తంబళ్లపల్లి
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°ECoordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | గిద్దలూరు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 2.96 కి.మీ2 (1.14 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 624 |
• సాంద్రత | 210/కి.మీ2 (550/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 956 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08405 ![]() |
పిన్(PIN) | 523357 ![]() |
తంబళ్లపల్లి, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[2].
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన రాచెర్ల మండలం, దక్షణాన కొమరోలు మండలం, ఉత్తరాన బెస్తవారిపేట మండలం, దక్షణాన కలసపాడు మండలం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. స్వాతంత్ర్యానికి మునుపు బ్రిటీషు హయాములో స్థాపించబడినది ఈ పాఠశాల 2004 లో ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరుపుకొన్నది. 5వ తరగతి వరకు ఈ పాఠశాలలోనే చదివి గ్రామ విద్యార్థులు ఉన్నత పాఠశాలకు 3 మైళ్ల దూరములో ఉన్న రాజుపాలెం గ్రామానికి వెళతారు.
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
మండల కేంద్రాలైన గిద్దలూరు, కొమరోలుల నుండి గ్రామానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించే బస్సు సౌకర్యము ఉంది. కడప నుండి మార్కాపురం వెళ్లే రాష్ట్ర రహదారి గ్రామానికి తూర్పున ఒక మైలు దూరములో ఉంది.
గ్రామ పంచాయితీ[మార్చు]
ఈ గ్రామం మండలంలోనే చిన్న పంచాయితీ. ఈ పంచాయితీలో గుమ్ముళ్లపల్లె (త్రిపురాంతకం) అనే చిన్న కుగ్రామం.కూడా ఉంది. రెండు గ్రామాలు కలిపి కూడా 500 కంటే మించి ఓటర్లు ఉండరు. ఈశాన్యాన హరిజనవాడ (పాలెం) ఉంది.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
- గ్రామంలోని రెండు ప్రధాన వీధుల కూడలిలో రామాలయము ఉంది.
- ఊరికి ఆగ్నేయ దిక్కున పొలిమేర్లలో కాశినాయన ఆశ్రమం ఉంది.
- శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015, ఆగస్టు-23వ తేదీ ఆదివారంనాడు, భక్తులు, ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు చేపట్టినారు. మద్యాహ్నం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [2]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 624 - పురుషుల సంఖ్య 319 - స్త్రీల సంఖ్య 305 - గృహాల సంఖ్య 169
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 586.[3] ఇందులో పురుషుల సంఖ్య 295, మహిళల సంఖ్య 291, గ్రామంలో నివాస గృహాలు 150 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 296 హెక్టారులు.అక్షరాస్యత: 34.81 శాతం, పురుషుల అక్షరాస్యత: 51.18 శాతం, స్త్రీల అక్షరాస్యత: 18.21 శాతం.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-24; 4వపేజీ.