చిట్టెం నర్సిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిట్టెం నర్సిరెడ్డి

పదవీ కాలం
1985 - 1994, 2004 - 2005
నియోజకవర్గం మక్తల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జనతాదళ్
కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రాంరెడ్డి
జీవిత భాగస్వామి సుమిత్రారెడ్డి
రుక్మిణి దేవి
సంతానం ఇద్దరు కుమారులు (చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి),
ఇద్దరు కుమార్తెలు (డి.కె. అరుణ)
నివాసం మక్తల్‌

చిట్టెం నర్సిరెడ్డి (మరణం 2005 ఆగస్టు 15) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశాడు. జనతాదళ్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 1985, 1989, 2004లలో మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

జననం, విద్య

[మార్చు]

నర్సిరెడ్డి నారాయణపేట జిల్లా, ధన్వాడలో జన్మించాడు. ఆ తరువాత మక్తల్‌లో స్థిరపడ్డాడు. తండ్రి పేరు రాంరెడ్డి. ధన్వాడ, నారాయణపేటలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నాడు.[5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నర్సిరెడ్డికి ఇద్దరు భార్యలు (సుమిత్రారెడ్డి, రుక్మిణి దేవి). వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున మక్తల్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[6] కుమార్తె డి.కె. అరుణ రాష్ట్ర మంత్రిగా పనిచేసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

1978లో జనతా పార్టీ తరపున పోటిచేసిన నర్సిరెడ్డి, ఇందిరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసింహులు నాయుడు చేతిలో ఓడిపోయాడు. ఆ తరువాత 1985లో జనతా పార్టీ తరఫున పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసింహులు నాయుడుపై విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 1989లో జనతాదళ్ తరఫున పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసింహులు నాయుడుపై విజయం సాధించాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1999లో కాంగ్రెస్ తరపున పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్కోటి ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటిచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నాగూరావు నామాజీపై విజయం సాధించాడు.

మరణం

[మార్చు]

2015, ఆగస్టు 5 స్వాతంత్ర్య దినోత్సవం రోజున నారాయణపేటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక ఎస్సీవాడకు చేరుకున్న నర్సిరెడ్డి నక్సలైట్లు జరిపిన కాల్పులలో మరణించాడు. నర్సిరెడ్డితోపాటు అతని కుమారుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, గన్‌మెన్లు మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Makthal Election Result 2018 Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Retrieved 6 September 2021.
  2. "Maoists Murder Andhra MLA". www.arabnews.com. Retrieved 6 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Makthal bypoll: Narsi Reddy's son files papers". The Hindu. 18 November 2005. Retrieved 6 September 2021.
  4. Chittem Narsi Reddy Killed Case
  5. Eenadu (25 October 2023). "ప్రజాప్రతినిధుల వాడ.. ధన్వాడ". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  6. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 27 మే 2021. Retrieved 6 September 2021.
  7. The Times of India, India News (15 August 2005). "Naxals kill Cong MLA, 8 others". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 6 September 2021. Retrieved 6 September 2021.