజీలు ఒకటి చేసారు అనుకుందాము, ఈ మాత్రానికి చర్చకు ప్రదిపాదించటం దేనికి? ఇతర సభ్యులు ఎవరూ కూడా స్పందించకుండానే ఎక పక్ష నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? OK రెండు పేజీలు ఒకటి చేసారు. ఈ విషయం మీద నా స్పందన చర్చా పేజీలో నుండీ తొలగించటం దేనికి?(ఎవరు తొలగించారో నాకు తెలియదు)
తరువాత, వికీ లో వ్యాసం వ్రాసినప్పుడు, ఇతరులు ఆ వ్యాసాన్ని "EDIT" చేస్తారు, చెయ్యచ్చు అన్న విషయం మౌలికమయినది (basic)కదా. ఒకవేళ ఇతరులు చేసిన మార్పులు నచ్చకపోతే, చర్చించాలి, ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవాలి, లేదా ఆ మార్పును నిశ్శబ్దంగా తిరిగి మార్చుకోవాలి. ఇతరులు చేసిన మార్పుల గురించి ఇలా దురుసుగా, కటువుగా వ్యాఖ్యలు చెయ్యటం సమంజసమా?? మీరు దయచేసి ఈ విషయం పూర్తిగా పరిశీలించి తెలుపగలరు. ఈ విషయం ఎవరికి ఫిర్యాదు చెయ్యలి కూడా తెలియ చేయగలరు.
నా ఉద్దేశ్యం, ఎవరూ కూడా ఆవతలి వారిని బాధ పెట్టే వ్యాఖ్యలు చెయ్యకూడదని. నలుగురూ కూడి చెయ్యవలసిన పని ఇది. చివరకు అందరికి అమోదయోగ్యమయినది నిలుస్తుంది. మార్పు చేసినవాళ్ళమీద దురుసుగా వ్యాఖ్యలు చెయ్యటం తగదు అన్న విషయం సభ్యుడి/ల కు తెలియాలి. నేనుకూడా అంత కటువుగా జవాబు వ్రాస్తే బాగుండదుకదా! అందుకనే నేను ఈ విషయం ఇతర సభ్యులకు తెలియచేసినది. ఈ సంఘటన పర్యవసానం మాత్రం, ఎవరినీ కించపరచకుండా ఉండాలి.రచనలు చేసే సభ్యులు, ఇతర సభ్యులు చేసే మార్పులను గౌరవించగలగాలి, అవసరమయితే చర్చ చెయ్యాలి, వ్యాఖ్యలకు చోటు ఉండకూడదు అని నా అభిప్రాయమం దయచేసి పూర్తిగా పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకొని, నాకు తెలియచేయగలరు.--SIVA 19:52, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
వికి మధ్యవర్తిత్వంలో ఈ కింది విధంగా ఉన్నది - "వివాద పరిష్కారానికి ఉత్తమ మార్గం, అసలు వివాదం తలెత్తకుండా చూడడమే. ఇతరులను, వారి అభిప్రాయాలను గౌరవించండి. అంటే, ముఖ్యంగా వివాదంలో ఉన్న పేజీలో మార్పుచేర్పులను వెనక్కు తీసుకెళ్ళకండి. ఏదైనా దిద్దుబాటు పక్షపాతంగానో, అనుచితంగానో ఉందని మీకు అనిపిస్తే, దాన్ని మెరుగు పరచండి; వెనక్కి తీసుకుపోవద్దు. ఇతర సభ్యులు అభ్యంతరం చెబుతారనుకున్న దిద్దుబాట్లకు సముచితమైన దిద్దుబాటు సారాంశాన్ని రాయండి". ఈ నిబంధనను రంగారావు గారు అతిక్రమించారు. అందుకనె, నేను మీ దృష్టికి తీసుకుని వచ్చాను. అదే నిబంధనలో ఈ విధంగా కూడా ఉన్నది "అనుచితమైన ప్రవర్తనను గమనించినపుడు మీరూ అదే పద్ధతిలో స్పందించకండి". అందుకని, నేను మళ్ళీ ఆయన చేసిన దిద్దుబాటును, సవరించలేదు, గమనించగలరు. కాబట్టి, దయచేసి,ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించగలరు, తద్వారా మళ్ళీ వికీలో నా ఉత్సాహాన్ని పునరుద్ధరించగలరు.--SIVA 00:04, 19 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా సూచన

[మార్చు]

(సభ్యులు:కాసుబాబు సూచన)

మొదటగా వ్యాసం గురించి

ఇప్పుడు పరిశీలిస్తే వ్యాసం బాగానే ఉంది. షుమారు 20 కిలోబైట్ల నిడివి ఉంది. ఇంకా వ్యాసాన్ని పెంచాలంటే అప్పుడు విభజించుకోవచ్చు.

చర్చ పూర్తి కాకుండానే విలీనం చేయడం గురించి

వికీలో ఇంతకుముందు ఇటువంటి అభ్యంతరాలు వెలువడలేదు. కనుక ఈ విధమైన రియాక్షన్‌ను ఊహించి ఉండకపోవచ్చును. (వ్యాఖ్యలు తొలగించడంలో మరేదో పొరపాటు జరిగినట్లనిపిస్తున్నది. అది పరిశోధించడం అనవుసరమని వూరుకొన్నాను)

దురుసుగా వ్యాఖ్యానించడం గురించి

"అసంబద్ధం" అన్నపదం illogical అన్న అర్ధంలో వాడబడిందనుకొంటాను. వ్యాఖ్యానించిన వారి ఉద్దేశ్యం అది కాకపోయినా ఎదుటివారిని నొప్పించింది కనుక ఇది అవాంఛనీయమే.

