జంతు ప్రదర్శనశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాన్‌డీగో జంతుప్రదర్శనశాల ప్రధాన ద్వారం, కాలిఫోర్నియా, మే 2007

జులాజికల్‌ గార్డెన్‌, జులాజికల్‌ పార్క్ ‌, మేనేజరీ లేదా జంతు ప్రదర్శనశాల అనేది, జంతువులను ప్రజలు సందర్శనార్థం బంధనాలలో ఉంచే ప్రదేశం, ఇక్కడ అవి తన యొక్క జాతిని కూడా అభివృద్ధి చేసుకుంటుంటాయి.

జులాజికల్‌ గార్డెన్‌ లేదా జంతు ప్రదర్శనశాల అనేది, జంతువులను అధ్యయనం చేసే జంతుశాస్త్రాన్ని సూచిస్తుంది, గ్రీక్‌ పదాలైన జూన్ ‌ (ζῷον, "జంతువు") మరియు లోగాస్ ‌ (λóγος, "అధ్యయనం") అనే రెండు పదాల నుంచి ఇది వచ్చింది. జూ అనే పదాన్ని లండన్‌ జువాలజీ గార్డెన్స్ ‌కు సంక్షిప్త రూపంగా తొలిసారి ఉపయోగించారు, దీన్ని శాస్త్రీయ అధ్యయనం కోసం 1828లో ప్రారంభించి, 1847 నుంచి ప్రజల సందర్శనను అనుమతించారు.[1] ప్రధానమైన జంతువుల సేకరణ ద్వారా, ప్రజల సందర్శన కోసం ఏర్పాటుచేసిన జంతు ప్రదర్శనశాలలు ప్రపంచం మొత్తం మీద 1,000కు ఉండగా, వీటిలో 80శాతం నగరాల్లోనే ఉన్నాయి.[2]

శబ్దఉత్పత్తి శాస్త్రం[మార్చు]

1828లో లండన్‌ జూ ప్రారంభమైన తరువాత, దీనిని మేనేజరీ లేదా జులాజికల్‌ గార్డెన్‌ అని పిలిచేవారు, ఇది ‘గార్డెన్స్‌ అండ్‌ మేనేజరీ ఆఫ్‌ ది జులాజికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌’కు సంక్షిప్త రూపం.[3] 1847లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో మొదటిసారిగా ‘జూ’ అనే సంక్షిప్తరూపం, అచ్చులో క్లిఫ్టన్‌ జూకు ఉపయోగించారు, అయితే ఇరవయ్యేళ్ల అనంతరం మ్యూజిక్‌`హాల్‌ కళాకారుడు ఆల్ఫ్రెడ్‌ వాన్స్‌ రూపొందించిన ప్రసిద్ధ గీతం ‘వాకింగ్‌ ఇన్‌ ద జూ ఆన్‌ సన్‌డే’లో వాడటం ద్వారా ఈ సంక్షిప్త రూపం ప్రాచుర్యం పొందింది.[3] 1891లో వాషింగ్టన్‌ డిసిలోను, 1899లో న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌లోను విస్తృతమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన పార్క్‌ కోసం ‘జులాజికల్‌ పార్క్‌’ అనే పదం వాడబడింది.[4]


ఇరవయ్యో శతాబ్దం చివరిలో జంతుప్రదర్శనశాలలకు పర్యాయపదాలుగా ‘అభయారణ్యాలు‌’ లేదా ‘జీవావరణలను‌’ ఉపయోగించడం మొదలైంది. 19 శతాబ్దంనాటి తరహాలో ఉండే జంతుప్రదర్శనశాలలను విమర్శిస్తూ, తమ జంతుప్రదర్శనశాలలను రోజువారీ మూస విధానం నుంచి దూరం చేయాలన్న ఆలోచనతో జంతుప్రదర్శనశాలల నిర్వహకులు ఈ కొత్తపదాన్ని పుట్టించారు.[5] 1980 చివరిలో వాషింగ్టన్‌ డిసిలోని నేషనల్‌ జూ వారు "జీవారణ్యం" అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు.[6] 1993లో, ‘న్యూయార్క్‌ జూలాజికల్‌ సొసైటీ ’తమ పేరును వైల్డ్‌ లైఫ్‌ కన్సర్వేషన్‌ సొసైటీగా మార్పు చేసుకొని, తమ పరిధిలోని జంతు ప్రదర్శనశాలలను "వైల్డ్‌ లైఫ్‌ కన్సర్వేషన్‌ పార్క్స్‌"గా రీబ్రాండ్‌ చేశారు.[7]

చరిత్ర[మార్చు]

పురాతన ప్రపంచం[మార్చు]

జంతుప్రదర్శనశాలకు పూర్వరూపం మేనేజరీ, పురాతన కాలం నుంచీ ఆధునిక యుగం వరకు దీనికి పెద్ద చరిత్ర ఉంది. 2009లో ఈజిప్ట్‌లోని హిరకోన్పోలీస్‌లో జరిపిన తవ్వకాల సందర్భంలో అత్యంత పురాతన జంతువుల సేకరణ,

క్రీస్తుపూర్వం 3500కు చెందిన మేనేజరీ బయటపడింది. వీటిలో నీటిగుర్రాలు, ఏనుగులు, అడవిదున్నలు, గండుకోతులు మరియు అడవి పిల్లులు వంటి అరుదైన జంతువులున్నాయి.[8] క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో చైనా సామ్రాజ్ఞి టాంకీ ‘హరిణ గృహం‌’ నిర్మించారు, మరియు కింగ్ అఫ్ వెన్‌ ఆఫ్‌ జ్యూ, లింగ్-యూ లేదా ‘గార్డెన్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌’ అని పిలువబడే 1500 ఎకరాల జంతుప్రదర్శనశాలను నిర్మించారు. ఇజ్రాయిల్‌, జూదా రాజు సోలోమన్‌, అస్సిరియా రాజులు సెమిరామి మరియు అషుర్బనిపాల్‌, బాబిలోనియా రాజు నెబుచాడ్రెజార్‌ కూడా ప్రముఖంగా జంతువులును సేకరించారు.[2] క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దంలోనే గ్రీకు నగరాల్లో అనేక జంతుప్రదర్శనశాలలుండేవి; అలెగ్జాండర్‌ చక్రవర్తి తన సైనిక దండయాత్రలలో కనుగొన్న కొన్ని జంతువులను గ్రీస్‌ దేశానికి పంపినట్లు కూడా తెలుస్తుంది. కొందరు రోమన్‌ చక్రవర్తులు తమ అధ్యయనాల కోసం లేదా బరిలో ఉపయోగించుకోవడం కోసం వ్యక్తిగతంగా జంతువులను సేకరించేవారు, [2] తరువాత వీటిని క్రూరంగా హింసించేవారు. 19వ శతాబ్దపు చరిత్రకారుడు డబ్ల్యు.ఇ.హెచ్‌. లెకీ తొలిసారిగా క్రీస్తుపూర్వం 366లో జరిగిన రోమన్‌ క్రీడల గురించి రాశాడు:

At one time, a bear and a bull, chained together, rolled in fierce combat across the sand ... Four hundred bears were killed in a single day under Caligula ... Under Nero, four hundred tigers fought with bulls and elephants. In a single day, at the dedication of the Colosseum by Titus, five thousand animals perished. Under Trajan ... lions, tigers, elephants, rhinoceroses, hippopotami, giraffes, bulls, stags, even crocodiles and serpents were employed to give novelty to the spectacle ...[9]

మధ్యయుగపు ఇంగ్లండ్‌[మార్చు]

ఇంగ్లండ్‌ రాజు హెన్రీ-1 సింహాలు, చిరుతపులులు, ఒంటెలతో కూడిన జంతు సముదాయాలను తన యొక్క కోట ఉడ్‌స్టాక్‌లో పోషించారు.[10] మధ్యయుగపు ఇంగ్లండ్‌కు సంబంధించి టవర్‌ ఆఫ్‌ లండన్‌లో ఒక జంతు సముదాయం ఉండేది, దీన్ని కింగ్‌ జాన్‌-1 1204లో ఏర్పాటు చేశారు. 1235లో హెన్రీIII రాజు వివాహం సందర్భంగా పవిత్ర రోమన్‌ చక్రవర్తి ఫెడ్రిక్‌-2 మూడు చిరుతపులులను పంపించాడు, తరువాత 1264లో వీటిని బుల్‌వార్క్‌కు తరలించారు, టవర్‌ ఆఫ్‌ లండన్‌కు పశ్చిమ ద్వారం దగ్గర ఉండే దీన్ని లయన్‌ టవర్‌ అని పిలిచేవారు. 16వ శతాబ్దంలో ఎలిజెబెత్‌-1 హయాంలో ఇది ప్రజల సందర్శనకు అనుమతించబడింది.[11] 18వ శతాబ్దంలో, దీని ప్రవేశ రుసుము మూడున్నర పెన్నీలు‌గా ఉండేది, లేదా సింహాలకు ఆహారంగా పిల్లులను లేదా కుక్కలను సమర్పించాల్సి వచ్చేది.[10] ‘లండన్‌ జూ’ ప్రారంభమైన తరువాత వీటన్నింటినీ అక్కడకు తరలించారు.

