Jump to content

చిలుకూరి దేవపుత్ర

వికీపీడియా నుండి
చిలుకూరి దేవపుత్ర

చిలుకూరి దేవపుత్ర అనంతపురం జిల్లాకు చెందిన కథా రచయిత. దళితుల జీవన చిత్రాలతో పాటు, కరువు, ఫ్యాక్షనిజం అణగారిన వర్గాల బతుకు కథనాలను కథలుగా మలిచి సీమ జీవితాన్ని ప్రపంచ పాఠకులకు తెలియచేసిన అద్భుత కథకుడు నవలాకారుడు చిలుకూరి దేవపుత్ర.

జీవితవిశేషాలు

[మార్చు]

ఇతడు 1952లో ఏప్రిల్ 24వ తేదీన అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలం కాల్వపల్లె గ్రామంలో జన్మించాడు[1].ఇతని తల్లి సోజనమ్మ, తండ్రి ఆశీర్వాదం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన దేవపుత్ర చాలా కష్టపడి 12వ తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత 1983లో జైళ్ల శాఖలో ఉద్యోగిగా చేరాడు. అటుతరువాత రెవెన్యూ శాఖలో పనిచేసి డిప్యూటి తహసీల్దారుగా పదవీ విరమణ చేశాడు.

రచనలు

[మార్చు]

ఇతని రచనలు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఇండియా టుడే, స్వాతి, రచన, ప్రస్థానం, ఆంధ్రభూమి, మయూరి, ఆంధ్రప్రభ, ఈనాడు, నూతన, ఆహ్వానం, పత్రిక, విపుల, నవ్య, వార్త, ప్రజాసాహితి, చతుర, చినుకు, ఆనంద జ్యోతి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని నవల పంచమంను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ,ఆంధ్ర విశ్వవిద్యాలయం కథ బందీని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు ఎం.ఎ.లో పాఠ్యాంశంగా ఉంచారు. ఇతని రచనలు ఆంగ్లం, హిందీ, మరాఠీ, కన్నడ, ఒరియా భాషలలోకి అనువాదమయ్యాయి.

నవలలు

[మార్చు]
  1. అద్దంలో చందమామ
  2. పంచమం
  3. చీకటి పూలు
  4. కక్షశిల

కథాసంపుటాలు

[మార్చు]
  1. వంకర టింకర ఓ![2]
  2. ఆరుగ్లాసులు
  3. ఏకాకి నౌక చప్పుడు
  4. చివరి మనుషులు
  5. బందీ

బహుమతులు, పురస్కారాలు

[మార్చు]
  1. 1990లో ఆరు గ్లాసులు పుస్తకానికి నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం
  2. 1996లో ఏకాకి నౌక చప్పుడు పుస్తకానికి హిమబిందు అవార్డు
  3. 1996లో పంచమం నవలకు అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా)వారి నవలల పోటీలో తృతీయ బహుమతి
  4. 1996లో పంచమం నవలకు ఉండేల సాహితీ సత్కారం
  5. 2000లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం
  6. 2001లో చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం
  7. 2003లో విశాలాంధ్ర ప్రచురణాలయం వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం

మరణం

[మార్చు]

ఇతడు 2016, అక్టోబరు 18వ తేదీ అనంతపురంలో గుండెపోటుతో మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. కథానిలయం జాలస్థలిలో రచయిత వివరాలు[permanent dead link]
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా జాలస్థలిలో వంకర టింకర ఓ! పుస్తకప్రతి
  3. ప్రజాశక్తి, అనంతపురం సిటీ (18 October 2016). "కథ, నవలా రచయిత చిలుకూరి దేవపుత్ర కన్నుమూత". ప్రజాశక్తి. Archived from the original on 18 అక్టోబరు 2016. Retrieved 18 October 2016.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)