Jump to content

చర్చ:చందమామ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


చందమామ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 2 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
చందమామ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2006 సంవత్సరం, 18 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

చందమామ బొమ్మలు

[మార్చు]

త్రివిక్రం, మీరు చేర్చిన బొమ్మ సంస్కృత చందమామదే నంటారా?. నేను వ్యాసంలొ చేర్చిన agencyfaqs.com లింకులొ ఇంకొక బొమ్మ చూసాను. దాని మీద చందామామ ( ఒక ఆ కారం ఎక్కువ ఉంది). ఒక్క సారి సరి చూడండి Kiranc 12:56, 18 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ బొమ్మ నేను చేర్చింది కాదు. వైజాసత్య గారు చేర్చారు. అన్నట్లు పేజీ ఇప్పటికే పెద్దదైపోయింది. లోగో ఉంచి బొమ్మను తీసేయడం మేలేమో ఆలోచించండి. Trivikram 13:28, 18 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలను ఉంచండి, వ్యాసాన్ని రెండు బాగాలుగా విభజించి ఒక్కో బాగాన్ని ఒక్కో కొత్త వ్యాసంగా రాయండి. సినిమాలలో మనకు కనిపించేది నటులు, తెరవెనుక బోలెడంత సాంకేతిక వర్గం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా, ఒక వ్యాసంలో చందమామ కధల శైలి వివరిస్తూ ఇంకో వ్యాసంలో ఆ కధలను మలిచిన వారి గురించి రాయొచ్చేమో. లేదా ఇంకేదయినా మంచి ఆలోచనలతో వ్యాసాన్ని విభజించవచ్చు. అలాగే తెలుగు చందమామ ముఖచిత్రం కూడా చేరిస్తే బాగుంటుంది. అలాగే బేతాళ కథకు సంబందించి ఒక చిత్రం ప్రతీ సంచికలో ఒకే విధంగా ఉంటుంది. దానిని కూడా చేరిస్తే వ్యాసం ఇంకా బాగుంటుంది. అసలు నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ బొమ్మలు చేర్చిన కొద్దీ వ్యాసానికి మరింత నిండుతనం వస్తుంది. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:04, 18 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మ సంస్కృతముదో కాదో నాకు ఖచ్చితంగా తెలియదు ఏదో వెబ్‌సైటులో కనబడింది ఫెయిర్ యూజ్ కింద అప్లోడ్ చేశా. కానీ జూం చేసి చందమామ పైన చిన్న అక్షరాలు పరిశీలిస్తే సంస్కృత అని ఉంది అని అనిపించింది. అయినా బొమ్మలు వ్యాసము యొక్క నిడివిని పెద్దగా పెంచవు. కాబట్టి రెండు బొమ్మలు ఉంచొచ్చు. ఇక వ్యాసాన్ని ఎలా విభజించాలో అర్ధము కావట్లేదు. ప్రస్తుతము అది 32 కిలోబైట్లు ఉన్నది. అది అంత ఎక్కువేమీ కాదనుకుంటా. అయితే ఇంకొంచెము పెరిగితే మనము తప్పకుండా విభజించే మార్గాలు అన్వేషించాలి --వైఙాసత్య 16:04, 18 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగైతే ఇంకో 3 బొమ్మలు -బేతాళ కథల బొమ్మ; తెలుగు చందమామ, ఇంగ్లీషు చందమామ ల ముఖ చిత్రాలు చేర్చవచ్చు. మరి ఫోటో ల మాటేమిటి? చక్రపాణి-నాగిరెడ్డి, కొ.కు. ల ఫోటోలు పెడదామా వద్దా? వ్యాసం (text) ఇంకో 10-15% పెరగ వచ్చు. ఫర్వాలేదంటారా? Trivikram 18:56, 18 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]
వారు ముగ్గురు కలిసి ఉన్న ఫొటో అయితే పరవాలేదు. లెకుంటే వద్దు , irrelevant గా ఉంటుంది అని నా అభిప్రాయం--Kiranc 04:23, 19 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్రకారుల విభాగములో ఉన్న తెలుగు చందమామ ముఖచిత్రాన్ని వివిధ భాషా సంచికల విభాగంలోకి మర్చానండి. అది అక్కడ ఐతే relevantగా ఉంటుంది అని నా అభిప్రాయం. చిత్రకారుల sectionలోకి మంచి strikingగా ఉండే చిత్రాన్ని ఎదైనా పెడితే బాగుంటుంది. ఇంగ్లిషు పత్రిక ముఖచిత్రము అంత బాగోలేదు. కొంచం పెద్దది పెడితే బాగుంటుంది -- Kiranc 04:36, 20 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

విశేషవ్యాసంగా..

