చుట్టాలున్నారు జాగ్రత్త

వికీపీడియా నుండి
(చుట్టాలొస్తున్నారు జాగ్రత్త నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చుట్టాలున్నారు జాగ్రత్త
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.వి. ప్రసాద్
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
రావు గోపాలరావు
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ అమృతా ఫిల్మ్స్
భాష తెలుగు

చుట్టాలున్నారు జాగ్రత్త 1980 లో వచ్చిన సినిమా. బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కృష్ణ, శ్రీదేవి నటించారు . హత్యకు పాల్పడిన వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిజమైన హంతకులను కనుగొనడంలో అతనికి సహాయపడే అతనిలాగే ఉండే వ్యక్తి గురించి ఉంటుంది. ఈ చిత్రం 1980 ఆగస్టు 8న విడుదలై వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఇది తమిళంలో పోక్కిరి రాజా (1982) గా, హిందీలో మావాలి(1983)గా పునర్నిర్మించారు.

ఒక పారిశ్రామికవేత్త కుమార్తె, పారిశ్రామికవేత్త కర్మాగారంలోని మేనేజరూ ప్రేమలో పడతారు. పారిశ్రామికవేత్త యొక్క అత్యాశ బంధువు తన కొడుక్కు ఆ అమ్మాయినిచ్చి పెళ్ళి చెయ్యాలని అనుకుంటాడు. ఆ తండ్రీ కొడుకులు పారిశ్రామికవేత్తను హత్య చేస్తారు. నేరాన్ని ఫ్యాక్టరీ మేనేజరుపై వేస్తారు జైలులో, అతను తనలాగే ఉన్న వ్యక్తిని కలుస్తాడు. వారిద్దరూ కలిసి నిజమైన హంతకులను చట్టానికి పట్టిస్తారు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

సౌండ్‌ట్రాక్‌ను ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచారు.[1]

  1. రావయ్యా రామేశం ఏమయ్యా ఆవేశం , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  2. అప్పన్నా తనామనా, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
  3. అమ్మీఓలమ్మీ , రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  4. కొకొరొకో కొకురకో, రచన: జాలాది రాజారావు గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  5. రెక్కలు తొడిగి రెపరెప లాడి రివ్వంటుంది కోరికా, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  6. చిక్కావులేరా నాకొండి , రచన: కొసరాజు, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల.

మూలాలు

[మార్చు]
  1. "Chuttalunnaru Jagratha (1980)". Archived from the original on 2020-02-25. Retrieved 2020-08-30.