ఆధునిక కాలం[మార్చు]

17వ శతాబ్దంలో లూయీస్‌ XIV హయాంలో ది వెర్సైల్స్ మేనేజరీ

ఆస్ట్రియాలోని వియన్నా జూ అత్యంత పురాతనమైనది. వియన్నాలోని షాన్‌బోర్న్‌ ప్యాలెస్‌లోని అత్యంత ఉత్కృష్టమైన రాచరిక మేనేజరీ నుంచి అభివృద్ధి చెందిన దీన్ని 1752లో హాస్‌బర్గ్‌ రాజవంశీయులు స్థాపించారు, 1765లో దీన్ని చూడటానికి ప్రజలను అనుమతించారు. 1775లో మాడ్రిడ్‌లో ఒక జూను స్థాపించారు, మరియు 1795లో జాక్వెస్‌`హెన్రీ బెర్నాడియన్‌ చే పారిస్‌లోని జార్డిన్‌ డీస్‌ ప్లాంట్స్ ‌లో వేర్సైల్స్ రాయల్‌ మేనేజరీ నుంచి తెచ్చిన జంతువులతో, ప్రాథమికంగా శాస్త్రీయ అధ్యయనం మరియు విద్య కోసం ఓ జంతుప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. రష్యాలోని మొట్టమొదటి జంతుప్రదర్శనశాల అయిన కజాన్‌ జూను 1806లో కజాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కర్ల్‌ ఫచెస్ స్థాపించారు. 1826లో స్టాంఫర్డ్‌ రఫెల్స్‌చే స్థాపించబడిన జులాజికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌, 1828లో రీజెంట్స్‌ పార్క్‌లో లండన్‌ జూ ఏర్పాటు చేసే సమయంలో పారిస్‌ జూను స్ఫూర్తిగా తీసుకొని నిర్మించారు, 1847లో కొంత రుసుము చెల్లించే పద్ధతిలో సందర్శకులను అనుమతించారు.[2] 1860లో ఏర్పాటైన మెల్‌బోర్న్‌ జంతు ప్రదర్శనశాల ఆస్ట్రేలియాలో తొలి జంతుప్రదర్శన ఆవరణ‌. అదే సంవత్సరంలో, న్యూయార్క్‌లో ప్రారంభమైన సెంట్రల్‌పార్క్‌ జూ అమెరికాలోని మొదటి బహిరంగ జంతుప్రదర్శనశాల, అంతకు ముందు 1859లో ఫిలడెల్ఫియా జులాజికల్‌ సొసైటీ ఒక జంతుప్రదర్శనశాల స్థాపనకు కృషి చేసింది, కానీ అమెరికా పౌరయుద్ధం కారణంగా అది 1874వరకు ప్రారంభం కాలేదు.

లండన్‌ జూ, 1835

1907లో, స్టెల్లింజెన్ లో జర్మన్‌ పారిశ్రామికవేత్త కార్ల్‌ హాజెన్‌బెక్, ‌ టైర్‌పార్క్‌ హాజెన్‌బెక్‌ ప్రారంభించారు, అదిప్పుడు హాంబర్గ్‌ కేంద్రంగా ఉంది. ఇది బహిరంగ జంతుప్రదర్శనశాల వంటిది, సాధారణంగా వాడే బోనులకు బదులుగా రక్షణ వలయం ఏర్పాటు చేసిన ప్రదేశంలో జంతువులను ఉంచేవారు, దీని వలన జంతువులకు సహజ వాతావరణ అనుభూతి కలిగేది.[12]

1970లో పర్యావరణంపై ప్రజలకు ఆసక్తి పెరగడంతో, కొన్ని జంతుప్రదర్శనశాలలు తమ ప్రధానపాత్రను సంరక్షణ దిశగా మార్చుకున్నాయి, ఇందులో గారల్డ్‌ డర్రెల్‌ (జెర్సీ జూ), జార్జ్‌ రబ్‌ (బ్రూక్‌ఫీల్డ్‌ జూ), విలియమ్‌ కాన్వే బ్రాంక్స్‌ జూ (వన్యప్రాణి‌ కన్సర్వేషన్‌ సొసైటీ) లు ప్రధానమైనవి. అప్పటినుండి, జంతు ప్రదర్శనశాలల నిపుణులు సంరక్షణ కార్యకలాపాలపై శ్రద్ధ పెట్టారు, వెంటనే అమెరికన్‌ జూ అసోసియేషన్‌ జంతు సంరక్షణ అనేది తమకు అత్యంత ప్రాధాన్యతాంశంగా పేర్కొంది.[13] జంతు సంరక్షణ వ్యవహారానికి వీరు ప్రధాన్యతనివ్వాలని కోరుకోవడంతో పెద్దపెద్ద జంతు ప్రదర్శనశాలలు సందర్శకులను ఆకర్షించడం కోసం జంతువులచేత విన్యాసాలు చేయించడం నిలిపివేశాయి. ఉదాహరణకు డెట్రాయిట్‌ జూ 1969లో ఏనుగు ప్రదర్శనను నిలిపివేసింది, మరియు 1983లో చింపాంజీల చేత విన్యాసాలు చేయించడం ఆపివేసింది, అప్పట్లో ఆ విన్యాసాలు చేయించడానికి శిక్షకులు వాటిని హింసించవలసి రావచ్చని పేర్కొంది.[14]

మానవ ప్రదర్శనలు[మార్చు]

ఓటా బెంగా, న్యూయార్క్‌లోని ఒక హ్యూమన్‌ ఎగ్జిబిట్‌, 1906

కొన్నిసార్లు బోనుల్లో జంతువులతో పాటు మనుషులను కూడా ప్రదర్శించేవారు, ఐరోపా మరియు ఐరోపాయేతర ప్రజల మధ్య ఉండే తేడాను చూపడానికి ఇలా చేసేవారు. 1906 సెప్టెంబరులో, న్యూయార్క్‌ జులాజికల్‌ సొసైటీ అధినేత మాడిసన్‌ గ్రాంట్‌తో జరిగిన ఒప్పందంతో బ్రాంక్స్‌ జూ సంచాలకుడు విలియమ్‌ హార్నాడే ఒక కాంగోలీజ్‌ పిగ్మీ ఓటా బెంగాను ఒక బోనులో చింపాంజీలతో కలిపి ప్రదర్శించారు, తరువాత దోహోంగ్‌ అనే గొరిల్లాతోను, ఒక చిలుకతోను ప్రదర్శించారు. ఒరాంగ్ వుటాన్ మరియు తెల్లవారికి మధ్య ‘తగిపోయిన సంబంధాన్ని‌’ చూపడం దీని ప్రధానోద్దేశం. అయితే దీనికి నగరంలోని ప్రముఖుల నుంచి వ్యతిరేకత వచ్చింది, కానీ చాలామంది ప్రజలు దీన్ని చూడటానికి ఎగబడ్డారు.[15][16]

1931 పారిస్‌ కలోనియల్‌ ఎక్స్‌పొజిషన్‌, 1958లో బ్రస్సెల్స్‌లో జరిగిన ఎక్స్‌పో '58లో ‘కాంగోలీస్‌ గ్రామం’లో కూడా మనుషులు బోనుల్లో ప్రదర్శించబడ్డారు.[17]

స్వరూపం మరియు ఆకృతి[మార్చు]

మెకాక్‌ ఎన్‌క్లోజర్‌, జిగాంగ్‌ పీపుల్స్‌ పార్క్‌ జూ, సిచువాన్‌.
మంకీ ఐస్‌లాండ్స్‌, సావోపాలో జూ