[మార్చు]

విశిష్టమైన వ్యాసమిది. వచ్చే సోమవారం నాడు - ఏప్రిల్ 24న - విశేషవ్యాసంగా పెడదాం! __చదువరి (చర్చ, రచనలు) 07:20, 20 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ లోపల బేతాళ కథల బొమ్మ సంపాదించాలి. అది ఉంటేనే నిండుదనం వచ్చేది. - Trivikram 07:27, 20 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

చాల చక్కటి ఆలోచన. నేను బేతాళ కథలు చిత్రాన్ని చేర్చాను. ఇంక ప్రస్తుత సంపదకుడూ విశ్వం చిత్రం కూడ ఉంది .అది కూడా పెడదామంటారా?. Kiranc 11:09, 20 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

నా దగ్గర బెతాళ కధ మొదటి కథ ఉన్నది. అంటె అసలు విక్రమార్కుదు అలా శవం భుజాన వెసుకుని శ్మశానంలొ యందుకు వెళతాడు అన్న విషయం చెప్పబడినది. ఈ మొట్ట మొదటి బెతాళ కథను చందమామ 25 సం.లు పూర్తి చెసుకున్న శుభ సందర్భముగా, 1972 జులె నెలలొ ప్రచురించినారు. మీరు వ్రాయబొయె వ్యాసమునకు ఉపయొగమనుకుంటె స్కాను చెయించి అప్లొడ్ చెయగలను.--SIVA 09:26, 9 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

విశేష వ్యాసములకు ఆంగ్ల వికిలో లాగా కాంస్య తార ఎలా పెట్టవచ్చు? --వైఙాసత్య 13:46, 20 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసం చివరన {{విశేషవ్యాసం|ప్రచురించిన తేదీ}} చేర్చండి. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 18:11, 20 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్తిగా రంగుల్లో

[మార్చు]

చందమామలో అన్ని పేజీలూ పూర్తిగా రంగుల్లో రావడం (multi colour) 1980 ప్రాంతాల్లో మొదలైంది. సంవత్సరం, నెల ఎవరికైనా గుర్తున్నాయా? త్రివిక్రమ్ 00:56, 23 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటిసారి చందమామ అన్ని కధలకు రంగుల బొమ్మలు (అంతకు ముందు 2 రంగులు మాత్రమె ఉండెవి)1972 జులె 25 సం.లు పూర్తయిన సందర్భంగా వేసినారు. ఆ తరువాత 1980 ప్రాంతాలలో అన్ని బొమ్మలకు రంగులు పులమటం మొదలెట్టారు. కాని, అంత బాగాలేవు. --SIVA 09:26, 9 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

60 వసంతాల చందమామ

[మార్చు]

చందమామ 60 వసంతాలు పూర్తి చేసుకుంతున్న సందర్భంగా. కొంత విషయం , మరి కొన్ని అరుదైన బొమ్మల్ని చేర్చాను Kiranc 13:12, 29 ఆగష్టు 2006 (UTC)


చాన్నాళ్ళ తర్వాత తిరిగొచ్చి చాలా మంచి పని చేశారు కిరణ్! నేనూ అనుకోకుండా రీడిఫ్ వెబ్‌సైట్‌లోని ఆ వ్యాసాన్ని నిన్న రాత్రే చూశాను. ఈ రోజంతా తీరిక లేకపోవడం వల్ల ఆ సమాచారాన్ని ఇక్కడ చేర్చలేకపోయాను. మీరు చేర్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

-త్రివిక్రమ్ 13:47, 29 ఆగష్టు 2006 (UTC)


ఈ మధ్య ఎవరో సభ్యుడు తమిళం మరియు ఇంగ్లిషు ఇంటర్వికి చేర్చాడు. నేను ఆ వ్యాసాల్ని చూసాను. ఇంగ్లిషు ఘొరం (4 లైన్లకు మించి లేదు). తమిళంలొ ఏదో విషయం ఉన్నట్టు కనపడుతున్నా, మన వ్యాసం కాలి గొటికి కూడ సరిరాదు. తమిళం వచ్చినవారు ఎవరైనా ఉంటే ఆ వ్యాసంలో కొత్త విషయాలు ఏమైనా ఉంటే తెలుగు వ్యాసం లో చేర్చగలరు.

