క్రిష్టంశెట్టిపల్లి
క్రిష్టంశెట్టిపల్లి | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°22′19″N 78°51′00″E / 15.372°N 78.85°ECoordinates: 15°22′19″N 78°51′00″E / 15.372°N 78.85°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | గిద్దలూరు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,209 హె. (5,459 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 8,253 |
• సాంద్రత | 370/కి.మీ2 (970/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08405 ![]() |
పిన్(PIN) | 523357 ![]() |
క్రిష్టంశెట్టిపల్లి, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం[1]. పిన్ కోడ్ నం.523357., ఎస్.టి.డి.కోడ్ = 08405.
గ్రామ చరిత్ర[మార్చు]
ఈ గ్రామ సమీపంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీ, బ్రిటీషు పోలీసులకూ నడుమ ఎన్ కౌంటర్ జరిగినట్టుగా చరిత్ర చెపుతుంది. బ్రిటిషు సైన్యం గిద్దలూరులో ఉండగానే నరసింహారెడ్డి సైన్యం క్రిష్టంశెట్టిపల్లె పై దాడిచేసి కొల్లగొట్టారు.
గ్రామ భౌగోళికం[మార్చు]
గిద్దలూరు, నంద్యాల మార్గంలో ఉన్న గ్రామం. గ్రామానికి సమీపంలో సగిలేరు నది ప్రవహిస్తున్నది.
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన రాచెర్ల మండలం, దక్షణాన కొమరోలు మండలం, ఉత్తరాన బెస్తవారిపేట మండలం, దక్షణాన కలశపాడు మండలం.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
వైద్య సౌకర్యం[మార్చు]
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
గ్రామంలో రాజకీయాలు[మార్చు]
ఈ గ్రామంలో అందరి పథం ఐకమత్యం.
గ్రామ పంచాయతీ[మార్చు]
- కృష్ణంశెట్టిపల్లె గిద్దలూరు మండలంలోని పెద్ద గ్రామాలలో ఒకటి.
- ఈ పంచాయితీ పరిధిలో అక్కలరెడ్డిపల్లె, దిగువమెట్ట, దిగువమెట్ట తాండా, ఉప్పలపాడు గ్రామాలు ఉన్నాయి.
- ఈ గ్రామానికి శివారు గ్రామాలు:- అక్కలరెడ్డిపల్లె, ఉప్పలపాడు, దిగువమెట్ట, దిగువమెట్ట తండా, చెంచుకాలనీ, పెద్దచెరువు, ప్రతాపరెడ్డి కాలనీ.
- ఈ గ్రామ పంచాయతీ 1955లో ఆవిర్భవించింది. గ్రామ పంచాయతీకి మొదటిసారి జరిగిన ఎన్నికలలో, గ్రామస్థులు శ్రీ పాలుగుళ్ళ చిన్నరంగారెడ్డిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామంలో విద్యుత్తు ఉపకేంద్రం, నాలుగు ఓవరుహెడ్డు ట్యాంకులు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. పంచాయతీ పరిధిలో మొత్తం మీద 1, 2 మినహా, అన్ని గ్రామాలకు రహదార్లను అభివృద్ధి పరచారు. కృష్ణంశెట్టిపల్లె, అక్కలరెడ్డిపల్లె, ఉప్పలపాడు గ్రామాలకు తారు రోడ్లు, గ్రామం నుండి కంచిపల్లె, కె.బైనపల్లె, వెంకటాపురం తండా మీదుగా బురుజుపల్లె వరకూ తారురోడ్డు, కృష్ణంశెట్టిపల్లెలో అంతర్గత రహదారులు సిమెంటు రహదారులుగా ఏర్పాటుచేసారు. ఎగువ భీమలింగేశ్వరాలయం నుండి ప్రతాపరెడ్డి కాలనీ మీదుగా దిగువమెట్ట తండా వరకూ తారు రోడ్డు నిర్మాణం పూర్తి అయినది. రైతులు డీప్ బోర్ల ఆధారంగా మిరప, టమాటా, చిక్కుడు వగైరా కూరగాయల పంటలు పండించి, వినుకొండ, తెనాలి, గుంటూరు మొదలగు ప్రదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వం ఎస్.టి. రైతులకు 130 డీప్ బోర్లను మంజూరు చేసినది. [2]
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ దిలావత్ శంకర్ నాయక్, 784 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పులి బాల అంకిరెడ్డి ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ ప్రార్ధనా ప్రదేశాలు[మార్చు]
ఎగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం[మార్చు]
- ఈ గ్రామంలో ఎగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం బాగా ప్రసిద్ధి పొందినది. దీనిని చాళుక్య భీముడు కట్టించినట్టుగా వినికిడి ఉంది. పాండవులలో ఒకడైన భీముడు, నల్లమల అటవీ ప్రాంతం గుండా అరణ్యవాసానికి శ్రీశైలం వెళుతూ క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో సగిలేరు సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడు. అప్పటి నుండి ఎగువ భీమలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
- ఈ ఆలయ ప్రాంగణంలో, 2015, మే నెల-22వ తేదీ శుక్రవారం ఉదయం, ఒక కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ మండపాన్ని, అక్కలరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దాతలు శ్రీ యర్రముద్ద వెంకటరెడ్డి, నిర్మలాదేవి దంపతులు విరాళంగా అందజేసినారు. [5]
దిగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం[మార్చు]
శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామివారి ఆలయం[మార్చు]
ఈ ఆలయం, ఎగువ భీమలింగేశ్వరస్వామివారి ఆలయంలోని ఒక ఉపాలయం. ఈ ఆలయంలో, 2015, మే నెల-22వ తేదీ శుక్రవారం నాడు, ఆలయ శిఖర, ధ్వజస్తంభ, కలశ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆ తరువాత, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన యజమానులకు బహుమతులు అందజేసినారు. [6]
శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]
శ్రీరామనవమి సందర్భంగా, ఈ గ్రామంలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని, వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. [4]
శ్రీ వాల్మీకి దేవస్థానం[మార్చు]
ఈ ఆలయంలో, 2015, అక్టోబరు-27వ తేదీ మంగళవారంనాడు, వాల్మీకి జయంతి సందర్భంగా విశేషపూజలు నిర్వహించారు. గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [7]
గణాంకాలు[మార్చు]
- 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7, 949.[2] ఇందులో పురుషుల సంఖ్య 3, 972, మహిళల సంఖ్య 3, 977, గ్రామంలో నివాస గృహాలు 1, 799 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 8, 253 - పురుషుల సంఖ్య 4, 262 - స్త్రీల సంఖ్య 3, 991 - గృహాల సంఖ్య 2, 028
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-22; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, ఫిబ్రవరి-17; 4వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014, ఏప్రిల్-10; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, మే-23; 4వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015, మే-23; 5వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2015, అక్టోబరు-28; 5వపేజీ.