జంతువులకు, అదేవిధంగా సందర్శకులకు ఉపయుక్తంగా ఉండేవిధంగా సహజ ఆవాసాలకు నకళ్లుగా రూపొందించిన ఆవరణలలో జంతుప్రదర్శనశాలలోని జంతువులు ఉంటాయి. నిశాచర జీవుల కోసం పగటి సమయంలో తెల్లటి మసక వెలుతురు లేదా ఎర్రటి కాంతి కలిగిన ప్రత్యేక భవంతులు ఏర్పాటు చేస్తారు, అందువల్ల సందర్శకులు వచ్చిన సమయంలో ఇవి ఉత్సాహంగా ఉంటాయి, రాత్రివేళల్లో పెద్దపెద్ద లైట్లు వేయడం ద్వారా ఇవి నిద్రిస్తాయి. తీవ్రమైన పర్యావరణ పరిస్థితుల్లో ఉండే పెంగ్విన్ల వంటి జంతువుల కోసం, ఇక్కడ ప్రత్యేక శీతోష్ణస్థితి పరిస్థితులు సృష్టించబడతాయి. పక్షులు, కీటకాలు, సరీసృపాలు, చేపలు మరియు ఇతర జల జీవాలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. కొన్ని జూలలో ‘వాక్‌`త్రూ’ (నడుస్తూ లోనికి వెళ్లగలిగిన) మార్గాలు ఉంటాయి, వీటి వలన సందర్శకులు లెముర్, మర్మోసెట్, బల్లులు, తాబేళ్లు వంటి ప్రమాదం లేని జంతువులను దగ్గర నుంచి చూడగలుగుతారు. జంతువులను లాక్కొనగలిగే వస్తువులు, తినుబండారాలు తీసుకుపోవడానికి సందర్శకులను అనుమతించరు, వారు అనుమంతించిన మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది.

బహిరంగ జంతు ప్రదర్శనశాలలు[మార్చు]

ద వెస్ట్‌ మిడ్‌లాండ్స్‌ సఫారీ పార్క్‌లోని జిరాఫ్స్‌

కొన్ని జంతు ప్రదర్శనశాలల్లో తక్కువ పరిమాణంలో జంతువులను, బోనుల్లో ఉంచడానికి బదులు, కందకాలు, కంచెలు వంటి ఏర్పాటు చేయడం ద్వారా పెద్దపెద్ద బహిరంగ ఆవరణలలో ఉంచి ప్రదర్శిస్తారు. సఫారీ పార్కులు, జూపార్కులని కూడా పిలిచే ఈ లయన్‌ ఫాంల్లోకి డ్రైవ్‌`త్రూ గుండా సందర్శకులను అనుమతిస్తారు, దీని వలన జంతువులతో సందర్శకులకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది.[2] ఇంగ్లండ్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో ఉన్న వైప్‌స్నేడ్‌ పార్క్‌ ఇటువంటి జంతుప్రదర్శనశాలల్లో మొదటిది, దీన్ని జులాజికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌ 1931లో ప్రారంభించింది, దీని విస్తీర్ణం 600 ఎకరాలు (2.4 చదరపు కిలోమీటర్లు). 1970 తొలిభాగంలో, శాన్‌డీగో సమీపంలోని శాన్‌ పాస్కల్‌ వ్యాలీ దగ్గర శాన్‌డీగో వైల్డ్‌ ఏనిమల్‌ పార్కు 1,800 ఎకరాల (7 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణంలో ప్రారంభమైంది, ఇది జులాజికల్‌ సొసైటీ ఆఫ్‌ శాన్‌డీగో ఆధ్వర్యంలో ఉండేది. నార్త్‌ కరోలినా జూ స్టేట్‌ సహకారం అందిస్తున్న రెండు జూపార్కుల్లో ఒకటి నార్త్‌ కరోలినా జూ, అష్‌బోరోలో ఉన్న ఈ జూ 2000 ఎకరాల విస్తీర్ణం ఆక్రమించుకుని ఉంది.[18] ఆస్ట్రేలియాలోని, మెల్‌బోర్న్‌లో ఉన్న 500 ఎకరాల్లో ఉన్న వెర్రీబీ ఓపెన్‌ రేంజి జంతుప్రదర్శనశాలలోని జంతువులు సవన్నా (గడ్డితో నిండిన పెద్ద మైదానాలు) ల్లో ఉంటాయి.

బహిరంగ అక్వేరియంలు[మార్చు]

మొట్టమొదటి పబ్లిక్‌ అక్వేరియం 1853లో లండన్‌ జూలో ప్రారంభమైంది. దీనికి అనంతరం ఐరోపా ఖండంలో (ఉదాహరణకు 1859లో పారిస్‌లోను, 1864లో హాంబర్గ్‌లోను, 1869లో బెర్లిన్‌లోను, 1872లో) మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు (1859లో బోస్టన్‌లోను, 1873లో వాషింగ్టన్‌లోను, 1873లో శాన్‌ఫ్రాన్సిస్కో ఉడ్‌వర్డ్స్‌ గార్డెన్‌లోను, 1896లో న్యూయార్క్‌ బ్యాటరీ పార్క్‌) మరికొన్ని అక్వేరియాలు ప్రారంభమయ్యాయి.

2005లో, అట్లాంటాలోని జార్జియాలో 8 మిలియన్‌ అమెరికన్‌ గాలన్లు (30,000 ఘనపు మీటర్లు ఘనపు మీటర్లు; 30,000,000 లీటర్లు) శుద్థమైన నీరు కలిగివున్న లాభాపేక్ష లేని జార్జియా అక్వేరియాన్ని ప్రారంభించారు, ఇందులో 500ల విభిన్న జాతులకు చెందిన 100,000 కంటే ఎక్కువ జీవులు ఉన్నాయి. ఈ అక్వేరియంలో షార్క్‌, బెలుగా తిమింగలాలున్నాయి.

రహదారి ప్రక్కన ఉండే జంతుప్రదర్శనశాలలు[మార్చు]

ఉత్తర అమెరికా అంతటా రహదారి ప్రక్కన ఉండే జంతు ప్రదర్శనశాలలు కనిపిస్తాయి, ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా చిన్నవి, నియంత్రణ లేని మరియు లాభార్జన ధ్యేయంగా గలవి, గ్యాస్‌ స్టేషన్ల వంటి ఇతర వ్యాపారాలకు అనుబంధంగా ఏర్పడి, సందర్శకులను ఆకర్షిస్తూంటాయి. ఇందులో రకరకాల విన్యాసాలు చేసేలా జంతువులకు శిక్షణ ఇస్తుంటారు, మరియు సందర్శకులు పెద్ద జంతుప్రదర్శనశాలల కన్నా మరింత దగ్గరగా జంతువులను చూసే అవకాశం ఉంటుంది.[19] నియంత్రణ లేకపోవడంతో రహదారి ప్రక్కన ఉండే జంతుప్రదర్శనశాలల్లో జంతువుల పట్ల నిర్లక్ష్యం[20], క్రూరత్వం కనిపిస్తుంటాయి.[21]

పెంపుడు జంతుప్రదర్శనశాలలు[మార్చు]

పెంపుడు జంతుప్రదర్శనశాలలను పిల్లల ప్రదేశాలు లేదా పిల్లల జంతుప్రదర్శనశాలలని కూడా అంటారు, పెంపుడు జంతువులు మరియు తాకడం, ఆహారం పెట్టడం వంటివి చేయడానికి విధేయత చూపగల అటవీ జంతువులు ఉంటాయి. సాధారణంగా వీటి ఆరోగ్య పరిరక్షణ కోసం ఆహారాన్ని వెండింగ్ మిషన్లు లేదా సమీపంలోని చిన్న పందిళ్ళ ద్వారా అందిస్తుంటారు.

ఏనిమల్‌ థీమ్‌ పార్కులు[మార్చు]

అమ్యూజ్‌మెంట్‌ పార్కు, జంతుప్రదర్శన శాల కలిసి ఉంటే దాన్ని ఏనిమల్‌ థీమ్‌ పార్కు అని పిలుస్తారు, వినోదం మరియు వ్యాపారం దీని ప్రధానోద్దేశాలు. సముద్ర క్షీరదాలతో ఏర్పాటయిన సీ వరల్డ్‌, మెరైన్‌లాండ్‌ వంటి మెరైన్ మామ్మల్ పార్క్స్, విస్తృతమైన డాల్ఫినోరియమ్‌ల్లో, తిమింగలాలతోపాటు ఇతర వినోదపు ఆకర్షణలు ఉంటాయి. ఇతర రకం ఏనిమల్‌ థీమ్‌ పార్కులు, సాంప్రదాయిక జంతుప్రదర్శనశాలల కంటే ఎక్కువ వినోదం మరియు కాలక్షేప అంశాలతో నిండివుంటాయి, ఉదాహరణకు స్టేజ్‌ షో, రోలర్‌కోస్టర్‌ మరియు మాయ కల్పనల వంటివి. ఉదాహరణకు ఫ్లోరిడాలో వున్న టాంపాలో బుష్‌గార్డెన్స్‌ టాంపా, ఓర్లాండోలో ఉన్న డిస్నీస్‌ ఏనిమల్‌ కింగ్‌డమ్‌, ఇంగ్లాండ్‌ ఉన్న నార్త్‌ యార్క్‌షైర్‌లోని ఫ్లెమింగో ల్యాండ్‌, కాలిఫోర్నియాలోఉన్న వల్లెజోలోని సిక్స్‌ ఫ్లాగ్స్‌ డిస్కవరీ కింగ్‌డమ్‌.