Kiranc 01:56, 30 ఆగష్టు 2006 (UTC)


పాత చందమామ ప్రతులు

[మార్చు]

పాత చందమామ ప్రతులను మొదటి సంచిక నుండి, తిరుపతి తిరుమల దెవస్తానంవారు స్కాను చేసి భద్రపరచి సామాన్య ప్రజలకు అందుబాటులొకి తెస్తున్నారని వార్త వచ్చినది. ఈ పని జరిగినదా, జరిగితే, ఈ స్కాన్ చేసిన పాత చందమామ సంఛికలు మనకు దొరుకుతాయా, దొరికితె యెక్కడ, వాటి ధర యెంత వంటి వివరాలు, తెలిసినవారు చెప్పగలరు.--Vu3ktb 17:39, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగె,యెవరి దగ్గరయినా పాత చందమామ ప్రతులు 1947 నుండి 1980 వరకు ఉండి, అవి సెకరించె నా లాటి వారికి దొరుకునా(ఇద్దరకు అంగీకారమయిన ధరతొనె)--Vu3ktb 17:44, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


స్చాన్ చెయ్యబడిన చందమామలు ఈ క్రింద ఉన్న లింక్ లో "వెతుకులాట" ఫలితాలుగా వస్తున్నయి, కానీ వీక్షించటానికి రావటంలేదు. కారణం తెలియదు. ఈ విషయాల గురించి, సాంకేతికంగా బాగా తెలిసిన సభ్యులు దర్యాప్తు చేసి తెలుపగలరు.

http://dli.iiit.ac.in/cgi-bin/Browse/scripts/use_scripts/advnew/advsearch_db.cgi?listStart=0&url=online&title1=chand&author1=&subject1=Any&language1=Any&sourcelib=Any&year1=&year2=&search=Search&perPage=25

--SIVA 08:00, 22 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]



చందమామ ధారావాహికలు

[మార్చు]

శిధిలాలయం ధరావాహిక నా దగ్గర దాదాపు పూర్తిగా ఉన్నది.ఈ ధారావాహికం గురించి కొంత వివరాలు వ్రాయవఛ్ఛునా. ఈ ధారావహికకు సంబంధించిన బొమ్మలు కూడ ఉన్నయి, అవి అప్లొడ్ చెయ్యలని ఉన్నది. దయచెసి తెలియచెయగలరు.--Vu3ktb 17:31, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


చందమామలొ ధారావాహికలు యెంతగానొ ప్రసిద్ది చెందినాయి. ముఖ్యంగా 1960 నుండి 1979-80 వరకు. 1980 దశకం మొదలయొటప్పటికి చందమమలొ ధారావాహికలు తిరిగి పాత వాటినె ముద్రించటం మొదలుపెట్టారు. చిత్రా, చక్రపాణీ, కొడవటి కుటుంబరావు, వడ్డాది పాపయ్య లాంటి హెమాహెమీలు కాల క్రమాన స్వర్గస్తులయీనారు. వారు లెని లొటువలన చందమామ కూడా గతించటం మొదలయయ్యింది, చివరకు ఏదొ కార్పొరెటు పాలయ్యింది. ఇక చందమామకు పాత ప్రాభవం రావటం దాదాపుగా అసాధ్యం,1960-1975 మధ్య చిన్న పిల్లలుగా ఉన్నవారు గుర్తుంచుకున్న చందమామ మరల రాదు.ఈ విషయం నెను ఏంతొ బాధతొ చెప్తున్నను(కంటి నీటి పర్యంతంగా).


