చెరుకువాడ శ్రీరంగనాథరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెరుకువాడ శ్రీరంగనాథరాజు

పదవీ కాలం
2019 జూన్ 8[1] – 2022 ఏప్రిల్ 10[2]

గృహ నిర్మాణ శాఖ
ఆంధ్రప్రదేశ్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 జూన్ 8

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 మే 23 - 2023
ముందు పీతాని సత్యనారాయణ
నియోజకవర్గం ఆచంట

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 – 2009
ముందు దండు శివరామరాజు
నియోజకవర్గం అత్తిలి
నియోజకవర్గం అత్తిలి

వ్యక్తిగత వివరాలు

జననం 19 సెప్టెంబర్ 1953
యండగండి గ్రామం, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (2011 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
నివాసం తూర్పుపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆచంట శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. శ్రీరంగనాథరాజు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3][4]

జననం, విద్యాభాస్యం[మార్చు]

చెరుకువాడ శ్రీరంగనాథరాజు 19 సెప్టెంబర్ 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం, యండగండి గ్రామంలో జన్మించాడు. ఆయన 1969లో యండగండిలోని దండు నారాయణరాజు జిల్లా పరిషత్ పాఠశాలలో తోమిదో తరగతి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

చెరుకువాడ శ్రీరంగనాథరాజు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున అత్తిలి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దండు శివరామరాజు పై ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో అత్తిలి శాసనసభ నియోజకవర్గం రద్దయింది. ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేయలేదు. శ్రీరంగనాథరాజు 2011లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆచంట శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీతాని సత్యనారాయణపై గెలిచాడు. ఆయన 8 జూన్ 2019న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[5][6]

మూలాలు[మార్చు]

  1. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  3. V6 Velugu, V6 (8 June 2019). "ఏపీ కొత్త మంత్రులు- వారికి కేటాయించిన శాఖలు". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Hans India, Sambasiva Rao (8 June 2019). "AP new Cabinet Ministers portfolios". www.thehansindia.com. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  5. Sakshi (9 June 2019). "అగ్రతాంబూలం". Sakshi. Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
  6. Sakshi (14 July 2020). "మోడల్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి". Sakshi. Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.