జంతువుల పరిరక్షణ, వనరులు[మార్చు]

సాధారణంగా ఆధునిక జంతుప్రదర్శనశాలల్లో, ప్రదర్శనలో ఉన్న ప్రతి 20 జంతువుల్లో ఐదు జంతువులను పూర్తిగా బంధనాలలో పెంచుతారు. జంతుప్రదర్శనశాలకు వచ్చిన ఈ జంతువులకు అంటురోగాలుంటాయన్న భయంతో ఒంటరి కేంద్రాల్లో ఉంచుతారు, ఆ తరువాత వాటి సహజవాతావరణానికి దగ్గరగా ఉండే ఆవరణలకు అలవాటుపడేట్లు చూస్తారు ఉదాహరణకు, పెంగ్విన్లలోని కొన్ని జాతులను తీసుకొచ్చిన తరువాత అత్యంత చల్లగా ఉండే ఆవరణలు అవసరం కావచ్చు. ఈ జంతువుల సంరక్షణకు సంబంధించిన విధివిధానాలను ‘ఇంటర్నేషనల్‌ జూ ఇయర్‌ బుక్‌ ’లో ప్రచురితమయ్యాయి.[22]

సంరక్షణ మరియు పరిశోధన[మార్చు]

నార్త్‌ కరోలినా జూలో ఆఫ్రికన్‌ ప్లెయిన్స్‌ : ఒక రేంజ్‌ జూ ఎలా ఉండాలో చెబుతుంది.

ఆస్ట్రలేషియా, ఐరోపా, ఉత్తర అమెరికాల్లోని జంతుప్రదర్శనశాలలు, ప్రత్యేకించి శాస్త్రీయ సంస్థలతో కలసి ఉన్నవి, క్రూరజంతువుల ప్రదర్శనను ప్రధానంగా అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ, విద్య మరియు పరిశోధన కోసం ఉద్దేశించబడ్డాయి,[23][24] వీటి ద్వితీయ ఉద్దేశం సందర్శకుల వినోదమనన్నది విమర్శకుల వాదనలను ఎదుర్కుంటోంది. జులాజికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌ తన నిబంధనావళిలో "జంతుశాస్త్రం మరియు జంతు శరీరధర్మ శాస్త్ర పురోగతి మరియు జంతుప్రపంచంలో ఆధునిక, ఆసక్తికర అంశాల పరిచయమే" తమ లక్ష్యంగా పేర్కొంది. ఇది రెండు పరిశోధనా సంస్థలను నిర్వహిస్తున్నది, ఒకటి నఫ్ఫీల్డ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపారిటివ్‌ మెడిసిన్‌ కాగా, రెండవది వెల్కమ్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపారిటివ్‌ ఫిజియాలజీ. U.S.లో, ఫిలడెల్ఫియా జూకు చెందిన పెన్‌రోజ్‌ రీసెర్చ్‌ లాబరేటరీ తులనాత్మక రోగనిర్ధారణ శాస్త్ర అధ్యయనంపై దృష్టిపెట్టింది.[2] ద వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ జూస్‌ అండ్‌ ఆక్వేరియమ్స్‌ తన మొదటి పరిరక్షణ వ్యూహాన్ని 1993లో ప్రకటించింది, మరియు 21వ శతాబ్దపు జంతుప్రదర్శనశాలలకు సంబంధించిన లక్ష్యాలను, విధివిధానాలను నిర్దేశించడానికి 2004 నవంబరులో ఒక నూతన వ్యూహాన్ని రూపొందించింది.[25]

అంతరించిపోతున్న జాతులను సహకార పునరుజ్జీవ పథకాలతో పరిరక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇందులో అంతర్జాతీయ స్టడ్‌బుక్స్ మరియు సమన్వయకర్తలు ఉంటారు, వీరు ముఖ్యంగా ప్రాపంచిక లేదా ప్రాంతీయ దృక్కోణంలో ఒక ప్రత్యేక జంతువుల లేదా సంస్థల పాత్రను మదింపు చేస్తారు, మరియు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు ప్రాంతీయ కార్యక్రమాలు కూడా ఉన్నాయి.[26]

జంతువుల హక్కుల సంస్థ‌, పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఏనిమల్‌ (పెటా) ప్రస్తుత జంతు ప్రదర్శన శాలల స్థితిని వ్యతిరేకిస్తున్నారు, అధ్యయనాలకు సహకరించడం, పరిరక్షణకు మద్దతు ఇవ్వడం జంతుప్రదర్శనశాలల ముఖ్య ఉద్దేశంగా ఉండాలన్నది వారి వాదన, కానీ ఎక్కువ ప్రదర్శనశాలలు జంతువులను చెరలో ఉంచడానికి, వాటి నిర్వహణకు మార్గాలు వెతుకుతున్నాయన్నది వారి ఆరోపణ.[27] జంతువుల ప్రదర్శనశాలలు "పరిరక్షణకు చాలా తక్కువ శ్రద్ధ చూపుతున్నాయని" ఆక్స్‌ఫర్డ్‌ సెంటర్‌ ఫర్‌ ఏనిమల్‌ ఎథిక్స్‌, సంచాలకుడు ఆండ్రూ లింజే ఆరోపిస్తున్నారు.[28]

అదనపు జంతువులు[మార్చు]

దస్త్రం:Edith, PETA.jpg
ఈ చింపాంజీ 37 సంవత్సరాల వయసులో టెక్సాస్‌లోని ఒక రోడ్‌సైడ్‌ జూలో చేరడానికి ముందు ఐదు జూలను దాటి వచ్చింది.[29]

అడవిలో ఒక జంతువును పట్టుకునే ప్రయత్నంలో, మరికొన్ని జంతువులు మరణిస్తుంటాయి. అందుచేత జంతువుల ప్రజననాన్ని జంతుప్రదర్శనశాలల్లో ప్రోత్సహించాల్సి ఉంది.[22] లియోన్‌లోని జీన్‌`మౌలిన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఎరిక్‌ బరాటే మరియు ఎలిసాబెత్‌ హార్డియోన్‌`ఫ్యుగైర్‌లు ఇలా చెబుతున్నారు, జంతువులకు సంబంధించిన మొత్తం "స్టాక్‌ టర్నోవర్‌" సంవత్సరానికి 1/5 వంతు నుంచి 1/4 వంతుగా ఉంది, బోనుల్లో ఉన్న కోతుల్లో మూడొంతులు కోతులు మొదటి ఇరవై నెలల వ్యవధిలో మరణిస్తున్నాయి. "సామూహికంగా దిగుమతి చేసుకోవడం" ఈ అత్యధిక మరణ రేటుకు కారణమని వారు పేర్కొన్నారు.[30]

జంతుప్రదర్శనశాలల్లో జంతువులు తమ జాతిని గణనీయంగా అభివృద్ధి చేసుకోవడం వల్ల, వేలాది జంతవులు జూల యొక్క "మిగులు జాబితాలోకి" పోవడం, వాటిని సర్కస్‌ కంపెనీలు, జంతువుల వ్యాపారులు, వేలంపాటల్లోనో, పెంపకదారులకో, క్రీడాపరమైన అవసరాలకో అమ్మవలసి వస్తోంది. శాన్‌జోస్‌ మెర్క్యురీ న్యూస్ ‌ అనే వార్తాసంస్థ నిర్వహించిన రెండేళ్ల అధ్యయనంలో, 1992`1998 కాలంలో U.S.లో వున్న అధీకృత జూల నుంచి 19,361 క్షీరదాలలో 7420 (అంటే 38 శాతం) డీలర్లు, వేలంపాటలు, అనధీకృత జూలు, వేటాడే పశుక్షేత్రాలు, వ్యక్తులు, మరియు క్రీడా సంస్థలకు చేరుకున్నాయి.[31]

