జానపద కిన్నెర
జానపద కిన్నెర అనేక తంత్రులు కలిగిన సంగీత వాయిద్యం. ఉత్తారాదిన కొన్ని గిరిజన జాతులలో వాడుకలో వున్న కిన్నెర వాయిద్యాన్ని పోలి వుంటుంది. ఇంచుమించు గిటారు లాగ వుంటుంది. లోపల ఖాళీగా వున్న సుమారు 20 అంగుళాల వెదురు పై మైనంతో మధ్యగా నాలుగు మెట్లను అతికిస్తారు. మెట్లపై నుండి రెండు తంత్రులను బిగిస్తారు. వెదురుకు ఒక చివర స్వర పేటిక వుంటుంది.[1] దక్షిణ భారతదేశంలో తెలంగాణ (డక్కలివారు), కర్ణాటక ((కిన్నెర జోగి) రాష్ట్రాలలో జానపద కళాకారులు కిన్నెర వాయిస్తూ జీవనాన్ని గడుపుతారు.
రకాలు
[మార్చు]తెలంగాణలో రెండు రకాల కిన్నెర వాద్యాలు ఉన్నాయి. 1. జానపదుల ఏడు మెట్ల కిన్నెర 2. ఆదివాసీల పన్నెండు మెట్ల కిన్నెర. మహబూబ్ నగర్ , నల్గొండ జిల్లాలో ఏడు మెట్ల కిన్నెర వాద్యాన్ని మాదిగలపై ఆధారపడి జీవించే డక్కలి కులం వారు మాత్రమే వాయిస్తారు. ఇది లఘు కిన్నెర. చెంచు, గోండి ఆదివాసీలు పన్నెండు మెట్ల కిన్నెర ని వాయిస్తారు. దీనికి బృహత్ కిన్నెర అని పేరు. ఈ వాద్యం జితర్ వాద్యాల కోవకు చెందుతుంది. హిమాలయ సానువులలో (కిన్నోర్ జిల్లా) కిన్నెర, కింపురుషులు వాయించే వాయిద్యం అని ప్రతీతి. ఇది అత్యంత ప్రాచీనమైన తంత్రీ వాద్యం. చిన్న కిన్నెరని డక్కని వారు వాయిస్తూ పది వీరగాథలు పాడతారు.[2] వాటిలో పండుగ సాయన్న, మీరేసాబు వంటి జనరంజకమైన కథలు ఉన్నాయి.
వాయిద్యం తయారీ
[మార్చు]కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పండే పెద్ద పెద్ద గుండ్రని సొరకాయ బుర్రలు, తేనెతుట్టె నుంవాయుజన్య శబ్ద వాయిద్యాలుడి తీసిన మైనం, చీమలను తినే (ant eater) బల్లి మీది పొలుసులను మెట్లుగా కిన్నెర వాద్యాన్ని తయారుచేస్తారు.[1]
కళాకారులు
[మార్చు]నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామంలో జన్మించిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందాడు.[3] ఈ కళకు ఆదరణ తగ్గినందున, కళాకారులు దారిద్ర్యంలో పడిపోతున్నారు. దీనికి ఉదాహరణ ఇటీవలి కాలంలో మరణించిన డక్కలి బాలమ్మ
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 మిక్కిలినేని, రాధాకృష్ణ మూర్తి (1992). " వాయుజన్య శబ్ద వాయిద్యాలు" (in Telugu). తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్.
- ↑ జయధీర్, తిరుమలరావు; గూడూరి, మనోజ (2019). మూలధ్వని (జానపద గిరిజన సంగీత వాద్యాల సామజిక చరిత్ర ).
- ↑ Telugu, TV9 (2022-01-29). "Kinnera Mogulaiah: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మొగిలయ్య కన్నీటి గాథ తెలుసా! ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న కళాకారుడి జీవితం." TV9 Telugu. Retrieved 2022-03-19.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)