నరవ (గిద్దలూరు)
![]() | ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°ECoordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | గిద్దలూరు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 6.82 కి.మీ2 (2.63 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 2,503 |
• సాంద్రత | 370/కి.మీ2 (950/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 987 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08405 ![]() |
పిన్(PIN) | 523357 ![]() |
నరవ, ప్రకాశం జిల్లా, గిద్దలురు మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్: 523 357., ఎస్.టి.డి.కోడ్ = 08405.
గ్రామం పేరువెనుక చరిత్ర[మార్చు]
రెండు కొండల మధ్య సందులో సాగే దారిని నరవ అంటారు. ఈ గ్రామం రెండు కొండల మధ్య ఉండటము వలన గ్రామానికి ఆ పేరు వచ్చింది.
గ్రామ భౌగోళికం[మార్చు]
నరవ గ్రామం, మండల కేంద్రమైన గిద్దలూరు నుండి తూర్పు వైపున 3 కిలోమీటర్ల దూరములో గిద్దలూరు - కొమరోలు మార్గమున ఉంది.
సమీప గ్రామాలు[మార్చు]
కొంగలవీడు 2 కి.మీ,ముండ్లపాడు 4 కి.మీ,కొమ్మునూరు 5 కి.మీ,అంబవరం 6 కి.మీ,కంచిపల్లి 7 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
తూర్పున కొమరోలు మండలం,ఉత్తరం రాచెర్ల మండలం,దక్షణం కలసపాడు మండలం,ఉత్తరం బెస్తవారిపేట మండలం.
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
నరవ గ్రామంలో, 1892 లో బోర్డు స్కూలు ఏర్పాటు చేసారు. తరువాత గుర్తింపు వచ్చింది. [2]
గ్రామ పంచాయతీ[మార్చు]
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి బండి రాజమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
- ఈ గ్రామ పంచాయతీకి నూతన భవన నిర్మాణానికి, 2015,ఆగస్టు-15వ తేదీనాడు భూమిపూజ నిర్వహించారు. [4]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం[మార్చు]
నరవ బోడుపై ఒక ప్రాచీన నరసింహ స్వామి ఆలయము ఉంది. దీనిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిర్మించాడని స్థానికుల కథనం[3]. కానీ ఈ ఆలయం 1487కు పూర్వం కట్టబడిందనడానికి శాసనాధారాలు ఉన్నాయి.[4] ఇక్కడ ప్రతి యేడూ ఫాల్గుణ మాసంలో, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించెదరు. ఈ తిరుణాలకు చుట్టుపక్కల గ్రామాలనుండి పెద్దసంఖ్యలో తరలివస్తారు. కొండపైన ఆలయానికి వెళ్ళటానికి సోపానమార్గము ఉంది. ఈ ఆలయానికి నరవలో 5 ఎకరాలు, బయ్యనపల్లెలో 4.62 ఎకరాల, రంగారెడ్డిపల్లెలో 7.15 ఎకరాల మాన్యంభూములున్నవి. [3]
శ్రీ భృగుమల్లేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,503 - పురుషుల సంఖ్య 1,260 - స్త్రీల సంఖ్య 1,243 - గృహాల సంఖ్య 675
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,556.[5] ఇందులో పురుషుల సంఖ్య 1,299, మహిళల సంఖ్య 1,257, గ్రామంలో నివాస గృహాలు 662 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 682 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ రేనాటి సూర్యచంద్రులు - తంగిరాల సుబ్బారావు
- ↑ Lists of the antiquarian remains in the presidency of Madras
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
బయటి లింకులు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
- వికీమాపియాలో నరవకొండ
[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-24; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014,జూన్-6; 4వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-16; 5వపేజీ.