హంటింగ్‌ రాంచ్‌లు నడుపుతున్న ఏనిమల్‌ ఫైండర్స్ గైడ్ ‌ వంటి న్యూస్‌ లెటర్లలో జంతు ప్రదర్శనశాలలు మిగులు జంతువుల అమ్మకం, వేలం గురించి ప్రకటనలు ఇస్తున్నాయి.[32] మాథ్యూ స్కల్లీ ప్రకారం ప్రదర్శనశాలలలోని జంతువులను చంపడాన్ని ఎక్కువ మంది వేటగాళ్లు ఇష్టపడుతున్నారు, ఎందుకంటే వారికి అది బాగా-కనబడుతున్న బహుమతిగా కనబడుతుంది, జూలో ఉన్న సింహం జూలు అడవి సింహం కంటే పరిశుభ్రంగా కనిపిస్తుంది.[32] ఒక కేసులో విలియం హాంప్టన్‌ అనే జూ యజమాని జంతువులను అమ్ముతూ, వాటిని ఒక పద్ధతి ప్రకారం చంపి, వాటి చర్మాలు, తలలు, మరియు గొర్రె చర్మాలు బహుమతులుగా అమ్ముతూ పట్టుబడ్డాడు.[33]

తరచూ తమ జాతిని అభివృద్ధి చేసే జంతువులైన లేడి, పులి, సింహం వంటివి ఆహార అవసరాల కోసం చంపబడుతున్నాయి; న్యూరెంబర్గ్‌ జంతుప్రదర్శనశాల ఉప సంచాలకుడు హెల్మట్‌ మాగ్డెఫ్రూ, "జంతువుల కోసం మంచి ఆవాసాలను మనం ఏర్పరచకపోతే మనమే వాటిని చంపి తినేయగలం" అని పేర్కొన్నారు.[34] ఇతర జంతువులు సౌకర్యాలు, సదుపాయాలు అంతగా లేని చిన్నచిన్న జూలకు అమ్మబడుతుండవచ్చు. టెక్సాస్‌లోని అమారిల్లో వన్యప్రాణి‌ రెఫ్యూజ్‌ అనే రోడ్డుపక్క జూలో ఎడిత్‌ అనే చింపాంజీ ఒక కాంక్రీట్‌ గుంటలో ఉండటాన్ని ‘PETA’ ఒక ఉదాహరణగా పేర్కొంది. సెయింట్‌ లూయీస్‌ జూలో జన్మించిన ఆ చింపాజీ, తన మూడవ పుట్టిన రోజు తరువాత అమ్మివేయబడింది, తరువాత 37 సంవత్సరాలపాటు ఐదు వేర్వేరు చోట్ల గడిపిన అనంతరం, రోడ్డు పక్క జూకు అమ్మబడింది.[35]

2008 మార్చిలో బెర్లిన్‌ జూలోని 23,000 జంతువుల్లో వందల సంఖ్యలో తప్పిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి, ఈ సందర్భంలో అవి వధకు గురయ్యాయని, కొన్ని పులులు, చిరుతలు సంప్రదాయిక చైనీస్‌ ఔషధాల తయారీకి చైనా తరలించబడ్డాయని ఆరోపణలు వినవచ్చాయి. గ్రీన్‌ పార్టీ నాయకురాలు, క్లాడియా హమ్మర్లింగ్‌, నాలుగు ఆసియన్‌ బ్లాక్‌ ఎలుగుబంట్లు మరియు ఒక నీటిగుర్రం బెర్లిన్‌ నుండి కొత్త ప్రదేశానికి తరలిస్తున్నామని చెప్పి వాటిని బెల్జియంలోని వార్టెల్‌కు తరలించారని తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు, దీనికి సంబంధించి గార్డియన్‌ పత్రిక అక్కడ జూలేదని కేవలం కబేళా మాత్రమే ఉందని పేర్కొంది. కానీ ఆ జంతుప్రదర్శనశాల సంచాలకుడు, బెర్న్‌ హార్డ్ బ్లాస్కీవిట్జ్‌ ఇవన్నీ "అసత్యాలు, అర్ధ-సత్యాలు మరియు అబద్ధాలు"గా ఆరోపించారు.[34]

జంతువుల స్థితిగతులు[మార్చు]

దస్త్రం:ZigongPeople'sParkZoo2.jpg
ది జిగాంగ్‌ పీపుల్స్‌ పార్క్‌ జూలో జబ్బు పడిన మెకాక్‌ ఇన్‌ సిచువాన్‌, చైనా[54]
మెల్‌బోర్న్‌ జూలో సముద్ర సింహాలు

సరైన నియంత్రణ లేని, లేదా కొద్దిపాటి నియంత్రణా చర్యలున్న దేశాలలో జంతుప్రదర్శనశాలల్లోని జంతువుల స్థితిగతులు విస్తృతంగా మారుతుంటాయి. లాభార్జన లేని, శాస్త్రీయ అధ్యయనాల కోసం పనిచేసే సంస్థలు, ఆవరణలలోని జంతువుల పరిరక్షణకు మంచి చర్యలు తీసుకుంటాయి, అయితే పరిమాణాన్ని పెంచడం అదేవిధంగా కొన్ని జీవులకు సంబంధించి, ఉదాహరణకు డాల్పిన్లు మరియు తిమింగలాలు వంటివాటికి సరియైన వాతావరణం కల్పించడంలో అధిక వ్యయం కష్టమైపోతుంటుంది.[36][37]

ఒక చదరపు మీటరు వైశాల్యమున్న బోనులో ఎలుగుబంటి, దలియాన్‌ జూ, పోర్ట్‌ ఆర్థర్‌, లియోనింగ్‌ ప్రావిన్స్‌, చైనా, 1997.

జంతుప్రదర్శనశాలల్లో నివసించే జంతువుల్లో అధిక శాతం జంతువులను బతికున్న జీవులుగా చూడకుండా, కేవలం పునరుత్పత్తి సాధనాలుగానే వాటిని చూస్తుంటారని విమర్శకులు ఆరోపిస్తుంటారు, స్వేచ్ఛగా ఉండే అటవీ వాతావరణం నుంచి వీటిని జంతుప్రదర్శనశాలలకు తరలించడం వల్ల అదేవిధంగా మనుగడ సాగించడం కోసం మానవులపై ఆధారపడాల్సి రావడంతో వాటికి తరచుగా పిచ్చి పడుతుంటుందని వారు ఆరోపిస్తుంటారు.[38]

నిర్బంధం వల్ల జంతువులు ఒత్తిడికి గురవుతాయనడానికి ధ్రువపు ఎలుగుబంట్లు, సింహాలు, పులులు, చిరుతలే సాక్ష్యం, ఈ విషయం ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో నాలుగు దశాబ్దాలపాటు జరిగిన ఒక అధ్యయనం వెల్లడిస్తున్నది.[39][40] U.S.లోని 'PETA' నిర్వహించిన ఒక పరిశోధనలో కొన్ని ఎలుగుబంటి జాతుల్లో విచిత్ర ప్రవర్తనను కనుగొంది, అకారణంగా భయానికి గురికావడం, వింత ప్రవర్తను, గుండ్రంగా తిరగడం, తలను గిరగిర తిప్పడం వంటి వింత చర్యలు కనిపించాయి.[41] చైనాలోని ది బడల్టేరింగ్‌ సఫారీ పార్క్‌ ఒక జత మూన్‌ బీర్స్‌ను ఒక బోనులో ఉంచింది, ఆ బోను కనీసం ఎలుగుబంటి తనచుట్టూ తాను తిరగడానికి కూడా వీల్లేనంత చిన్నది. ది డైలీ మెయిల్‌ పత్రికలో 2008 జనవరి సంచికలో ఈ ఎలుగుబంట్లలో ఒకదానికి కొద్దికాలం తరువాత పిచ్చిపట్టిందని, బోను గోడలకు తలను బాదుకుంటున్నదని రాసింది.[42]

ప్రత్యక్షంగా తినిపించడం[మార్చు]

చైనాలోని బడల్టేరింగ్‌ సఫారీ పార్క్‌లో సందర్శకులు సింహాల బోనుల్లోకి మేకలను, గొర్రెలను పడవేసి, సింహాలు వాటిని ఆహారంగా తింటుంటే చూసేవారు లేదా వెదురు కర్రలకు కట్టివుంచిన కోడి మాసం‌ ముక్కలను 2 పౌండ్లకు కొని, సింహాలకు స్వయంగా తినిపించేవారు. సింహం ఉండే పరిసరాల్లోకి బస్సులు, ప్రత్యేకంగా రూపకల్పన చేసిన మార్గాల ద్వారా ప్రవేశించి వాటికి కోడి మాంసం తినిపిస్తారు. ఆగ్నేయ చైనాలోని గైలిన్‌ సమీపంలోని జియాంగ్‌సెన్‌ బీర్‌ మరియు టైగర్‌ మౌంటైన్‌ విలేజ్‌లో బతికున్న ఆవులను, పందులను పులులకు ఆహారంగా పడవేసి సందర్శకులను వినోదం కలిగిస్తుంటారు.[42][43]