ఆ పాత ప్రాభవం ఇప్పటి వారికి తెలియటంకొరకు, మరియు అప్పటి వారి తీపి గ్నాపకాల సంరక్షణకొరకు, చందమామలొ వచ్చిన ధారావాహికలు తొకచుక్క దగ్గరనుండి యక్షపర్వతంవరకు, అరణ్య పురాణం, పంచతంత్రం,శివపురాణం మొదలగు ధారావాహికల గురించి గుర్తుంన్నంతవరకు సభ్యులు వ్రాయటం మొదలు పెట్టితె ఆ ఏంతొ బాగుంటుది అని నా అభిప్రాయం. దానికొరకు తె-వికిపీడియాలొ ఒక ప్రత్యెక పుట ఏర్పరిచితె బాగుంటుంది.ఆలొచించండి.నాకు గుర్తు ఉన్నంతవరకు చందమామలొని ధారావాహికలు (1960 నుండి 1980వరకు)ఈ క్రింది విధంగా ఉన్నాయి:


తొక చుక్క, మకరదెవత, ముగ్గురు మాంత్రీకులు, రాకాసి లొయ, దుర్గెశ నందిని, నవాబు నందిని, పాతాళ దుర్గం,శిధిలాలయం,రాతిరధం,యెక్ష పర్వతం అరణ్య పురాణం,శివపురాణం,శివలీలలు, పంచతంత్రం,మహా భారతం, భాగవతం, రామాయణం,దెవి భాగవతం,భారత ఛరిత్ర, నెహ్రూ కథ, మరియు ఇతర చిన్న ధారా వాహికలు-సింద్ బాదు యాత్రలు, మాయదారి ముసలిది, భూతాలు ఛెసిన పెళ్ళీ, పరొపకారి పాపన్న కథలు, బండ భీమన్న కధలు, తాతయ్య కధలు, యింద్రజాలిక కధలు మొదలగునవి. ఈ పెన పెర్కొన్న ధారావాహికలలొ కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఇతర సభ్యులు ఈ ధారావాహికలు ఉన్నవారు వాటి గురించి వ్రాసి 1 లెక 2 చిత్రములుకూడా జతపరిచినచొ చందమామ యెక్క గొప్ప చరిత్ర రాబొయె తరాలవారికి తెలెయచెప్పచ్చు అని నా అభిప్రాయము. ఇతర సభ్యులు కూడా స్పందించి వారి అభిప్రాయాలు కూడా ఈ ఛర్ఛావెదిక మీద తెలియపరిచినట్లయితె, ఈ చక్కటి పని మొదలుపెట్టవచ్చును--SIVA 03:40, 9 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


తప్పకుండా వ్రాయవచ్చును. కాని బొమ్మలు అప్‌లోడ్ చేయడంలో కాపీ హక్కుల గురించి కొంత ఆలోచించాలి. ఉచితమైన కాపీ హక్కులు కలిగిన చిత్రాలు లభించక పోతే గనుక ఒకో వ్యాసానికి ఒకటి రెండు బొమ్మలు మాత్రం "Fair Use" Rationale క్రింద వాడుకొనవచ్చును. ఎవరైనా చందమామ మేనేజిమెంటును సంప్రదించగలిగితే వారి బొమ్మలు మనకు ఒక పెన్నిధిలా లభించవచ్చును.
అంతే గాకుండా సంబంధించిన అన్ని వ్యాసాలు ఒక ప్లాన్ ప్రకారం (వాటి పరిధీ, తీరూ, తెన్నూ) అభివృద్ధి చేసుకొంటే బాగుంటుంది. వ్యాసం వ్రాయడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేస్తాను. ఒక పది రోజులు సమయం ఇవ్వండి.
నేను కూడా మస్కట్ రాకపూర్వం వరకు (అంటే 1994కు ముందు) చందమామ కొనడం ప్రతినెలా జీతంలో చేసే మొదటి ఖర్చుగా ఉండేది. కాని నేను ఏమీ సేకరించలేదు. శివరామ్ గారూ! చందమామ ప్రతులను సేకరించి చాలా మంచి పని చేశారు. భద్రం సుమీ! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:10, 9 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు కాసు బాబుగారూ!!

నెను విజయవాడ(మా జన్మస్తలం)లొ ఉన్న సమయంలొ 1974-1977 లొ ఒక ఉద్యమంలాగున నాకు మా నాన్నగారు రొజూ ఇచ్చె పొకెట్ డబ్బులతొ చాలా పాత చందమామలు పొగుచెసాను. వాటిని ధారవహికలు,కథలు విడివిడిగా చెసి మళ్ళీ కుట్టించాను.

