జార్గోస్ సెఫెరిస్
జార్గోస్ సెఫెరిస్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | జార్గోస్ సెఫిరియాడిస్ మార్చి 13, 1900 ఉర్లా, టర్కీ |
మరణం | 1971 సెప్టెంబరు 20 ఏథెన్స్, గ్రీస్ | (వయసు 71)
వృత్తి | కవి, దౌత్యవేత్త |
జాతీయత | గ్రీకు |
పూర్వవిద్యార్థి | యూనివర్సిటీ ఆఫ్ పారీస్ |
సాహిత్య ఉద్యమం | ఆధునికవాదం[1] |
పురస్కారాలు | నోబెల్ బహుమతి 1963 |
సంతకం |
జార్గోస్ సెఫెరిస్ (మార్చి 13, 1900 - సెప్టెంబర్ 20, 1971) 20వ శతాబ్ధంలోని గ్రీకు కవి, దౌత్యవేత్త. 1963లో నోబెల్ సాహిత్య బహుమతిని అందుకున్నాడు.[2]
జననం విద్యాభ్యాసం
[మార్చు]జార్గోస్ సెఫెరిస్ 1900, మార్చి 13న ఆసియా మైనర్ (ప్రస్తుత టర్కీ)లోని స్త్మ్రర్ని నగరంలో జన్మించాడు. ఏథెన్స్లోని జిమ్నాజియంలో విద్యను అభ్యసించి, 1918లో తన కుటుంబంతో కలిసి ప్యారిస్‌కు వలస వెళ్లి న్యాయశాస్త్ర విద్యను పూర్తిచేశాడు.
ఉద్యోగం
[మార్చు]గ్రీకు దేశపు విదేశీ వ్యవహారాల ప్రతినిధిగా, దౌత్యవేత్తగా, రాయబారిగా 1931-34 మధ్య ఇంగ్లాండ్ లో, 1936-38 మధ్య అల్బేనియాలో, 1948-50 మధ్య అంకారాలో, 1951-53 మధ్య లండన్ లో, 1957-61 మధ్య యునైటెడ్ కింగ్‌డమ్ లో వంటి దేశాల్లో, నగరాల్లో పనిచేశాడు.
రచనా ప్రస్థానం
[మార్చు]రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో గ్రీస్ నుంచి వెళ్ళిపోయి ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, ఇటలీ వంటి దేశాలలో గడిపాడు. ఆ అనుభవాలను క్రోడీకరించి తన కవిత్వాన్ని రాశాడు. అంతేకాకుండా, దౌత్యవేత్తగా, రాయబారిగా వివిధ దేశాలలో పనిచేసిన అనుభవం జార్గోస్ సెఫెరిస్ సాహిత్య రచనకు ఎంతగానో ఉపయోగపడింది.
కవిత్వం
[మార్చు]- స్ట్రోఫే (1931)
- ది సిస్టెర్న్ (1932)
- మైథికల్ నరేటీవ్ (1935)
- బుక్ ఆఫ్ ఎక్సర్సైజేస్ (1940)
- షిప్స్ లాగ్ బుక్ I (1940)
- లాగ్ బుక్ II (1944)
- థ్రష్ (1947)
- లాగ్ బుక్ III (1955)
- త్రీ సీక్రెట్ పోయెమ్స్ (1966)
- వ్యాయామాలు బుక్ ఆఫ్ ΙΙ (1976)
మరణం
[మార్చు]జార్గోస్ సెఫెరిస్ 71ఏళ్ళ వయసులో 1971, సెప్టెంబర్ 20న గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరంలో మరణించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Eleni Kefala, Peripheral (Post) Modernity, Peter Lang, 2007, p. 160.
- ↑ నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (11 March 2019). "జార్గోస్ సెఫెరిస్". మామిడి హరికృష్ణ. Archived from the original on 23 March 2019. Retrieved 23 March 2019.
- ↑ "George Seferis Dies at 71; Poet W on '63 Nobel Prize". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). 1971-09-21. ISSN 0362-4331. Retrieved 23 March 2019.