బీజింగ్‌ సమీపంలో ఉన్న క్వింగ్డావో జంతుప్రదర్శనశాలలో ‘టార్టాయిస్‌ బైటింగ్‌’ అనే వింత అలవాటుంది, ఒక చిన్న గదిలో తాబేళ్లను ఎలాస్ట్రిక్‌ బ్యాండ్‌లను వేసి ఉంచుతారు, ఫలితంగా అవి తమ తలలను తిప్పలేవు. సందర్శకులు అక్కడకు వచ్చి వాటిపై నాణాలు విసురుతుంటారు. వాటి తలపై అలా నాణాలతో కొట్టగలిగి, ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందని, కథాక్రమం.[42]

జంతుప్రదర్శనశాలల నియంత్రణ[మార్చు]

అమెరికా సంయుక్త రాష్ట్రాలు[మార్చు]

యునైటెడ్ స్టేట్స్ లో, ఏ విధమైన బహిరంగ జంతు ప్రదర్శనకు అయినా అనుమతి తప్పనిసరి, యునైటెడ్‌ స్టేట్స్ డిపార్ట్ మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, యునైటెడ్‌ స్టేట్స్ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ, డ్రగ్‌ ఎన్‌ఫోర్స్ మెంట్‌ ఏజెన్సీ, ఆక్యుపేషనల్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్ అడ్మినిస్ట్రేషన్‌ మరియు ఇతర సంస్థలు పరిశీలించి అనుమతి ఇస్తాయి. వారు ప్రదర్శించే జంతువుల ఆధారంగా, జంతుప్రదర్శనశాలల కార్యకలాపాలు, ఎన్డేన్జర్డ్ స్పెషీస్ యాక్ట్, యానిమల్ వెల్ఫేర్ యాక్ట్, మైగ్రేటరీ బర్డ్ ట్రియటీ యాక్ట్ 1918 వంటి చట్టాల ద్వారా నియంత్రించబడతాయి.[44] అదనంగా, ఉత్తర అమెరికాలోని జంతుప్రదర్శనశాలలు అసోసియేషన్‌ ఆఫ్‌ జూస్‌ అండ్‌ ఆక్వేరియమ్స్‌ (AZA) నుంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ గుర్తింపు సాధించడానికి ఆ జంతుప్రదర్శనశాలలు దరఖాస్తు మరియు పరిశీలన ప్రక్రియలను సంతృప్తి పరచాలి లేదా జంతుప్రదర్శనశాలలు జంతువుల ఆరోగ్యం మరియు సంరక్షణ, నిధుల సంకలనం, సిబ్బంది నియామకం, ప్రపంచ సంరక్షణ ప్రయత్నాలలో పాలుపంచుకోవడం వంటి అంశాల్లో ‘AZA’ ప్రమాణాలను చేరుకోవాల్సి లేదా అధిగమించ వలసి ఉంటుంది. ఈ పరిశీలనను ముగ్గురు నిపుణులు (ఒక పశువైద్యుడు, ఒక జంతుసంరక్షణా నిపుణుడు, ఒక జంతుప్రదర్శనశాల నిర్వహణ మరియు కార్యకలాపాల నిపుణుడు) కలసి ఈ పరిశీలనను నిర్వహిస్తారు, తరువాత పన్నెండు మంది సభ్యులు గల ఒక బృందం దీన్ని పరిశీలిస్తుంది, ఆ తరువాతే ఈ గుర్తింపు మంజూరవుతుంది. ఈ గుర్తింపు ప్రక్రియ ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరావృతమవుతుంది. ఫిబ్రవరి 2007 వరకు USDA లైసెన్స్ పై నడుస్తున్న 2,400 జంతుప్రదర్శనశాలల్లో, 10 శాతం కంటే తక్కువ మాత్రమే గుర్తింపు పొందినట్లు 'AZA' అంచనా.[45]

ఐరోపా[మార్చు]

ఏప్రిల్ 1999లో, యూరోపియన్‌ యూనియన్‌ ప్రదర్శనశాలల సంరక్షక పాత్రను బలోపేతం చేయడానికి ఒక నిర్దేశకాన్ని రూపొందించింది, సంరక్షణ మరియు పరిశోధనను చట్టపరమైన బాధ్యతలుగా మార్చి, దీనికి సంబంధించిన అనుమతి మరియు పరిశీలన వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిందిగా సభ్యదేశాలను కోరింది.[46] యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో జూ లైసెన్సింగ్‌ యాక్ట్ 1981 కింద ఇది 1984 నుంచి నిర్బంధంగా అమల్లోకి వచ్చింది. "క్రూరమృగాల ప్రదర్శనకు ఉంచడానికి కావలసిన ఏర్పాట్లు... ప్రవేశరుసుముతోగాని, రుసుము లేకుండా గాని ప్రజలు, సందర్శకులు వచ్చి చూడటానికి కావలసిన సౌకర్యాలు; ఏడాది కాలంలో ఏ సమయంలోనైనా ఏడు కన్నా ఎక్కువ రోజులపాటు ఉండేది" - ఇది 'జూ'ను నిర్వచించిన విధానం, సర్కస్‌లు, పెంపుడు జంతువుల దుకాణాలు ఇందులో మినహాయించబడ్డాయి. ఈ చట్టప్రకారం అన్ని ప్రదర్శనశాలలు పరిశీలింపబడి మరియు అనుమతి పొంది ఉండాలి, ఆయా జంతువులు అనువైన వాతావరణం కలిగిన ఆవరణలలో సహజ ప్రవర్తనను కలిగి ఉండే విధంగా వాతావరణం కల్పించబడి ఉండాలి.[46]

చిత్రశ్రేణి[మార్చు]