నా ఉద్దెశ్యం ప్రకారం చందమామ ధారవాహికలకు ఒక ప్రత్యెక పుట తయారు చెసి అందులొ ధారావాహికకు ఒక ఉప పుట ఉంచి వ్యాసాలు రాసినచొ బాగుండునని నా అభిప్రాయం. అలొచించి చెప్పగలరు.--SIVA 09:26, 9 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అత్యున్నతమయిన ఈ వ్యాసం కొంచెం గజిబిజిగా ఉన్నదనిపిస్తున్నది. 'ధారావాహికల జాబితా' 'కథా స్రవంతులు' 'చిన్న ధారా వాహికలు' లాంటివి వ్యాసం మొదట కాకుండా మధ్యలో లేదా చివర ఉంటే బాగుంటుంది. ఏమంటారు? --Svrangarao 16:59, 15 మార్చి 2008 (UTC)

శివగారు, మొదటి అంకంలోనే 4 బొమ్మలు ఉండడంతో కాస్త గజిబిజిగా తయారయింది. అందుకే ప్రస్తుతానికి బొమ్మలను మరిన్ని అంకాలలోకి విస్తరించాను. మీ సూచనలు తెలుపగలరు. --Svrangarao 03:40, 17 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ మార్పు చాలా బగున్నది రంగారావుగారూ. ధన్యవాదములు. చందమామకు సంబంధించిన బొమ్మల మాలిక ఒకటి తయారు చేసి, ఒక ఉప పుటలో పెడితే ఎలా ఉంటుంది(ముఖ్య పుటనుండి అక్కడకు లంకె తో). దయచేసి, మీ అలోచన తెలియచేయగలరు.--SIVA 01:37, 18 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శివగారు, కేవలం బొమ్మలకే ఒక వ్యాసం సృష్టించడం గురించి ఖచ్చితమయిన నిర్ణయాన్ని చెప్పలేకపోతున్నాను. విషయం తెల్పుతూ బొమ్మలు చూపెడితే ఆకర్షణీయంగా ఉంటుంది లేదా వ్యాసం చివరలో 'గ్యాలరీ'లో పెట్టినా బాగుంటుంది. ఉదాహరణకు యల్లాయపాళెం చూడండి. బొమ్మల కాపీ హక్కుల గురించి నిర్వాహకులతో చర్చించడం మంచిది. --Svrangarao 01:47, 18 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
 సభ్యులపై చర్చ:కాసుబాబు నుండి క్రింది చర్చను ఇక్కడికి కాపీ చేస్తున్నాను.


చందమామ

[మార్చు]

కాసుబాబుగారూ! నమస్తే. నేను చందమామ పుటలొ చాలా విషయాలు వ్రాసాను, కొన్ని మార్పులు కూడా చేసాను. దయచేసి చూసి మీ అభిప్రాయం తెలుపగలరు.--SIVA 09:43, 16 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు కాసుబాబుగారూ. చందమామ నా చిన్నప్పటి నుండి నా నేస్తం. అటువంటి చక్కటి పత్రిక మళ్ళీ ఇంతవరకు చూడలేదు. కానీ అటువంటి పత్రికయేక్క ప్రస్తుత పరిస్తితి చూస్తె చాలా బాధగా ఉన్నది. ఇద్దరు, ముగ్గురు కలసి చందమామను చక్కటి స్తాయికి తీసుకుని వెళ్ళారు(1950-1970 ల మధ్య). అలాగే చందమామ మీద ఆసక్తి తో మనస్సు పెట్టి ఆ పత్రిక ప్రాభవాన్ని తిరిగి తేగలిగే వారు ఆ సంస్తకు దొరికితే మన అద్రుష్టం. మీ సూచనలకు ధన్యవాదములు. చందమామ పేజీ విస్తారమయిందని హెచ్చరిక వస్తున్నది, 2వ పేజీకి తీసుకుని వెళ్ళమని సూచన కూడ ఉన్నది. దయచేసి, వ్యాసమును 1 పేజీ నుండి 2 పేజీలకు చెయ్యటం ఎలాగొ చెప్పగలరు.ధారావాహికల జాబితా కు ఒక లింక్ పెట్టి జాబితాను ప్రత్యేక పుటలో ఉంచాను, అక్కడనుండి ప్రతి ధారావాహికకు ఒక్కొక్క ప్రత్యేక పుటకు లింక్ ఏర్పరిచాను. చూసి మీ సూఛనలు ఇవ్వగలరు.నేను ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్లు నాకేమీ అనిపించట్లేదు. నేను వ్రాసిన మార్పులు, వ్యాస భాగలలొ అక్కడయినా ఎమోషనల్ అయ్యి వ్రాయబడినట్లు అనిపిస్తే తెలియచేయగలరు. తగిన మార్పు తప్పకుండా మీ సూచన అనుసరించి చెయ్యగలను.చందమామ పుట పూర్తి సమగ్రంగా తయారు కావాలన్నదే నా అకాంక్ష.చందమామ ధారవాహికలన్నిటికి(నాకు గుర్తున్నంతవరకు)ప్రత్యేక పుటలు ఎర్పరిచాను(ముఖ్య పుటనుండి లింక్ లతొ).అభిరుచిగల సభ్యులకు ఈ ధారావాహికల గురించి వ్రాయుటకు ఒక ఆహ్వానము, వికీపీడియా ద్వారా పంపగలమా??--SIVA 01:27, 17 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అభిప్రాయం చెప్పగలరు

