జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ
నినాదం | యోగః కర్మసు కౌశలం |
---|---|
రకం | ఎడ్యుకేషన్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ |
స్థాపితం | 16-07-1946 |
స్థానం | కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | అర్బన్, 0.4451545 Sq.Km |
జాలగూడు | http://www.jntuk.edu.in/ |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఉన్న ఒక రాష్ట్ర విశ్వవిద్యాలయం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ.
విషయ సూచిక
చరిత్ర[మార్చు]
ఇది అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వంచే "కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వైజాగపట్నం" గా కాకినాడలో జూలై 16, 1946 న స్థాపించబడింది. దీనికి తరువాత "గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, కాకినాడ" అనే పేరు పెట్టారు. ప్రారంభంలో మద్రాసు విశ్వవిద్యాలయానికి మరియు తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఇది తరువాత 1972లో జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ చట్టం, 1972 ద్వారా జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం యొక్క ఒక విభాగ కళాశాల అయింది, మరియు జెఎన్‌టియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకినాడ గా పేరు మార్చబడింది. 2008లో ఇది జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం, 2008 ద్వారా స్వయంప్రతిపత్తి హోదాను పొందింది.
విభాగాలు[మార్చు]
- అటామిక్ ఫిజిక్స్ శాఖ
- సివిల్ ఇంజనీరింగ్ విభాగం
- మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం
- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం
- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగం
- జియోలాజికల్ (భూగర్భ) ఇంజనీరింగ్ విభాగం
- ఐటి & సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగం
- రవాణా ఇంజనీరింగ్ విభాగం
- పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ విభాగం
- పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగం
- మెరైన్ (సముద్ర) & కోస్టల్ ఇంజనీరింగ్ విభాగం
- నానో సైన్స్ & ఇంజనీరింగ్ విభాగం
- నావల్ సైన్స్ & టెక్నాలజీ శాఖ
- గణిత విభాగం
- మెకానిక్స్ శాఖ
- ఫిజిక్స్ శాఖ
- కెమిస్ట్రీ శాఖ
- గణాంకాలు శాఖ
- బయోఇన్ఫర్మేటిక్స్ శాఖ
- మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్
- మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్ (ఎమ్‌బిఏ)
- ఫార్మసీ విభాగం
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం[మార్చు]
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం, ఈ విశ్వవిద్యాలయం యొక్క విభాగ కళాశాల. ఇది విజయనగరం-గజపతినగరం రోడు వెంబడి విజయనగరం నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఒక మిట్టపై విశాలంగా 90 ఎకరాల విస్తీర్ణంలో (36 హెక్టార్లు) 2007లో స్థాపించబడింది.[1]
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "JNTU Vizianagaram :: College of Engineering". viz.jntuk.edu.in. Retrieved 14 September 2011.