వీటిని కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

 1. జెడ్ఎస్ఎల్ యొక్క చరిత్ర Archived 2008-11-07 at the Wayback Machine., జూలాజికల్ సొసైటి అఫ్ లండన్
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 జూ ,ఎన్‌సైక్లోపీడియా బ్రిటానియా , 2008
 3. 3.0 3.1 బ్లంట్‌ 1976; రీచెన్‌బచ్‌ 2002, పి.పి. 151-163.
 4. హైసన్‌ 2000, పి. 29; హైసన్‌ 2003, పిపి. 1356-1357.
 5. మేపల్‌ 1995, పి. 25.
 6. రాబిన్‌సన్‌ 1987ఎ, పిపి. 10-17; రాబిన్‌సన్‌ 1987బి, పి.పి. 678-682.
 7. కాన్వే 1995, పిపి. 259-276.
 8. ప్రపంచంలో తోలి జంతు ప్రదర్శనశాల హిరకనో పోలిస్ ,ఈజిప్ట్ ,ఆర్కియాలజీ మేగజైన్‌ http://www.archaeology.org/1001/topten/egypt.html
 9. Lecky, W.E.H. History of European Morals from Augustus to Charlemagne. Vol. 1, Longmans, 1869, pp. 280-282.
 10. 10.0 10.1 బ్లంట్‌, విల్‌ఫ్రెడ్‌. ది ఆర్క్ ఇన్‌ ది పార్క్‌: ది జూ ఇన్‌ ది నైన్టీన్త్‌ సెంచురీ , హమిష్‌ హామిల్టన్‌, 1976, పిపి. 15-17.
 11. బిగ్‌ కేట్స్ ప్రౌల్డ్ లండన్స్ టవర్‌, బిబిసి న్యూస్‌, అక్టోబరు 24, 2005
 12. Rene S. Ebersole (2001). "The New Zoo". Audubon Magazine. National Audubon Society. మూలం నుండి 2007-09-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-12-18. Unknown parameter |month= ignored (help)
 13. సీ కిల్సింగ్‌, వెర్నన్‌ ఎన్‌. (ఎడ్‌): జూ అండ్‌ ఆక్వేరియమ్‌ హిస్టరీ , బోకా రాటన్‌ 2001. ఐఎస్‌బిఎన్‌ 0-8493-2100-X; ఆర్‌.జె. డైస్‌ అండ్‌ విలియమ్‌ ఎ. (ఎడ్‌): న్యూ వరల్డ్స్, న్యూ ఏనిమల్స్ , వాషింగ్టన్‌ 1996. ఐఎస్‌బిఎన్‌ 0-8018-5110-6; హన్సన్‌, ఎలిజెబెత్ ఏనిమల్‌ అట్రాక్షన్స్ , ప్రిన్సిటన్‌ 2002. ఐఎస్‌బిఎన్‌ 0-691-05992-6; అండ్‌ హాంకాక్స్, డేవిడ్‌ ఎ డిఫరెంట్‌ నేచర్‌ , బర్కిలీ 2001. ఐఎస్‌బిఎన్‌ 0-15-506372-3
 14. డోనాహ్య, జెస్సీ అండ్‌ ట్రంప్‌, ఎరిక్‌. పొలిటికల్‌ ఏనిమల్స్: పబ్లిక్‌ ఆర్ట్ ఇన్‌ అమెరికన్‌ జూస్‌ అండ్‌ ఆక్వేరియమ్స్ . లెక్సింగ్‌టన్‌ బుక్స్, 2007, పి. 79.
 15. బ్రాడ్‌ఫోర్డ్, ఫిలిప్స్ వెర్నర్‌ అండ్‌ బ్లూమ్‌, హార్వే. ఓటా బెంగా: ది పిగ్మీ ఇన్‌ ద జూ . సెయింట్‌ మార్టిన్స్ ప్రెస్‌, 1992.
 16. మేన్‌ అండ్‌ మంకీ షో డిస్‌అప్రూవ్డ్ బై క్లెర్జీ, ది న్యూయార్క్ టైమ్స్ సెప్టెంబర్‌ 10, 1906.
 17. బ్లాంచర్డ్, పాస్కల్‌; బాన్సెల్‌, నికోలస్‌; అండ్‌ లెమైర్‌, శాన్‌డ్రైన్‌. ఫ్రమ్‌ హ్యమన్‌ జూస్‌ టు కలోనియల్‌ అపోథియోసిస్‌: ది ఎరా ఆఫ్‌ ఎగ్జిబిటింగ్‌ ది అదర్‌ Archived 2008-04-18 at the Wayback Machine., ఆఫ్రికల్చర్స్ .
 18. ఎన్‌.సి. జూ, బకింగ్‌ ఎ ట్రెండ్‌, సెట్స్‌ ఏన్‌ అటెండెన్స్ రికార్డ్
 19. గుజూ ఏనిమల్‌ ఫార్మ్ Archived 2008-05-10 at the Wayback Machine., కెనడియన్‌ రోడ్‌సైడ్‌ జూలకు సంబంధించిన ఒక వెబ్‌సైట్‌. యాక్సెస్డ్ జూన్‌ 18, 2009.
 20. రోడ్‌సైడ్‌ జూ ఏనిమల్స్ స్టార్వింగ్‌. ఫ్రీలాన్స్ స్టార్‌. 11 జనవరి 1997.
 21. డిక్సన్‌, జెన్నిఫర్‌. హౌస్‌ పానెల్‌ టోల్డ్ ఆఫ్‌ అబ్యూసెస్‌ బై సర్కసెస్‌, జూస్‌. టైమ్స్ డైలీ. 1 జూలై 2007
 22. 22.0 22.1 జూ: ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కేర్‌ ఆఫ్‌ ఏనిమల్స్, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా , 2008.
 23. టడ్జ్, కోలిన్‌. లాస్ట్ యానిమల్స్ ఇన్‌ ద జూ: హౌ మాస్‌ ఎక్స్‌టింక్షన్‌ కెన్‌ బి స్టాప్డ్ , లండన్‌ 1991, ఐఎస్‌బీఎన్ 1-58883-001-2
 24. మేనిఫెస్టో ఫర్‌ జూస్ Archived 2006-08-23 at the Wayback Machine.‌, జాన్‌ రీగన్‌ అసోసియేట్స్ 2004.
 25. వరల్డ్ జూ అండ్‌ ఆక్వేరియమ్‌ కన్సర్వేషన్‌ స్ట్రాటజీ Archived 2007-02-16 at the Wayback Machine., వరల్డ్ అసోసియేషన్‌ ఆఫ్‌ జూస్‌ అండ్‌ ఆక్వేరియమ్స్.
 26. ఆఫ్రికాలో ఆఫ్రికన్‌ ప్రిజర్వేషన్‌ ప్రోగ్రామ్‌ (ఎపిపి) చేపట్టిన కన్సర్వేషన్‌ (ఆఫ్రికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ జులాజికల్‌ గార్డెన్స్ అండ్‌ ఆక్వారియా; ఇన్‌ ద యుఎస్‌ అండ్‌ కెనడా బై స్పైసీస్‌ సర్వైవల్‌ ప్లాన్స్ (అమెరికన్‌ జూ అండ్‌ ఆక్వేరియమ్‌ అసోసియేషన్‌), అండ్‌ ది కెనడియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ జూస్‌ అండ్‌ ఆక్వేరియమ్స్‌; ఆస్ట్రేలియా లో, బై ది ఆస్ట్రేలియన్‌ స్పైసీస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఆస్ట్రేలియన్‌ రీజనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ జులాజికల్‌ పార్క్స్ అండ్‌ ఆక్వారియా Archived 2007-02-02 at the Wayback Machine.); యూరప్ లో‌, బై ది యూరోపియన్‌ ఎన్‌డేంజర్డ్‌ స్పైసీస్‌ ప్రోగ్రామ్‌ (యూరోపియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ జూస్‌ అండ్‌ ఆక్వారియా), జపాన్‌లో, సౌత్‌ ఏషియా, సౌత్‌ ఈస్ట్ ఏషియా, బై ది జపనీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ జూస్‌ అండ్‌ ఆక్వేరియమ్స్‌, ది సౌత్‌ ఏషియన్‌ జూ అసోసియేషన్‌ ఫర్‌ రీజనల్‌ కోపరేషన్‌, అండ్‌ ది సౌత్‌ ఈస్ట్ ఏషియన్‌ జూ అసోసియేషన్‌.
 27. బూత్‌, విలియమ్‌. నేకెడ్‌ ఏప్‌ న్యూ జూ అట్రాక్షన్‌; సర్‌ప్రైజ్‌ రిజల్ట్స్ ఫ్రమ్‌ పీపుల్‌-వాచింగ్‌ స్టడీ ది వాషింగ్టన్‌ పోస్ట్ మార్చి 14, 1991.
 28. జియోగెగన్‌, టామ్‌. "వాట్‌ ఆర్‌ జూస్‌ ఫర్" బిబిసి న్యూస్‌, జనవరి 8, 2008.
 29. "Amarillo Wildlife Refuge", PETA.
 30. జెన్‌సెన్‌ డెర్రిక్‌ అండ్‌ ట్వీడీ-హాల్మ్స్‌ కెరెన్‌. థాట్‌ టు ఎగ్జిస్ట్‌ ఇన్‌ ది వైల్డ్‌: అవేకెనింగ్‌ ఫ్రం ద నైట్‌మేర్‌ ఆఫ్‌ జూస్ ‌ నో వాయిస్‌ అన్‌హియర్డ్‌, 2007, పి. ౨౧; బరాటే, ఎరిక్‌ అండ్‌ హార్డౌన్‌- ఫగైర్‌, ఎలిసబెత్ జూ: ఎ హిస్టరీ ఆఫ్‌ ది జులాజికల్‌ గార్డెన్స్‌ ఆఫ్‌ ద వెస్ట్‌ . రియాక్టియన్‌, లండన 2002
 31. గోల్డ్‌స్టోన్‌, లిండా. "ఏనిమల్స్‌ ఒన్స్‌ అడ్మైర్డ్‌ ఎట్‌ కంట్రీస్‌ మేజర్‌ జూస్‌ ఆర్‌ సోల్డ్‌ ఆర్‌ గివెన్‌ అవే టు డీలర్స్‌," శాన్‌జోస్‌ మెర్క్యురీ న్యూస్ ‌, ఫిబ్రవరి 11, 1999. సైటెడ్‌ ఇన్‌ స్కల్లీ, మేథ్యూ. డొమినియన్‌. సెయింట్‌ మార్టిన్స్‌ గ్రిఫ్ఫిన్‌, 2004 (పేపర్‌బాక్‌), పి. 64.
 32. 32.0 32.1 స్కల్లీ, మేథ్యూ. డొమినియన్‌ . సెయింట్‌ మార్టిన్స్‌ గ్రిఫ్ఫిన్‌, 2004 (పేపర్‌బాక్‌), పి.64.
 33. జెంసేన్ పేజిలు 49-50.
 34. 34.0 34.1 కొన్నొల్లీ, కేట్‌. "బెర్లిన్‌ జూ అక్యూజ్డ్‌ ఆఫ్‌ ప్రాఫిటింగ్‌ ఫ్రమ్‌ స్లాటర్‌" ది గార్డియన్ ‌, మార్చి 28, 2008.
 35. "అమ్రిల్లో వైల్డ్‌లైఫ్‌ రిఫ్యూజ్‌", పెటా. ఇది కూడా చూడండి: "హార్డ్‌ లైఫ్‌, హార్డ్‌ టైమ్స్‌" Archived 2011-05-02 at the Wayback Machine., పెటా
 36. నార్టన్‌, బ్రాయన్‌ జి.; హచిన్స్‌, మైకే; స్టీవెన్స్‌, ఎలిజెబెత్‌ ఎఫ్‌.;మేపల్‌, టెర్రీ ఎల్‌. (ఎడ్‌): ఎథిక్స్‌ ఆన్‌ ద ఆర్క్‌, జూస్ ‌, ఏనిమల్‌ వెల్ఫేర్‌, అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ కన్సర్వేషన్‌. వాషింగ్టన్‌ డిసి, 1995. ఐఎస్‌బిఎన్ 1-56098-515-1
 37. మాల్మడ్‌, రేండీ. రీడిరగ్‌ జూస్‌. రిప్రజంటేషన్స్‌ ఆఫ్‌ ఏనిమల్స్‌ అండ్‌ కేప్టివిటీ . న్యూయార్క్‌, 1998. ఐఎస్‌బిఎన్‌ 0-8147-5602-6.
 38. జెన్సెన్‌, పి.48.
 39. డెర్ర్‌, మార్క్‌. "బిగ్‌ బియస్ట్స్‌, టైట్‌ స్పేస్‌ అండ్‌ ఎ కాల్‌ ఫర్‌ ఛేంజ్‌ ఇన్‌ జర్నల్‌ రిపోర్ట్‌" ది న్యూయార్క్‌ టైమ్స్ ‌, అక్టోబరు 2, 2003.
 40. క్లబ్‌, రాస్‌&మాసన్‌, ఆర్‌ఒఎస్‌. "కేప్టివిటీ ఎఫర్ట్స్‌ ఆన్‌ వైడ్‌ రేంజింగ్‌ కార్నివార్స్‌", నేచర్‌ , అక్టోబర్‌ 2, 2003, సైటెడ్‌ ఇన్‌ "జూస్‌: పిటిఫుల్‌ ప్రిజన్స్ Archived 2010-09-15 at the Wayback Machine.‌", పెటా.
 41. "జూస్‌: పిటిఫుల్‌ ప్రిజన్స్‌" Archived 2010-09-15 at the Wayback Machine., పెటా.
 42. 42.0 42.1 42.2 పెన్‌మేన్‌, డానీ. "ఏనిమల్స్‌ టార్న్‌ టు పీసెస్‌ బై లయన్స్‌ ఇన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బేయింగ్‌ క్రౌడ్స్‌: ది స్పెక్టేటర్‌ స్పోర్ట్‌ చైనా డజంట్‌ వాంట్‌ యు టు సీ" ది డైలీ మెయిల్ ‌, జనవరి 1, 2008.
 43. ఫెరోసిటీ ట్రైనింగ్‌, సన్‌డే మార్నింగ్ ‌ పోస్ట్‌, హాంగ్‌కాంగ్‌, నవంబరు 29, 1999.
 44. గ్రీచ్‌, కాలి ఎస్‌. "ఓవర్‌వ్యూ ఆఫ్‌ ది లాస్‌ అఫెక్టింగ్‌ జూస్‌" మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లా, ఏనిమల్‌ లీగల్‌& హిస్టారికల్‌ సెంటర్‌, 2004.
 45. ఎజ్‌ఎ అక్రిడిటేషన్‌ ఇంట్రడక్షన్ Archived 2007-11-02 at the Wayback Machine.‌.
 46. 46.0 46.1 ద జూ లైసెన్సింగ్‌ యాక్ట్‌ 1981 Archived 2008-05-04 at the Wayback Machine., డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌, ఫుడ్‌ అండ్‌ రూరల్‌ అఫైర్స్‌.

