చర్చ:ముడివేముల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యర్రా రామారావు గారూ, పవన్ సంతోష్ గారూ, ఈ పేజీ, ముడివేముల పేజీ రెంటినీ ఒకే సమాచారంతో విస్తరించారు. నేను గమనించినవేంటంటే..

  1. గతంలో ఈ పేజీల్లో సమాచారమేమీ లేదు. అంటే జనగణన వారి వద్ద అసలు సమాచారం ఉందా లేదా అనేది సందేహంగా ఉంది.
  2. విస్తరణలో చేర్చిన సమాచారం రెండిట్లోనూ ఒక్కటే. రెండూ ఒకే గ్రామానికి చెందిన పేజీలా అనేది నా సందేహం.
  3. చేర్చిన సమాచారానికి మూలాలివ్వలేదు. కానీ ఆ సమాచారాన్ని ముదిగొండ శివప్రసాద్ రాసిన ఒక చారిత్రిక నవల (పేరు గుర్తు లేదు) నుండి సేకరించారేమోనని సందేహంగా ఉంది. ఒకవేళ అదే అయితే, ఈ సమాచారం సందేహాస్పదమే. ఎందుకంటే ఆయన రాసినది చారిత్రిక కల్పన (చరిత్రను ఆధారంగ చేసుకుని రాసిన కాల్పనిక నవల) గానీ, చరిత్ర కాదు.

మీరు ఈ పేజీలను పరిశీలించి, ఈ సమాచారం ఉంచవచ్చా, ఈ పేజీలను విలీనం చెయ్యొచ్చా అనే విషయాలపై తగు సూచనలు చెయ్యవలసినదిగా వినతి. __చదువరి (చర్చరచనలు) 04:30, 17 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చదువరి గారూ ఇది రెవెన్యూ గ్రామం కాదు.జనగణన సమాచారం లేదు. వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టులో మిగిలిన 314 గ్రామాలలో ఏ ఒక్క గ్రామం రెవెన్యూ గ్రామం కాదు.నేను ప్రతి ఒక్క దానిని పరిశీలించాను.వీటికి, ఇంకా మొలక స్థాయిదాటి మొలకల విస్తరణ ఋతువు 2020 పరిధిలోకి రాని గ్రామాలు తొలగింపు ప్రతిపాదనలుకు జాబితా తయారుచేసాను.దాని తదుపరి చర్యలు పెండింగ్ లో ఉన్నవి.దాని మీద ఇంకా దృష్టి పెట్టవలసిన పని ఉంది.ఇకపోతే త్రిపురాంతకం మండలం లో ముడి వేముల పేరుతో మూడు పేజీలు ఉన్నవి.రెండు ఒకటే సమాచారం ఉంది ఇటువంటివి అన్నీ నేను జిల్లాలు వారిగా శ్రీకాకుళం నుండి పరిశీలించుకుంటూ వస్తున్నాను.దానికి తగిన ఆధారాలు మూలాలు మండల వ్యాసంలో ఎక్కిస్తున్నాను.ప్రస్తుతానికి సమాచారం ముఖ్యమైంది అనుకుంటే ముడివేముల అనే పేజీ ఉంచి పాత ముడివేముల,కొత్త ముడివేముల రెండిటిని తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 07:08, 17 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పాత ముడివేముల, కొత్త ముడివేముల రెండు పేజీలు ముడివేముల పేజీకి విలీనం చేసాను.మూడు ఒకటే గ్రామం.--యర్రా రామారావు (చర్చ) 06:40, 21 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]