[మార్చు]
  1. చందమామ పుటను రెండు పుటలుగా మారిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇప్పటికే చాలా పెద్దది ఐపోయింది, మర్చేటప్పుడు హెచ్చరిక వస్తున్నది. దయచేసి చెప్పగలరు.--SIVA 07:23, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  2. బేతాళ కథల గురించి వ్యాసం కొంతవరకు పూర్తి చేసాను. నా దగ్గర ఉన్న బొమ్మలు జత పరిచాను.చందమామ పుటనుండి లింక్ ఉన్నది. దయచేసి చూసి, మీ అభిప్రాయం, సూచనలు చెప్పగలరు.--SIVA 20:04, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
శివా! చందమామ వ్యాసం ప్రస్తుతం ఉన్నంత వరకయితే అలా ఉంచడమే మంచిది. ఇంకా పొడిగించాలంటే విభజిద్దాము. పరిశీలిస్తాను. బేతాళ కథలు లేదా భేతాళ కధలు - ఏది సరైన పేరు? ఒకమారు చందమామలో ఉన్న సరైన స్పెల్లింగ్ చూసి చెప్పండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:35, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • కాసుబాబుగారూ! సరైన పేరు బేతాళకథలు. బేకు వత్తు లేదు.
  • నాకైతే వ్యాసం, మరి కొద్దిగా వ్రాదామనే ఉన్నది

-చందమామలో పురాణ ధారావాహికలు,అరణ్యపురాణంగురించి, పంచతంత్రంగురించి, చిత్రకారుల విభాగంలో వారు వేసిన బొమ్మల మాలిక ఏర్పరచటం మొదలగునవి నా ఆలోచనలో ఉన్నాయి.--SIVA 12:14, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి వ్యాసంగా అభివృద్ధి చేయవచ్చు

[మార్చు]

స్వరలాసిక గారూ ఈ వ్యాసం ఆరంభస్థాయి దాటిన వ్యాసంగా పరిగణించవచ్చు. పైగా వ్యాసంలో చాలా విస్తారమైన సమాచారం, ఎన్నో మూలాలు ఉన్నాయి. ఐతే ఈ వ్యాసంలో భాష పత్రికను కీర్తిస్తున్నట్టుగా ఉంది. చందమామ లాంటి పత్రికను గురించి మరోలా రాయలేరని భావించినా, ఒక తటస్థ స్వరంతో ఇదీ విషయం అని ఫ్యాక్ట్స్ చెప్పి ఊరుకోవడం ఇంకా మంచి విధానం. ఇక వ్యాసం చివర్లో బయట వ్యాసాలకు లంకెలు ఇచ్చినా, ఇన్లైన్ రిఫరెన్సులు(ప్రతి వివరాన్నీ నిర్ధారించే మూలాలు) లేవు. వీటిని సరిజేస్తే వ్యాసాన్ని మంచి వ్యాసంగా ప్రతిపాదించి, మరో సభ్యుని రివ్యూ ద్వారా నిర్ధారించవచ్చు. ఈ ప్రాసెస్ ప్రయత్నిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 11:13, 1 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మరల ఈ వ్యాసం పరిగణన

[మార్చు]

23 April 2006‎ లో ఈ వ్యాసంగా పరిగణించిన ఈ వ్యాసంలో అనేక మార్పులు చేయబడి, శుద్ధి చేయబడి, సుమారు 25000 బైట్ల సమాచారం చేర్చబడి మంచి వ్యాసంగా రూపొందినందున దీనిని మరల ఈ వారం వ్యాసంగా పరిగణించాను.--కె.వెంకటరమణచర్చ 15:57, 26 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]