సూచనలు[మార్చు]

 • బ్లంట్‌, విల్‌ఫ్రిడ్‌ (1976). ది ఆర్క్ ఇన్‌ ది పార్క్: ది జూ ఇన్‌ ది నైన్టీన్త్‌ సెంచురీ, హామిష్‌ హమిల్టన్‌, లండన్‌. ఐఎస్‌బిఎన్‌ 0241893313
 • కాన్వే, విలియం (1995). "ది కాన్వర్సేషన్‌ పార్క్ : ఎ న్యూ జూ సింథసిస్‌ ఫర్‌ ఎ ఛేంజ్‌డ్‌ వరల్డ్", ఇన్‌ ది ఆర్క్ ఎవాల్వింగ్‌: జూస్‌ అండ్‌ ఆక్వేరియమ్స్ ఇన్‌ ట్రాన్సిషన్‌, వెమ్మర్‌, క్రిస్టెన్‌ ఎమ్‌. (ఎడ్‌), స్మిత్‌ సోనియన్‌ ఇనిస్టిట్యూషన్‌ కన్సర్వేషన్‌ అండ్‌ రీసెర్చ్ సెంటర్‌, ఫ్రంట్‌ రాయల్‌, వర్జీనియా
 • హైసన్‌, జెఫ్రే (2000), "జంగిల్‌ ఆఫ్‌ ఈడెన్‌: ది డిజైన్‌ ఆఫ్‌ అమెరికన్‌ జూస్‌", ఇన్‌ ఎన్విరాన్‌మెంటలిజమ్‌ ఇన్‌ లాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్‌, కోనన్‌, మైకేల్‌ (ఎడ్‌), డంబార్టన్‌ ఓక్స్‌, వాషింగ్టన్‌. ఐఎస్‌బిఎన్ 0884022781
 • హైసన్‌, జెఫ్రే (2003), "జూస్‌" ఇన్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్‌ హిస్టరీ : ఒాజడ్‌, క్రెచ్‌, షెపర్డ్, మెక్‌ నైల్‌, జాన్‌ రాబర్ట్‌ అండ్‌ మర్చంట్‌, కరోలిన్‌ (ఎడ్‌), రూట్లెడ్జ్‌, లండన్‌. ఐఎస్‌బిఎన్‌ 0415937353
 • మప్లే, టెర్రీ (1995). "టువర్డ్ ఎ రెస్పాన్సిబుల్‌ జూ అజెండా" ఇన్‌ ఎథిక్స్ ఆన్‌ ది ఆర్క్: జూస్‌, ఏనిమల్‌ వెల్ఫేర్‌, అండ్‌ వైల్డ్ లైఫ్‌ కన్సర్వేషన్‌, నార్టన్‌, బ్రయాన్‌ జి., హచిన్స్‌, మైకేల్‌ స్టీవెన్స్, ఎలిజెబెత్‌ ఎఫ్‌. అండ్‌ మేపల్‌, టెర్రీ ఎల్‌. (ఎడ్‌), స్మిత్‌ సోనియన్‌ ఇనిస్టిట్యూషన్‌ ప్రెస్‌, వాషింగ్టన్‌. ఐఎస్‌బిఎన్‌ 1-56098-515-1
 • రీచెన్‌బాచ్‌, హెర్మన్‌ (2002). 'లాస్ట్ మేనేజరీస్‌: వై అండ్‌ హౌ జూస్‌ డిసెప్పియర్‌ (పార్ట్-1) ' ఇంటర్నేషనల్‌ జూ న్యూస్‌ వాల్యూం.49/3 (నెం.316), ఏప్రిల్‌-మే 2002
 • రాబిన్‌సన్‌, మైఖేల్‌ హెచ్‌. (1987ఎ) 'బియాండ్‌ ది జూ: ది బయోపార్క్', డిఫెండర్స్ ఆఫ్‌ వన్యప్రాణి‌ మేగజైన్‌, వాల్యూమ్‌ 62, నెం.6.
 • రాబిన్‌సన్‌, మైఖేల్‌ హెచ్‌. (1987బి) 'టువర్డ్ ది బయోపార్క్: ది జూ దట్‌ ఈజ్‌ నాట్‌', అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ జులాజికల్‌ పార్క్స్ అండ్‌ ఆక్వేరియమ్స్‌, ఏన్యువల్‌ ప్రొసీడింగ్స్‌.

మరింత చదవడానికి[మార్చు]


మూస:Zoos