Jump to content

జాతీయ రహదారి 13

వికీపీడియా నుండి
Indian National Highway 13
13
National Highway 13
పటం
అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్‌హెచ్13
Tawang Gate.jpg
ఎన్‌హెచ్ 13 పై సెలా కనుమ వద్ద స్వాగత ద్వారం
మార్గ సమాచారం
పొడవు1,559 కి.మీ. (969 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
West చివరతవాంగ్
తూర్పు చివరవక్రో, లోహిత్ జిల్లా
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఅరుణాచల్ ప్రదేశ్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 13 ఎన్‌హెచ్ 15

జాతీయ రహదారి 13 (ఎన్‌హెచ్ 13), అరుణాచల్ వ్యాప్త హైవే నెట్‌వర్క్‌లో భాగం. 1,559 కి.మీ. పొడవున్న రెండు వరుసల ఈ జాతీయ రహదారి, వాయువ్యంలో తవాంగ్ నుండి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ అంతా తిరిగి, ఆగ్నేయంలో వక్రో వరకు వెళ్తుంది.[1][2] 2018 లో 6.2 కి.మీ. పొడవున్న దిబాంగ్ నది వంతెన పూర్తవడంతో, మొత్తం రహదారి అంతా వినియోగం లోకి వచ్చింది.[3][4] 2024 మార్చిలో సెలా సొరంగం వినియోగం లోకి రావడంతో ఏడాది పొడవునా రవాణా సౌకర్యం ఏర్పడింది.[5] హైవేల పునర్వ్యవస్థీకరణకు ముందు, దీనిని ఎన్‌హెచ్ 229, ఎన్‌హెచ్52 అనేవారు.[6] వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ రహదారి, భారతదేశపు తూర్పు సెక్టారుకు ఎదురుగా వాస్తవాధీన రేఖకు అవతల ఉన్న చైనా వెస్ట్రన్ థియేటర్ కమాండ్ నుండి ఉన్న ముప్పును ఎదుర్కోవడంలో భారత సైనిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.

మార్గం

[మార్చు]

ఎన్‌హెచ్13 తవాంగ్, బోమ్‌డిలా, నెచిపు, సెప్పా, సగాలీ, జిరో, దపోరిజో, అలోంగ్, పాసిఘాట్, తేజులను కలుపుతూ అరుణాచల్ ప్రదేశ్ లోని వక్రో సమీపంలో ఎన్‌హెచ్-15తో కలిసి ముగుస్తుంది.[6][7]

జంక్షన్లు

[మార్చు]
ఎన్‌హెచ్ 713A జోరామ్ వద్ద
ఎన్‌హెచ్ 713 హోజ్ వద్ద
ఎన్‌హెచ్ 513 పాసీఘాట్ వద్ద
ఎన్‌హెచ్ 515 near Pasighat
ఎన్‌హెచ్ 313 మేకా వద్ద
ఎన్‌హెచ్ 115 మేకా వద్ద
ఎన్‌హెచ్ 113 హవాక్యాంప్ వద్ద
ఎన్‌హెచ్ 15 వక్రో వద్ద ముగుస్తుంది.[7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Archived copy". Archived from the original on 10 April 2009. Retrieved 2011-07-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link) Start and end points of National Highways-Source-Government of India
  2. Road network funding, MODNER
  3. "Dibang bridge icing on road building cake". Arunachal Observer. 19 Feb 2018. Retrieved 28 April 2019.
  4. Largest and longest bridges in India Archived 2020-12-18 at the Wayback Machine, [www.tentaran.com Tentaran].
  5. "ప్రపంచంలోనే పొడవైన రెండు వరుసల సొరంగం.. సేలా టన్నెల్‌". ఈనాడు. Archived from the original on 2024-06-29. Retrieved 2024-06-29.
  6. 6.0 6.1 "New Numbering of National Highways notification" (PDF). The Gazette of India. Retrieved 30 April 2019.
  7. 7.0 7.1 "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 22 April 2019.