నా విన్నపం

జరిగిన విషయాలు గమనించి ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయమని కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:07, 19 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శివ స్పందన

మీరు కూడా illogical అనే ఆంగ్ల పదానికి సరయిన తెలుగు పదం వ్రాయక పోవడం వలన ఏదో అపార్థం వచ్చిదన్నట్టు ధ్వనించేట్టుగా వ్రాశారు. నా అభిప్రాయము, వికీపీడియాలో ఏ సభ్యుడైన కూడ స్వతంత్రముగా వ్యాసాలకు మార్పులు ఛేయవచ్చు, అటువంటి మార్పులమీద వ్యాఖ్యలు చెయ్యాల్సిన అవసరం ఏమిటి? చేసిన మార్పులు బాగాలేదనుకున్నపుడు, ఆ సభ్యుడితో చర్చించాలి, లేదా ఆ మార్పుని సరి చెయ్యాలి, అంతేకాని, ఇతర సభ్యులు చేసిన మార్పులమీద వ్యాఖ్యలు చేయటం ఎంతమాత్రము సమంజసం కాదు, వికీపీడియా స్పూర్తి అంతకంటే కాదు.

నా ఉద్దేశ్యము కూడా ఈ విషయాన్ని సాగదీయాలని కాదు. వికీపీడియా స్పూర్తిని అందరు సభ్యులూ అర్థం చేసుకోవాలని నా తపన. అంతకంటే ఏమీలేదు.--SIVA 17:15, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలలో రచనలు/చిత్రాల జాబితాలు

[మార్చు]

నటులు, రచయితల గురించి వ్యాసాలు వ్రాసినప్పుడు, వారు నటించిన లేదా వ్రాసిన పుస్తకాల గురించి మనం తప్పనిసరిగా వ్రాయవలసి ఉంటుంది. కాని, వారి సినిమాలు లేదా నవలల/కథల జాబితా వ్యాస భాగంగా ఉంచితే, వ్యాసపు నిడివి అసహజంగా పెరిగి, చదవటానికి(ముఖ్యంగా కంప్యూటర్ తెర మీద)అంత వీలుగా ఉండదు. ఒక్కసారి, ఆలోచించండి, రచయిత చలం గురించిన వ్యాసం ఒక వార పత్రికలో మనం చదువుతుంటే, మొత్తం 3 పేజీల వ్యాసంలో, 2 పేజీలు ఆయన వ్రాసిన కథల/నవలల జాబితాకే పోతే బాగుంటుందా!! మనకు కంప్యూటర్లో జాబితా మొత్తం వేరొక చోట ఉంచి, వ్యాసం చదివేవారు అవసరమనుకున్నప్పుడు మాత్రమే ఆ జాబితా కనబడేట్లు చేసే చక్కటి అవకాశం వదులు కోవటం అంత సమంజసం అని నాకనించట్లేదు. కాబట్టి నటుల,రచయితల సినిమా/పుస్తకాల జాబితాలు, వారిగురించిన వ్యాసాలతో విలీనం చేయ వద్దని మరియు జాబితా, ఆవ్యాసానికి ఉప పుటగా ఉంచి జాబితాకు వ్యాసంనుండి ఒక లింక్ ఉంచితేనే బాగుంటుందని నా అభిప్రాయం మరియు మనవి

నా అభిప్రాయము ఈ విషయము మీద ఈ చర్చా పుటలోనే పైన ఉన్నది. ఈ విషయంమీద చర్చ జరగాలని నా అభిమతం. దయ చేసి ఇతర సభ్యులు స్పందించగలరు.--SIVA 17:15, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దీనిని గురించి ప్రత్యేకంగా విధానం అవసరమనిపించడం లేదు. చలం రచనల జాబితా, యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా, కొకు రచనలు - ఇలా వేరు వ్యాసాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. అభ్యంతరాలు కూడా ఏమీ లేవు. "వ్యాసపు నిడివి అసహజంగా పెరిగి, చదవటానికి(ముఖ్యంగా కంప్యూటర్ తెర మీద)అంత వీలుగా ఉండదు." - అసహజంగా వ్యాసం నిడివి పెరగకూడదనేదే ఇక్కడ ముఖ్యవిషయం. కనుక ప్రధాన వ్యాసం పెరిగినపుడు మరో పేజీ చేయడం సామాన్యమే. "పేజి లోడింగ్"లో ఇబ్బంది రాకుండా. కాని అది ఒక నియమం కానక్కరలేదు. కంప్యూటర్‌లో మరో లింకు నొక్కడం ఎంత పనో "పేజ్ డౌన్" నొక్కడమూ అంతే పని. కనుక ప్రతి నటునికీ వారి సినిమాల జాబితా వేరే వ్యాసంగా ఉండాలని నేను అనుకోవడం లేదు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:31, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మరోసారి ఈవారం వ్యాసం

[మార్చు]

2019 మార్చి 4 ఉదయానికి కొత్త ఈవారం వ్యాసం కావాల్సివుండగా, 10వ వారం ఖాళీగా ఉంది. ఇదొక అత్యవసర స్థితి. కాబట్టి ప్రతిపాదించకుండా నేరుగా దీన్ని స్వీకరించాను. అలానే ఈ వ్యాసం 2009లో ఒకసారి మొదటి పేజీలో ప్రదర్శించారు. గత ఏడాది దీన్ని వాడుకరి:రవిచంద్ర చాలా మెరుగుపరిచారు. కాబట్టి ఈ మెరుగుదల కారణంగా మరోసారి ప్రదర్శించడం సబబైనదేనని ఈ నిర్ణయం తీసుకున్నాను. సభ్యులు గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 07:07, 3 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఎస్.వి. రంగారావు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2019 సంవత్సరం, 11 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia